బన్సల్ రైలుబండి జిల్లాకు నిరాశను మిగిల్చింది. 17 ఏళ్ళతర్వాత కాం గ్రెస్ పార్టీకి చెందిన మంత్రి రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టడం రైల్వేశాఖ సహాయమంత్రిగా మన రాష్ట్రానికి చెందిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఉండటం రాష్ట్రానికి, జిల్లాకు న్యాయం జరుగుతుందేమోనని ఆశించారు. కోటి ఆశలతో ఎదురుచూశారు. బడ్జెట్ ప్రవేశపెట్టేది మొదలు ముగిసే వరకూ జిల్లా వాసులు టీ వీలకు అతుక్కుపోయారు. ఎక్కడా ప్రయాణీకుల కోసం కొత్తరైళ్ళు, క్రొత్త రైలుమార్గాలు, అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులు వంటి ప్రకటనలు కనప డలేదు. వినపడలేదు. జిల్లా ప్రజల ఆశలు తుస్ మని పించిన బన్సల్ రైలుబండి రెడ్‌సిగ్నల్ ఇవ్వడంతో యధారాజ... తథాప్రజ... పరిస్థితే.
ఎంపీ ప్రతిపాదనలు బుట్టదాఖలు...
ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఎంపీ కొనకళ్ళ నారా యణరావు కేంద్ర రైల్వేమంత్రికి చేసిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. రాష్ట్రానికే సరైన ప్రాధాన్యం ఇవ్వని పరిస్థితితోపాటు ప్రతిపక్ష ఎంపీ కావడం ఆయన చేసిన ప్రయాణీకులకు అవసరమైన ప్రతిపా దనలు కేంద్రమంత్రి అటకెక్కించారు. ఎంతోకాలం గా కోస్తా ప్రాంత వాసులు ఎదురుచూస్తున్న మచిలీ పట్నం-రేపల్లె కొత్త రైలుమార్గం నిర్మాణానికి బడ్జె ట్‌లో చోటే దక్కలేదు. విజయవాడ నుంచి డబు ల్‌లైన్, విద్యుదీకరణ, చెనై, ముంబై, హైదరాబాద్‌లకు కొత్తగా రైళ్ళు నడపాలని ఎంపీ ప్రతిపాదించారు. మోడల్ రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్ది ప్రయాణీకుల భద్రత కోసం ఆర్‌పీఎఫ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎంపీ కొనకళ్ళ నారాయణరావు కోరారు. వీటన్నింటినీ పరి శీలించిన దాఖలాలు సైతం లేకపోవడం ప్రయాణీ కుల ప్రయోజనాల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్షానికి నిదర్శనం.
రైల్‌నీర్‌తో సరి!
విజయవాడ రైల్వేస్టేషన్ ప్రయాణీకుల కోసం బాటి లింగ్ వాటర్ ప్లాంటు ఏర్పాటు, రాష్ట్ర ప్రభుత్వ సహ కారంతో కొండవల్లి-కొత్తగూడెం నూతన రైలు ప్రాజె క్టుకు బడ్జెట్‌లో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆ ప్రాంత ప్రజ లకు ఊరట కలిగించే అంశమే ఐనప్పటికీ రాష్ట్రప్రభు త్వం సహకారం అనే ముడిపెట్టడం ఈ ప్రాజెక్టు పురోగతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక్కరైలు లేదాయె!
జిల్లాకు బడ్జెట్‌లో ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైలు ఒక్కటి కేటాయించలేదు. మొత్తం 67 ఎక్స్‌ప్రెస్, 27 ప్యాసిం జర్ రైళ్ళను ప్రకటించినప్పటికీ జిల్లాకు మొండిచేయి చూపారు. 347 అత్యధిక ప్రాధాన్యత కలిగిన ప్రాజె క్టుల్ని గుర్తించామని ప్రకటించారు. వీటిలో జిల్లాకు చెందిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందో? లేదో? లక్షా 94 వేల కోట్లతో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో నామమా త్రంగానైనా స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించక పోవడం విమర్శలకు తావిస్తోంది. వరుస నష్టాల వలన కొత్త ప్రాజెక్టులకు అవరోధంగా ఉందంటూ కేంద్ర మంత్రి బన్సల్ వివరణ ఇవ్వడం విశేషం. ఐతే రైలు ఛార్జీలు పెంచకుండా ఉండటం ప్రయాణీకు లకు ఊరట కలిగించే అంశం.
చేతకాని చవటలు- ఎంపీ కొనకళ్ళ నారాయణరావు
తొమ్మిదేళ్ళుగా ప్రతిబడ్జెట్‌లో రాష్రానికి, జిల్లాకు అన్యాయమే జరుగుతోంది. దీనికి కారణం 31 మంది ఎంపీలు, 10 మంది కేంద్రమంత్రులు ఉండీ రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు కాపాడడంలో విఫలమయ్యారనీ ఎంపీ కొనకళ్ళనారాయణరావు ధ్వజమెత్తారు. చేతకానిచవటలు ఓటమిని అంగీ కరించి రాజీనామా చేస్తే గౌరవంగా ఉంటుందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉం డటమే అన్ని రంగాల్లో నాశనం అవుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ రూపంలో రాష్ట్రానికి దౌర్భాగ్యం పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దురదృష్టకరం- ఎంఎల్‌ఏ పేర్నినాని
రాష్ట్రంలో 31 మంది ఎంపీలు, కేంద్రరైల్వేశాఖ సహాయ మంత్రి ఉండీ జిల్లాకు ప్రయోజనం కలిగేలా వ్యవహరించకపోవడం దురదృష్టకరమని ఎంఎల్‌ఏ పేర్ని వెంకట్రామయ్య నాని అన్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా ఈ సమయంలో కూడా మేలు చేయకపోవడం కేంద్ర ప్రభుత్వం శైలి బాధాకరంగా ఉందన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more