Cpi narayana senstional comments on kcr

cpi narayana senstional comments on kcr, cpi leader narayana, cpi party, congress party, trs party, kcr, telangana issue, tealngana state, cpi state secretary narayana

CPI Narayana Senstional Comments on KCR

కేసీఆర్ కు అది లేదు..

Posted: 07/13/2013 11:19 AM IST
Cpi narayana senstional comments on kcr

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై టీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు చిత్తశుద్ది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణ తిరుపతిలో ఆరోపించారు. అందువల్లే తెలంగాణ జేఏసీకి దూరంగా ఉంటున్నామని ఆయన పేర్కొన్నారు. వామపక్ష భావాలు ఉన్న పార్టీలతో కలిసి తెలంగాణ ప్రత్యేక రాష్టం కోసం పోరాడుతామని చెప్పారు. ఈ నెల 17 తర్వాత తెలంగాణ సాధన కోసం నిరవధిక ఆందోళన చేస్తామని నారాయణ తెలిపారు. 2014లోపు తెలంగాణ సమస్య పరిష్కరించకుంటే కాంగ్రెస్ పార్టీకి సమాధి కడతామని నారాయణ హెచ్చరించారు. అయితే కేజీ బేసిన్ లోని సహాజ వాయువును రిలయన్స్ సంస్థ దోచుకుంటుందని ఆయన ఆరోపించారు. అందుకు నిరసనగా ఈ నెల 15న కాకినాడలో ఆందోళన చేయనున్నట్లు కే.నారాయణ చెప్పారు. జైలు శిక్షపడిన వారు ఎలక్షన్స్‌లో పోటీకి అనర్హులని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఆ అంశంపై ప్రజల్లో చర్చ జరగాల్సి ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles