The Biography Malladi Subbamma Who Is A Famous Feminist And Telugu Writer | Famous Women

Malladi subbamma biography telugu famous feminist writer

Malladi Subbamma, Malladi Subbamma history, Malladi Subbamma life story, Malladi Subbamma updates, Malladi Subbamma photos, Malladi Subbamma news, Malladi Subbamma images

Malladi Subbamma Biography Telugu Famous Feminist Writer : The Biography Malladi Subbamma Who Is A Famous Feminist And Telugu Writer.

‘స్త్రీ స్వేచ్ఛ’ కోసం ఉద్యమాలు చేసిన ప్రముఖ హేతువాది

Posted: 08/08/2015 05:33 PM IST
Malladi subbamma biography telugu famous feminist writer

కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే స్త్రీలకు సమాజంలో ఏమాత్రం గౌరవం లభించడం లేదు. చీకటిలో మునిగిన జీవితాల్లో వెలుగులా భరోసా కల్పించే స్త్రీల స్వేచ్ఛను ‘ఇల్లాలి’ అనే బానిస సంకెళ్లతో సమాజం హరిస్తోంది. ముఖ్యంగా 20వ శతాబ్దంలో అయితే మహిళల పరిస్థితి మరీ దారుణంగా వుండేది. అలాంటి సమయంలో కొందరు మహిళలు తమ స్వేచ్ఛాహక్కును పొందడం కోసం సమాజానికి వ్యతిరేకంగా గొంతెత్తారు. పురుషులతోపాటు తమకూ సమాన హక్కులు కల్పించాలంటూ ఉద్యమ పోరాటం కొనసాగించారు. అటువంటి వారిలో ‘మల్లాది సుబ్బమ్మ’ ఒకరు. ‘కేవలం పిల్లల్ని కంటూ, ఇంటి పనులు చేసుకొంటూ, అత్తమామల అదుపాజ్ఞలలో జీ వించడమే మహిళల కర్తవ్యమా?’ అని ప్రశ్నించిన ప్రముఖ స్త్రీవాద రచయిత్రి.

జీవిత చరిత్ర :

1924 ఆగస్టు 2వ తేదీన గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతార్లంకలో సుబ్బమ్మ జన్మించారు. ఈమెకి చిన్న వయస్సులోనే బాపట్ల వాస్తవ్యులైన మల్లాది వెంకట రామమూర్తితో వివాహం జరిగింది. అయితే.. జీవితంలో ఏదో సాధించాలనే పట్టుదలతో ఆమె భర్త సహకారంతో ఉన్నత విద్యనభ్యసించారు.  మెట్రిక్‌కి, పి.యు.సి., బి.ఎ., ఇలా వరుసగా చదివి, కుటుంబ నియంత్రణ ప్రచారకురాలిగా కొన్నేళ్లు ఉద్యోగం చేశారు. బాపట్లలో అయిదేళ్లు స్త్రీ హితైషిణీ మండలి కార్యదర్శిగా, బాలికా పాఠశాలకు మేనేజరుగా, శారదా మహిళా విజ్ఞాన సమితికి అధ్యక్షురాలిగా పనిచేస్తూ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో దిగారు.

1970లో విజయవాడలో వికాసం అనే పత్రిక స్థాపించి పదేళ్లు నడిపారు. 1980లో మహిళాభ్యుదయం అనే సంస్థను స్థాపించారు. అభ్యుదయ వివాహ వేదిక ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఆదర్శ వివాహాలు జరిపించారు. కుల నిర్మూలన, ఛాందస వ్యతిరేక పోరాటం, మూఢవిశ్వాస నిర్మూలన, స్త్రీ జనోద్ధరణ, కుటుంబ నియంత్రణ, స్త్రీ విద్యకోసం కృషి చేశారు. మహిళాభ్యుదయ గ్రంథాలయం, కుటుంబ సలహా కేంద్రం, స్త్రీ విమోచన శిక్షణ కేంద్రం, వరకట్న హింసల దర్యాప్తు సంఘం, స్త్రీల హక్కుల పరిరక్షణ కేంద్రం, శ్రామిక మహిళాసేవ, సుబ్బమ్మ షెల్టర్, మల్లాది సుబ్బమ్మ ట్రస్టు ద్వారా మహిళలకు సేవ చేశారు. ‘వికాసం’, ‘స్త్రీ స్వేచ్ఛ’ అనే మాస పత్రికకు సంపాదకురాలిగా ఉన్నారు. 1979 నుంచీ ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికీ, 1989 నుంచీ అఖిలభారత హేతువాద సంఘానికీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు.

ఈమె మహిళా జీవన విధానంపై ఎన్నో రచనలు చేశారు. బాల్యం, దాంపత్య జీవితం, మహిళలపై జరిగే అన్యాయాలు.. ఇంకా ఎన్నో రచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళోద్యమం - మహిళా సంఘాలు 1960-1993 అనే పుస్తకం.. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథం అవార్డు పొందింది. సంఘసేవకు గాను ఎమ్.ఎ.థావుస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డుపొందారు. ఈమె 2014 మే 15న మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malladi Subbamma  Telugu Writers  

Other Articles