Medha Patkar is a great warrior to oppose the SEZs and Narmada Bahcho peotest

Medha patkar is a great warrior to oppose the sezs and narmada bahcho peotest

Medha patkar, Indian Women, Indian Women legecy, Narmadh Bacho, AAP, Medha Patkar in AAP

Medha Patkar is an Indian social activist and social reformer turned politician. She is the founder member of Narmada Bachao Andolan and was National Convener of National Alliance of People's Movements , an alliance of progressive people's organisations

వనితాలోకంలో ఓ యోధ.. ఉద్యమంలో మేధ మేధా పాట్కర్

Posted: 11/27/2015 01:27 PM IST
Medha patkar is a great warrior to oppose the sezs and narmada bahcho peotest

మనిషి మనసులోనే యుద్దం పుడుతుంది అన్న మహానుభావుల మాటలు ఎంత నిజమో.. ఒక్క మేధావి కదం తొక్కితే ఎలా ఉంటుందో చూపించారు మేధా పాట్కర్. రైతుల గురించి మాట్లాడే మాటలకు, చేసే చేతలకు సంబందం లేని నాయకులను నిలదీసింది.. నర్మదా నదిని రక్షించేందుకు నడుం బిగించింది. దేశంలో సెజ్ ల వల్ల రైతులకు, పేదలకు ఎంత నష్టమో కళ్లకు కట్టింది. మేధావుల మౌనం సమాజానికి చేటు చేస్తుంది అన్నట్లు మేదా పాట్కర్ లాంటి ధీర వనతి తన మాటలతో సమాజంలో మార్పులు, చైతన్యాన్ని తీసుకువచ్చింది. వనితా లోకంలో, దేశ సంస్కరణల ముఖ చిత్రంలో తన స్థానాన్ని పదిలం చేసుకున్న మేధా పాట్కర్ గురించి మరిన్ని వివరాలు మీ కోసం..

నర్మదా బచావో ఉద్యమంతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ డిసెంబరు 1, 1954 న ముంబాయిలో జన్మించింది. తల్లితండ్రులు ఇందు, వసంత కనోల్కర్ ఇద్దరూ సామాజిక సేవా కార్యకర్తలు. టాటా సంస్థలో ఎం.ఏ.సోషల్ వర్క్, తరువాత 7 సంవత్సరాలు స్వచ్చంద సంస్థల్లో పనిచేసింది. భర్తతో సామరస్యంగా విడిపోయింది. 2014 ఎన్నికలలో ఈమె ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈశాన్య ముంబయి లోక్ సభ స్థానానికి పోటీ చేసారు, కాని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. మేధా పాట్కర్ కు 1991లో రైట్ లివ్లీహుడ్ అవార్డు, 1999లో ఎం.ఏ.థామస్ జాతీయ మానవ హక్కుల అవార్డు అభించాయి.

ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుతో భూ మాఫియాను ప్రోత్సాహించడమే.. అంటూ మేధా పాట్కర్ నినదించింది. ప్రత్యేక ఆర్థిక మండళ్లు రైతుల బతుకుల్ని నాశనం చేస్తున్నాయే తప్ప వారికి ప్రయోజనకరంగా లేవు అని గొంతెత్తింది. పంట భూములు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల చేతుల్లో పెట్టడమే ఆ మండళ్ల వెనక ఉన్న అసలు ఉద్దేశం అని తెలిపింది. ఆదివాసులు, రైతులు, పేదలు జీవించేందుకు వీలులేని పరిస్థితి పాలకులు కల్పిస్తున్నారని మండిపడింది. ఎస్‌ఈజడ్‌లు ఏర్పడితే నేరాలు కూడా పెరుగుతాయి. ..అభివృద్ధి పేరిట పాలకులు అన్నదాతకు ద్రోహం చేస్తున్నారని జాతిని జాగృతం చేసింది. దేశానికి వెన్నెముక అంటూనే పాలకులు రైతు వెన్ను విరుస్తున్నారు... పచ్చని పంట పొలాలను నిప్పచ్చరం చేసే ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించాలని చైతన్యం కలిగించింది. జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులు పెరగకపోవడానికి కారణం పెట్టుబదీదారులకు భూములు తెగనమ్మటమే... ఇలా భూములు అమ్మితే భవిష్యత్‌ తరాలకు ఉపాధి అవకాశాలు కరువవుతాయని వెల్లడించింది.

(Source: Wikipedia)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Medha patkar  Indian Women  Indian Women legecy  Narmadh Bacho  AAP  Medha Patkar in AAP  

Other Articles