70 gates of prakasam barrage lifted

70 gates of Prakasam Barrage lifted, Prakasam barrage, minister kavuri sambhasivarao, samaikyandhra sega, police fire, seemandhra movement,

70 gates of Prakasam Barrage lifted

ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తివేత-పోలీసుల జులుం

Posted: 09/18/2013 01:46 PM IST
70 gates of prakasam barrage lifted

ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లను ఈరోజు ఉదయం ఎత్తివేసిన అధికారులు 50,750 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. రేపు ఉదయానికల్లా గేట్లు మొత్తం ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు సాగర్ నుంచి లక్షా 70వేల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్‌కు వచ్చే అవకాశం ఉంది.

 

పోలీసుల జులుం

మండలం భైరవపట్నంలో పర్యటించేందుకు వస్తున్న కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావును అడ్డుకునేందుకు సమైక్యావాదులు ప్రయత్నించగా అపశ్రుతి చోటు చేసుకుంది. సమైక్యాంధ్రకోరుతూ తమ గోడును కావూరికి వివరించేందుకు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన జేఏసీ నేతలపై పోలీసులు విరుచుకుపడ్డారు. కావూరి రాకతో ఒక్కసారిగా భైరవపట్నం సెంటర్లలో తొక్కిసలాట జరిగింది. సమైక్యవాదులను ఒక్కసారిగా పోలీ సులు నెట్టేశారు. దీంతో కైకలూరుకు చెందిన జేఏసీ మహిళలు సుధారాణి సొమ్మసిల్లిపోగా, కళ్యాణి తీవ్రంగా గాయపడింది. గాయపడిన మహిళలను 108 ద్వారా కైకలూరు ఆస్పుత్రికి తరలించారు. దీనిపై అగ్రహించిన జేఏసీ నాయకులు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ, పోలీసులు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌చేశారు. ఎట్టకేలకు కైకలూరు సీఐ అశోక్‌కుమార్ గౌడ్ జేఏసీ నాయకులకు క్షమాపణచెప్పటంతో ధర్నా విరమించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more