No effect of samaikyandhra sega on gold offering to sri venkateswa swami

No Effect of Samaikyandhra sega on Gold Offering to sri venkateswa swam, Samaikyandhra sega on Gold Offering to sri venkateswa swami, Samaikya Sega Effect on Tirupati Devasthanam

No Effect of Samaikyandhra sega on Gold Offering to sri venkateswa swami

శ్రీవారికి పండిన బంగారం

Posted: 09/06/2013 05:29 PM IST
No effect of samaikyandhra sega on gold offering to sri venkateswa swami

కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వరుడి క్షేత్రం తిరుమల. సీజన్‌తో సంబంధం లేకుండా భక్తజనం తిరుమలకు పోటెత్తుతుంది. నెలన్నర నుంచి జరుగుతున్న నిరసనలతో సీమాంధ్ర అస్తవ్యస్ధంగా తయారైంది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో నిరవధికంగా బంద్‌లు జరుగుతుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. అయితే నగదు లేక శ్రీవారి హుండీ వెలవెల బోయినా బంగారంతో కళకళలాడుతోంది. వడ్డీకాసులవాడికి వడ్డీ కట్టలు కట్టలుగా వస్తోంది. ఆగస్టులో వెంకన్నను దర్శించుకున్న భక్తులు భారీగా బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. 17 లక్షలకు పైగా తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి 117 కిలోల బంగారాన్ని సమర్పించారు. దీని విలువ రూ.66 కోట్లకు పైమాటే. గత ఏడాది ఆగస్టులో భక్తజనం 120 కిలోల పుత్తడిని హుండీలో వేశారు. ఈ ఆగస్టులో ఇంచు మించు అదే రికార్డ్ స్ధాయి బంగారం సమర్పించారు. కాగా ఇటీవల విరిగిపోయిన శ్రీవారి పాదాలస్ధానంలో కొత్త పాదాలను ఏర్పాటు చేయనున్నట్లు టిటిడి ఈవో శ్రీనివాసరావు తెలిపారు. విరిగిపోయిన పాదాలు కేవలం రక్షణ కవచాలు మాత్రమేనని ఆయన చెప్పారు. మరోవైపు శ్రీవారి అసలు పాదముద్రలు అడుగున భద్రంగా ఉన్నాయని దేవస్ధానం అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles