Information about chaitra hg

chaitra hg, Playback singer, biography, kannada , filmography, awards, celebrity,

Chaitra H. G. is a Hindustani classical and Playback singer, daughter of H. S. Gopinath (a tabla player).

తండ్రి సంగీతాన్నివారసత్వంగా పొందిన చైత్ర

Posted: 08/05/2013 07:50 PM IST
Information about chaitra hg

 

వారసత్వంగా కొంతమందికి తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు పంచుతుంటారు. అరుుతే ఆ తండ్రి మాత్రం తనకున్న సంగీత జ్ఞానాన్నే తన కూతురుకు అందించాడు. ఆ కూతురు కూడా తండ్రి ఆశను వమ్ము చేయలేదు. ఆయన ఆశించినట్లే గొప్ప సంగీత కళాకారిణిగా, గాయనిగా తన తండ్రి ఆశయాలను నెరవేర్చింది. వందల కొద్దీ పాటలు పాడి వేలాది మందికి ఆరాధ్యగాయనిగా మారింది. సంగీతాన్ని వారసత్వంగా పంచిన ఆ తండ్రి హెచ్‌.ఎస్‌ గోపీనాథ్‌. హిందూస్తానీ సంగీత సాగరంలో ఆయన గొప్ప తబలా వాద్యకారునిగా గుర్తింపు పొందారు. ఆయన కూతురే ఛైైత్ర. తండ్రి వారసత్వాన్ని పుణుకి పుచ్చుకుని తన కవల సోదరుడు ఛైతన్యతో కలిసి హిందుస్తానీ సంగీతంలో కచేరీలు చేస్తూనే సినిమా పాటలు పాడుతూ పలు అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది. ఎన్నో అవార్డులు పొందినా ఇప్పటికీ తాను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటూ తన గొప్పదనాన్ని చాటుకుంటోంది. పాటే తనకు ప్రాణమంటోంది. 

ఆ కుటుంబం సంగీత సాగరంలో ఒకభాగం. తండ్రి గొప్ప తబలా విధ్వాంసుడు. పిల్లలు సంగీతంలో ఎల్లలెరుగని గాయకులు. వారి సంగీతానికి, గానానికి ముగ్ధులవ్వని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. బెంగళూరు కవలలుగా గుర్తింపు పొందిన ఛైైత్ర, చైతన్యలు హిందుస్తానీ సంగీతంలో తమకంటూ ప్రత్యేకతను ఏర్పరుచుకోవడంతో పాటు తమ పాటలతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక తన తండ్రి వారసత్వంగా వచ్చిన సంగీతాన్ని కొనసా గించాలనే లక్ష్యమే ఛైత్రను గాయనిగా మార్చింది. అందుకు 16 సంవత్సరాలు హిందుస్తానీ సంగీతాన్ని సాధన చేసింది. ప్రముఖ హిందుస్తానీ సంగీత విద్వాంసులు డా.నాగరాజరావుహవల్ధార్‌ నేతృత్వంలో భీమ్‌సేన్‌ జోషి వద్ద ఛైత్ర సంగీతం నేర్చుకుంది. 

సంగీతంలో పడినా చదువును, ఆట, పాలను మాత్రం ఏనాడూ అశ్రద్ధ చేయలేదు. ఆటల్లోనూ చైత్ర తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదికుంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఛైత్ర బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో ఇన్ఫార్మెషన్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసింది. కేవలం చదువులోనే కాకుండా జిమ్నాస్టిక్స్‌, ఫెన్సింగ్‌(కత్తులతో ఆడే క్రీడ)లోనూ ఆమెకు ప్రవేశం ఉంది. మూడుసార్లు రాష్టస్థ్రాయిలో ఛాంపియన్‌గా కూడా నిలిచింది. స్పోర్ట్‌‌సలో కర్నాటక రాష్ట్రానికి ప్రాధినిత్యం వహించిన ఛైత్ర జాతీయ స్థాయిలోనూ సుమారు 20 సార్లు పాల్గొని రెండు విభాగాల్లోనూ పలు బంగారు పతకాలు సాధించింది.

ఛైత్ర తొలిసారి 1993లో సిని మా పాటపాడే అవకాశాన్ని పొం దింది. అప్పుడు ఆమె వయస్సు కేవలం 8 సంవత్సరాలే కావడం విశేషం. వి.మనోహార్‌ సంగీతం అందించిన ‘బేదా కృష్ణా రంగీ నట’ అనే కన్నడ చిత్రంలో పాడి న పాటతో ఛైత్ర పాటల పయనం మొదలైంది. అయితే పూర్తికాల గాయనిగా మారింది మాత్రం 2003లో వచ్చిన ‘భగవాన్‌’ చిత్రంతో. ఆ తర్వాత కన్నడలో అపూర్వ విజయం సాధించిన ‘అమృతధార’ చిత్రంలో పాడిన ‘హడుగా హడుగా’అనే గీతం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ పాట ఉత్తమ గాయనిగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును సాధించి పెట్టింది. 

ఛైత్ర ఇప్పటివరకు దక్షిణభారత భాషలైన కన్నడ, తమిళం, తెలుగు, బెంగాళీలలో సుమారు 350 పాటలు పాడింది. హంసలేఖ, గురుకిరణ్‌, రఘుదీక్షిత్‌శ్రీ, సాధుకోకిల, రాజేష్‌ రామ్‌నాథ్‌, మనోమూర్తి, ఆర్‌.పి పట్నాయక్‌, మణిశర్మ వంటి ప్రముఖ సంగీత దర్శకులందరితోనూ పనిచేసిన అనుభవం ఛైత్ర సొంతం. ప్రస్తుతం కన్నడ సినిమా పరిశ్రమలో ఛైత్ర లీడింగ్‌ సింగర్‌గా కొనసాగుతున్నారు. సినిమా పాటలతో పాటు ‘మస్త్‌ కాఫీ’అనే పాప్‌ ఆల్బమ్‌లోనూ ఛైత్ర ఇంగ్లీషు గీతాన్ని ఆలపించి ప్రసంశలు అందుకుంది.

ఛైత్ర కేవలం సినిమా పాటలే కాకుండా హిందుస్తాని సంగీతంలో తన కవల సోదరుడు ఛైతన్యతో కలసి ఇప్పటివరకు సుమారు మూడు వందలకు పైగా కచేరీలు నిర్వహించింది. బెంగళూరు ట్విన్స్‌గా గుర్తింపు పొందిన వీరిద్దరూ తమ తండ్రి పండిట్‌ గోపినాథ్‌తో కలసి అనేక క్లాసికల్‌, భక్తి కార్య క్రమాలు నిర్వహించారు. 2008లో అసోసియేషన్‌ ఆఫ్‌ కన్నడ కూటా స్‌ ఆఫ్‌ అమెరికా కార్యక్రమంలో భాగంగా చికాగో, ఇల్లినోయిస్‌, యూఎస్‌లతోపాటు కువైట్‌, దుబాయ్‌ యుఎఇలలో తన గళాన్ని వినిపించి వేలాది హృదయాలను ఉర్రుతలూ గించింది ఛైత్ర.

అవార్డులు

ఛైత్ర సంగీతంలో చూపిన ప్రతిభకు అనేక అవార్డులు ఆమెను వరించాయి. 

2005-06 సంవత్సరానికిగాను ఉత్తమ మహిళా గాయని రాష్ట్రప్రభుత్వ అవార్డు.

2007-08 సంవత్సరానికిగాను రోటరీ బెంగళూరు మిడ్‌టౌన్‌ అండ్‌ బ్రిగేడ్‌ గ్రూపు వారి యంగ్‌ అచీవర్‌గా ప్రత్యేక అవార్డు

‘అమృతధార’ చిత్రంలోని ‘హడుగా హడుగా’పాటకు గాను ఉదయ్‌టీవీ అవార్డు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles