Winter fashion tips for women

winter fashion tips for women, fashion tips, beauty tips, healthy tips for women, beauty tips for women, winter season, face wash, fairness creams, lipsticks, women fashion tips, winter fashion tips

winter fashion tips for women, fashion tips, beauty tips, healthy tips for women, beauty tips for women, winter season, face wash, fairness creams, lipsticks, women fashion tips, winter fashion tips

శీతాకాలంలో అందంగా కనిపించేందుకు చిట్కాలు

Posted: 03/07/2014 11:10 AM IST
Winter fashion tips for women

శీతాకాలంలో అమ్మాయిలు తమ అందాన్ని కాపాడుకోవడానికి అనేక రకాల మేకప్ పద్ధతులను అవలంభిస్తారు. చర్మం పొడిగా కాకుండా మృదువుగా వుంచుకోవడానికి అనేక రకాల ఫెయిర్ నెస్ క్రీములను ఉపయోగిస్తారు. కొంతమంది అమ్మాయిలైతే ఇంటినుండి బయటికి రావడానికి భయపడిపోతుంటారు. మరికొంతమంది ముఖానికి స్కార్ఫ్ వంటివి కట్టుకుని తిరుగుతూ వుంటారు. అలాకాకుండా కొన్ని చిట్కాలను నిపుణులు మనకు తెలుపుతున్నారు. 

మొదటగా మీ చర్మాన్ని పరిశుభ్రంగా, స్వచ్ఛతగా వుంచుకోవడానికి ఎల్లప్పుడూ మాయిశ్చరైజింగ్ (తేమగా) చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చర్మం తేమగా వుండటం వల్ల చర్మం పొడిగాగాని, బిగుతుగా అవ్వుకుండా... చాలా మృదువుగా తయారవుతుందని సూచిస్తున్నారు. 

అలాగే మీ చర్మం ఏ రంగు (నలుపు లేదా తెలుపు)లో అయితే వుందో... దానికి సంబంధించిన మంచి క్రీములను వాడండి. సాధ్యమైనంతవరకు ఒక క్రీమునే వాడెందుకు ప్రయత్నించండి. రకరకాల క్రీములను ఒకేసారి వాడటం వల్ల అందులో వున్న రసాయనాలు చర్మాన్ని దెబ్బతీసే అవకాశం వుంటుంది. 

ఇక కళ్ల విషయానికొస్తే.... శీతాకాలంలో కళ్లు క్లాసీగా కనిపించేందుకు కంటికి చివరగా మెటాలిక్ షేడ్స్ ని వాడితే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. కోల్, లైనర్, మస్కారా వంటి వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. 

సాధారణంగా శీతాకాలంలో పెదాలు చాలా త్వరగా పొడిగా తయారయిపోతాయి. అలా అవ్వడం వల్ల సరిగా నవ్వడానికి కూడా వీలుండదు. అటువంటి సమయాల్లో లిప్ బామ్ ఉపయోగిస్తే చాలా మంచిది. ఇంకా బాగా ముదిరిన రంగుల లిప్ బామ్ లను వాడితే ఎంతో ఆకర్షణీయంగా కనబడటమే కాకుండా, పెదాలు పొడిగా మారవు. 

ముఖ్యంగా శీతాకాలంలో కేశాలంకరణ మరింత జాగ్రత్తగా చేసుకోవాల్సి వుంటుంది. ఎక్కువ వేడిగా వున్న నీటిని కాకుండా, గోరువెచ్చగా వున్న నీటితోనే స్నానం చేయాలి. అలాగే కండిషనర్ షాంపూస్ చాలావరకు ఉపయోగించాలి. జుట్టు పొడిగా అవకుండా తక్కువ మోతాదులో ఆయిల్ ను పట్టించుకోవడం చాలా మంచిది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Summer tips to remove sweat stink from body

    చెమట దుర్వాసనను నివారించే సమ్మర్ టిప్స్

    Jun 11 | వేసవికాలం వచ్చిందంటే చాలు... చాలామంది ఇంటి నుంచి బయటకు రావడమే మానేస్తారు. వేసవిలో భూమి, సూర్యునికి కొద్ది దగ్గరగా వెళతాడు. దాంతో సూర్యుని ప్రతాపం భూమి ఎక్కువ అవుతుంది. సూర్యుని నుంచి వెలువడే కిరణాలు... Read more

  • Eye beauty tips for women

    ఆకర్షణీయమైన కళ్లకోసం సౌందర్య చిట్కాలు

    May 14 | కళ్లు... మహిళల అందాలను మరింత ఆకర్షణీయంగా పెంపొందించడంలో ఎంతో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. సాధారణంగా మహిళలు తమ హావభావాలను కూడా ఈ కళ్ల ద్వారా వెల్లడిస్తారు. అమ్మాయిల అందం సాధ్యమైనంతవరకు కళ్ల మీదే ఆధారపడి... Read more

  • Healthy tips for good looking

    అందమైన లుక్ కోసం ఆరోగ్య మార్గాలు

    Apr 29 | రోజువారిగా నిర్వహించుకునే కార్యకలాపాలలో కొన్ని ప్రణాళికబద్ధమైన మార్పులను తెచ్చుకుంటే.. రోజంతా అందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా గడపచ్చు. అదెలా అంటే... అందాన్ని పొందడం కోసం ఎంత డబ్బు ఖర్చు చేసినా.. ముఖంపై చిరునవ్వు లేకపోతే సహజ... Read more

  • Wedding tips for bride

    పెళ్లికుముందు ఉపయోగపడే వెడ్డింగ్ బ్యూటీ టిప్స్

    Apr 24 | పెళ్లికానున్న ప్రతిఒక్క మహిళ తాను ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటుంది. దానికి సంబంధించిన రకరకాల పద్ధతులను కూడా అవలంభించుకుంటారు. చర్మం నిగనిగలాడేందుకు, జుట్టు రాలకుండా వుండేందుకు, చేతులు మృదువుగా కనిపించేందుకు... ఇలా రకరకాలుగా... Read more

  • Eye makeup tips for women

    అద్దాలు పెట్టుకునే అమ్మాయిలకు ఐ టిప్స్

    Apr 22 | సాధారణంగా కళ్లద్దాలను కంటిలోపం వున్నవారు, ఇన్ఫెక్షన్ వున్నవారు వాడుతారు. కానీ ప్రస్తుతకాలంలో కూడా ఈ కళ్లద్దాలను వాడటం ఒక ట్రెండ్ అయిపోయింది. అమ్మాయిలు అందంగా కనిపించడానికి రకరకాల కళ్లద్దాలు కూడా మార్కెట్లలో లభ్యమవుతున్నాయి. ఇవి... Read more