మీ ఏటీఎం కార్డులు బ్లాక్ అయ్యాయేమో చెక్ చేస్కోండి | SBI blocks 6 lakh debit cards for Security breach

Sbi blocks 6 lakh debit cards for security breach

SBI blocks 6 lakh debit cards, ATM card pin change, SBI warns customers, SBI warns customers for ATM, SBI debit cards, SBI cards blocked, 6 Lakhs SBI cards blocked

SBI blocks 6 lakh debit cards for Security breach.

మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయ్యిందేమో చూస్కోండి

Posted: 10/19/2016 09:14 AM IST
Sbi blocks 6 lakh debit cards for security breach

దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుమారు 6 లక్షల డెబిట్ కార్డులను బ్లాక్ చేసేసింది. మూడో పార్టీ ఏటీఎం యంత్రాల ద్వారా పలు అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్టు గుర్తించిన ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు చెందిన 6.25 లక్షల డెబిట్ కార్డులను బ్లాక్ చేసింది. ఈ విషయం తెలియని ఖాతాదారులు డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎంలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు.

కార్డు బ్లాక్ చేసిన సంగతిని ఎస్ఎంఎస్, ఈమెయిళ్ల ద్వారా ఖాతాదారులకు తెలియజేస్తున్నట్టు ఎస్‌బీఐ అధికారులు చెబుతున్నారు. కార్డు బ్లాక్ అయినవారు దగ్గరల్లోని బ్రాంచ్‌కు వెళ్లి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గత నాలుగు రోజులుగా పలు అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడంతో కార్డులను బ్లాక్ చేశామని అధికారులు పేర్కొన్నారు.

అనుమానాస్పద లావాదేవీల బెడద ఒక్క ఎస్‌బీఐకే లేదని, ప్రైవేటు, విదేశీ బ్యాంకు కార్డులకు కూడా ప్రమాదం పొంచి ఉందని వివరించారు. నెల రోజుల క్రితం ఖాతాదారుల సమాచారం హ్యాక్ అయినట్టు గుర్తించే కార్డులను బ్లాక్ చేసినట్టు అధికారులు తెలిపారు. కార్డు బ్లాక్ కానివారు వెంటనే తమ పిన్ నంబర్లను మార్చుకోవాలని సూచిస్తున్నారు. సో... ఒకసారి మీ కార్డును కూడా చెక్ చేస్కోండి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SBI  Debit Cards  6 Lakhs  blocked  

Other Articles