The Biography Of Aruna Asaf Ali Who Was An Indian Independence Activist | Freedom Fighters

Aruna asaf ali biography indian independence activist freedom fighters

Aruna Asaf Ali biography, Aruna Asaf Ali history, Aruna Asaf Ali story, Aruna Asaf Ali news, Aruna Asaf Ali photos, Aruna Asaf Ali life story, Aruna Asaf Ali freedom fighter, indian freedom fighters, indian independence activists

Aruna Asaf Ali Biography Indian Independence Activist Freedom Fighters : The Biography Of Aruna Asaf Ali was an Indian independence activist. She is widely remembered for hoisting the Indian National Congress flag at the Gowalia Tank maidan in Bombay during the Quit India Movement.

క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ

Posted: 07/30/2015 05:38 PM IST
Aruna asaf ali biography indian independence activist freedom fighters

తెల్లదొరల చెరసాల నుంచి భారతీయుల్ని విముక్తి కల్పించడంలో చేసిన స్వాతంత్ర్య సమరపోరాటంలో మహిళలు సైతం తమవంతు కృషి చేశారు. దేశ స్వాంతంత్ర్యం మీద ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వారిలో చైతన్యం నింపారు. అలాంటి స్వాతంత్ర్యోద్యమ నాయకురాలలో అరుణా అసఫ్ అలీ ఒకరు. మహాత్మాగాంధీ ఆచరణలకు ప్రభావితురాలైన ఈమె.. స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకున్నారు. 1942లో గాంధీజీ జైలుకెళ్ళినపుడు ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళగా పేరుగాంచారు. ఆ ఉద్యమకాలంలో బొంబాయిలోని గవాలియా ట్యాంక్ మైదానంలో భారత జాతీయపతాకాన్ని ఎగురవేసిన మహిళగా ఈమె చిరస్మరణీయురాలు.

జీవిత విశేషాలు :

1909 జూలై 16వ తేదీన హర్యానాలోని కాల్కా ప్రాంతంలో ఒక బెంగాళీ బ్రహ్మసమాజ కుటుంబంలో అరుణా జన్మించింది. లాహోరు, నైనీతాల్ లలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈమె.. మహిళలకు అంతగా ప్రాధాన్యంలేని ఆనాటి కాలంలో ఉపాధ్యాయురాలిగా పనిచేసి, సాటి మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఈమె కలకత్తాలోని గోఖలే స్మారక పాఠశాలలో బోధించింది. ఆ సమయంలో ఈమెకు భారత జాతీయ కాంగ్రేసు నాయకుడైన అసఫ్ అలీతో అలహాబాదులో పరిచయమేర్పడింది. ఈ పరిచయం పెళ్ళికి దారితీసింది. అయితే.. వీరిద్దరి మతాలు వేరవడంతోపాటు వయోబేధం (20 ఏళ్లు తేడా) ఎక్కువగా వుండటంతో అరుణ తల్లితండ్రులు పెళ్లికి నిరాకరించారు. అయినప్పటికీ వారిద్దరి 1928లో పెళ్లి చేసుకున్నారు.

స్వాతంత్ర్యోద్యమంలో అరుణ పాత్ర :

అసఫ్ అలీతో వివాహం చేసుకున్న తర్వాత భారత జాతీయ కాంగ్రేసులో క్రియాశీలక సభ్యురాలిగా అరుణ ఎన్నుకోబడింది. ఆనాడు ఉప్పు సత్యాగ్రహంలో నిర్వహించిన బహిరంగ ప్రదర్శనల్లో ఈమె పాల్గొంది. అయితే.. ఆనాడు మహిళలకు సమాజంలో అంత ప్రాధాన్యం లేనిపక్షంలో ఈమెను దేశదిమ్మరి అనే అభియోగం మోపి అరెస్టు చేశారు. అందుకే.. రాజకీయ ఖైదీలందరి విడుదలకు తోడ్పడిన గాంధీ-ఇర్వింగ్ ఒప్పందముతో 1931లో ఈమెను విడుదల చేయలేదు.

కానీ.. ఆమెను కూడా విడుదల చేయాలని, లేకపోతే జైలును వదిలివెళ్లేది లేదని ఖైదులో వున్న ఇతర మహిళా పట్టుబట్టారు. అప్పుడు మహాత్మా గాంధీ కలుగజేసుకోవటంతో వారు తమ పట్టును సడలించలేదు. ఆ తరువాత ప్రజాఆందోళన వలన అరుణను విడుదల చేశారు. 1932లో తీహార్ జైళ్ళో రాజకీయ ఖైదీగా వున్న సమయంలో.. జైల్లో వున్న రాజకీయ ఖైదీల పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా అరుణ నిరాహారదీక్ష నిర్వహించింది. ఈమె ప్రయత్నం ఫలితంగా తీహర్ జైళ్లో రాజకీయ ఖైదీల పరిస్థితి మెరుగైంది. కానీ ఈమెను మాత్రం అంబాలా జైలుకు తరలించి ఒంటరి ఖైదులో ఉంచారు. జైలునుండి విడుదలైన తర్వాత ఈమె రాజకీయాల్లో తిరిగి పాల్గొనలేదు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈమె ఢిల్లీ నగరానికి మెట్టమొదటి మేయర్ గా నియమించబడ్డారు. స్వాతంత్ర్యోద్యమంలో ఈమె చేసిన సేవలకుగాను ‘భారతరత్న’ అవార్డు లభించింది. ఈమె 1996 జూలై 29న మరణించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aruna Asaf Ali  Indian Freedom Fighters  indian independence activists  

Other Articles