First Aid and Emergency Treatment Guide

Value first aid kit to save life

First Aid, First Aid Value, First Aid Methods, First Aid Details, First Aid Equipment, First Aid Value, Health Tips, Tip Of The Day, First Aid Health Tip

First Aid for the Basic Sciences to save a life. Emergency Treatment Guide and don'ts Details.

ఫస్ట్ ఎయిడ్- చిన్న సాయం.. ప్రాణ దానం

Posted: 06/27/2017 02:45 PM IST
Value first aid kit to save life

ఏటా మన దేశంలో ఎన్నో వేల సంఖ్యలో ప్రమాదాల బారిన పడి ప్రజలు విగతజీవులుగా మారుతున్నారు. అయితే యాక్సిడెంట్ జరిగిన వెంటనే వారికి అందించే తక్షణ సాయం అందిస్తే మాత్రం వారు బతికే అవకాశాలు కూడా ఉంటాయి. దాన్నే ఫస్ట్ ఎయిడ్ లేదా ప్రాథమిక వైద్య సాయం అంటారు. చేసిది చిన్న సాయమే అయినా దాంతో నిండు జీవితాలను నిలబెట్టవచ్చు. తక్షణం వైద్య సాయం సాలీనా మూడింట ఒక వంతు మంది ప్రాణాలు నిలబడుతున్నాయని ఓ సర్వే కూడా తేల్చింది.

ఫస్ట్ ఎయిడ్ కిట్..

డ్రస్సింగ్ కోసం స్టెరిల్ గాజ్ ప్యాడ్లు. గాయంపై పెట్టేందుకు వీలుగా చిన్న, మధ్య, పెద్ద సైజులవి తీసుకోవాలి. గ్యాజ్ ప్యాడ్ కదలకుండా కట్టు కట్టేందుకు రోలర్ బ్యాండేజ్ లు. అడెసివ్ టేప్. అడెసివ్ బ్యాండేజెస్. కత్తెర. ట్వీజర్ (చిన్న పట్టకార). సేఫ్టీ పిన్లు. యాంటీసెప్టిక్ వైప్స్. ఇన్ఫెక్షన్ రాకుండా నివారించే డెట్టాల్ లేదా శావలాన్. నొప్పి నివారిణి ఐబూప్రోఫెన్ మాత్రలు. థెర్మోమీటర్. లేటెక్స్ హ్యాండ్ గ్లోవ్స్. వీటిలో కొన్నింటికి ఎక్స్ పైరీ తేదీ ఉంటుంది. ఆ తేదీ తర్వాత వాడిని వాడకూడదు. కనుక ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఐటమ్స్ పై ఉన్న తేదీలను గమనిస్తూ గడువు దాటిన వాటిలో కొత్తవి కొనుగోలు చేసి ఉంచుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్ ను ఎండ తగలని పొడి, చల్లటి ప్రదేశంలో భద్రపరచాలి.

అధిక రక్తస్రావం అవుతుంటే...

ప్రమాదం జరిగిన వెంటనే చేసే మొదటి పని ఆంబులెన్స్ కి సమాచారం అందించటం. అయితే ఈ కాల వ్యవధిలో ఆలస్యం చేయకుండా రక్తస్రావాన్ని నివారించే చర్యలు తీసుకోవాలి. గాయం నుంచి తీవ్ర రక్తస్రావం అవుతుంటే వెంటనే గాజుగుడ్డతో గాయంపై బలంగా అదిమి ఉంచాలి. దాంతో రక్త ప్రవాహం నిదానిస్తుంది. అత్యవసర వైద్య సిబ్బంది అప్పటికీ రాకుంటే స్వయంగా లేదంటే ఇతరుల సాయంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించాలి. అప్పటి వరకూ గాయంపై చేతిని అదిమే ఉంచాలి. ఇలా రక్తస్రావాన్ని చేతితో అదుపు చేసే ముందు అందుబాటులో గ్లోవ్స్ ఉంటే వాటిని చేతికి ధరించడం రోగికి సురక్షితం.

అధికంగా రక్తస్రావం అయ్యే గాయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కడగరాదు. దీనివల్ల రక్తాన్ని గడ్డకట్టించే కణాలు కూడా వెళ్లిపోయి మరింత రక్తస్రావం అవుతుంది. చిన్న గాయాలైతే కొద్ది సేపటికి రక్తస్రావం ఆగిపోతుంది. ఆ తర్వాత గాయంపై మట్టి, మురికి పోయేందుకు శుభ్రమైన నీటితో కడిగి యాంటీ సెప్టిక్ లోషన్ తో క్లీన్ చేసి గాజుగుడ్డతో కట్టేయవచ్చు. ముక్కులోపలి రక్తనాళాలు చిట్లడం వల్లే రక్తస్రావం అవుతుంది. ఇలా చిన్న గాయం కారణంగానూ జరుగుతుంది. ఎందుకంటే ముక్కలోపలి రక్త నాళాలు చాలా సున్నితంగా ఉంటాయి. ముక్కు నుంచి రక్తం కారుతుంటే తలను వెనక్కి వాల్చకుండా చూసుకోవాలి. ఎందుకంటే తలను వెనక్కి వాల్చితే ముక్కునుంచి విడుదలయ్యే రక్తం శ్వాస నాళిక ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంటుంది. ఆ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకోవాలని సూచించొచ్చు.

సీపీఆర్...

ప్రమాదానికి గురైన వ్యక్తిలో నాడి స్పందనలు లేకుంటే, శ్వాస తీసుకోవడం లేదంటే వెంటనే సీపీఆర్ చేయాలి. అంటే గుండెని తిరిగి పనిచేసేలా చేయడం. కార్డియాక్ అరెస్ట్ జరిగిన సమయాల్లో వెంటనే గుండె పై భాగంలో రెండు చేతులను ఉంచి కుదుపునకు గురి చేయాలి. బాధితుని నోరు తెరిచి తమ నోటితో లోపలికి గాలిని గట్టిగా వదలడం వంటి చర్యలు తీసుకోవాలి. ఇలా చేస్తున్న సమయంలో చేతి వేళ్లతో బాధితుని ముక్కు రంధ్రాలను మూసివేసి ఉంచాలి. రక్త ప్రసరణ, శ్వాస తీసుకోవడం తిరిగి ఆకస్మికంగా ప్రారంభమయ్యే వరకూ ఈ చర్యల్ని కొనసాగించాలి.

హార్ట్ ఎటాక్
మనకు సమీపంలో ఎవరైనా హార్ట్ ఎటాక్ కు గురైనట్టు గుర్తిస్తే వారిని కూర్చోబెట్టాలి. వారిని మాడ్లాడించకుండా ఉండాలి. ఛాతీనొప్పి లేదా గుండెకు సంబంధించి ఏవైనా మందులు వాడుతున్నారేమో కనుక్కుని వాటిని (నైట్రోగ్లిజరిన్ వంటివి) వెంటనే వేయవచ్చు. నైట్రో గ్లిజరిన్ ఇచ్చిన మూడు నిమిషాల తర్వాత కూడా నొప్పిగానే ఉంటే... బాధితుడు అపస్మారకస్థితిలోకి వెళుతుంటే, లేక స్పందించలేని స్థితిలో ఉంటే నిమిషాల్లోనే ఆస్పత్రికి తరలించడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చు. హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తికి నోటి ద్వారా మందు బిళ్ల తప్ప ఇతరత్రా ఇంకేదీ ఇవ్వకూడదు. వీరికి ఈ సమయంలో సీపీఆర్ ప్రక్రియ చేయడం ప్రాణాలను నిలబెడుతుంది.

శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే వారిని బల్లపై లేదా ఫ్లాట్ గా ఉన్న చోట పడుకోబెట్టి చాతీపై రెండు చేతులతో కుదుపునకు గురిచేయాలి. ముక్కును మూసి నోటిలో నోరు పెట్టి గట్టిగా గాలిని వదలాలి. చేతితో గుండె పై భాగంలో 30 సార్లు ఒత్తిడితో కుదుపునకు గురి చేసిన తర్వాత నోటిలో నోరు పెట్టి గాలి వదలడాన్ని రెండు సార్లు చేయాలి. ఇలా వైద్య నిపుణుల వద్దకు సదరు వ్యక్తిని చేర్చే వరకూ లేదా 108 సిబ్బంది వచ్చే వరకూ కొనసాగించాలి. 1 - 8 ఏళ్లలోపు వయసున్న చిన్నారులైతే ఒక్క చేతినే కుదుపునకు వినియోగించాలి. ఏడాదిలోపు చిన్నారులైతే రెండు వేళ్లతోనే కుదుపునకు గురిచేయాలి. నోటిలో నోరు పెట్టి బలంగా కాకుండా చిన్నగా గాలి వదలాలి. తలను వెనక్కి వాల్చడం, గడ్డాన్ని పైకి ఎత్తడం చేయరాదు.

ఇవి చేయరాదు...

ఒకవేళ బాధితుడికి ప్రాణాపాయం లేకుంటే, వెన్నుపూస గాయం అయినట్టు అనిపిస్తే రోగిని ప్రమాద స్థలం నుంచి కదిలించే ప్రయత్నం చేయరాదు. ఫ్రాక్చర్ అయితే ఆ భాగంలో పట్టుకోరాదు.

ఒళ్లు చల్లబడి, మగత స్థితిలోకి వెళుతున్నట్టు కనిపిస్తే... దీనర్థం శరీరమంతటా రక్తప్రసరణ సరిగా జరగడం లేదని. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిగా భావించాలి. ఈ స్థితిలో ఆలస్యం చేస్తే ప్రాణాలు దక్కవు. ఇలా ఉంటే శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ అందక హార్ట్ ఎటాక్ లేదా అవయవ వైఫల్యాలకు దారితీస్తుంది.

యాక్సిడెంట్ లో షాక్ కు గురైనట్టు అనిపిస్తే వెంటనే ఆ వ్యక్తి కాళ్లను ఎత్తులో పెట్టాలి. దీంతో గుండె, మెదడుకు రక్తం అందుతుంది. దానివల్ల ప్రాణాలు నిలబడతాయి. శరీరంలో ఛాతీ పై భాగంలో గాయాల కారణంగా రక్తస్రావం అవుతుంటే నివారించేందుకు తల భాగాన్ని ఎత్తులో ఉంచేలా చూడాలి.

తలకు గాయం కారణంగా అపస్మారక స్థితిలోకి వెళితే వెంటనే అత్యవసర సహాయ నంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలి. మైకంలో ఉండడం, తలనొప్పి, అయోమయం, అస్వస్థతగా ఉండడం, చూపు మసకబారడం, ఏం జరిగిందో తెలియకపోవడం ఇవన్నీ కూడా తలకు గాయం కారణంగా, షాక్ వల్ల ఎదురయ్యే లక్షణాలు. ఈ సమయాల్లో నొప్పి నివారిణి మాత్రలు ఇవ్వరాదు. దీనివల్ల తీవ్ర గాయం తాలూకూ లక్షణాలను తెలియకుండా అవి చేస్తాయి.

కరెంట్ షాక్ తగిలితే...

మెదడుకు తగినంత రక్త సరఫరా జరగదు. అంటే ఆక్సిజన్ తగినంత అందదు. దీంతో మూర్చపోవడం, తల తిరగడం వంటివి కనిపిస్తాయి. ప్రమాదానికి గురై రక్తాన్ని కోల్పోయినప్పుడు, వంట్లో నీరు, లవణాలను కోల్పోయినప్పుడు, ఏదైనా సీరియన్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, తీవ్రంగా కాలిన గాయలైనప్పుడు షాక్ కు లోనవుతారు. రక్తనాళాల్లో తగినంత రక్తం లేనప్పుడు రక్తపోటు బాగా పడిపోతుంది. దాంతో మెదడుకు ఆక్సిజన్ చాలా తక్కువగా వెళుతుంది. ఈ సమయాల్లో వ్యక్తులను బల్లపరుపుగా ఉన్న చోట పడుకోబెట్టి కాళ్లను పైకి ఎత్తి ఉంచాలి. వ్యక్తి శరీరం వెచ్చగా, సౌకర్యంగా ఉండేలా చూడాలి. ఈ స్థితిలో దుప్పటి కప్పడం మంచిది. తాగేందుకు ఏమీ ఇవ్వకూడదు. సదరు వ్యక్తి వాంతులు చేసుకుంటున్నా, నోటి నుంచి రక్తం బయటకు వస్తున్నా ఓ పక్కకు తిరిగి పడుకోబెట్టాలి. సత్వరమే వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లాలి.

అగ్ని ప్రమాదం.. కాలిన గాయాలు...

కాలిన గాయాలకు గురైతే వెంటనే సాధారణ చల్లదనంతో ఉన్న నీటి ధార కింద ఉంచాలి. ఐస్ పెట్టకూడదు. కాలిన భాగాలపై ఎటువంటి ప్లాస్టర్లు, బ్యాండేజ్ క్లాత్ లు చుట్టడం చేయరాదు. దీనివల్ల గాయం పెద్దదవుతుంది. శుభ్రమైన పాలిథిన్ బ్యాగ్ తో కప్పడం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా నివారించవచ్చు. గాయాలకు వస్త్రాలు అతుక్కుపోతే విడిపించే ప్రయత్నం చేయవద్దు. గాయాలకు అతుక్కుని లేకపోతే శరీరంపై ఉన్న వస్త్రాలు, ఆభరణాలను తొలగించడం మంచిది. పది నిమిషాల నుంచి అరగంట పాటు కాలిన గాయాలపై నీటి ధార పడేలా చేయవచ్చు. కళ్లకు కాలిన గాయమైతే వెంటనే నీటిని చిమ్ముకోవడం లేదా సెలైన్ సొల్యూషన్ తో కడుక్కోవడం మంచిది. కాలిన గాయాలపై వెన్న, గ్రీజు, లోషన్లను రాయకూడదు. ఐస్ ను కూడా వాడవద్దు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. బాధితుడు దగ్గుతున్నా, కళ్లు నీళ్లతో నిండి ఉన్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తరలించాలి.

కంట్లో రసాయనాలు
కంట్లో ఏదైనా రసాయనం పడితే వెంటనే నలపకుండా నీటితో కొన్ని నిమిషాల పాటు కడిగి వైద్యుల సలహా పొందాలి. సొంత వైద్యం చేయరాదు.

జ్వరం
ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఉన్నట్టుండి జ్వరం వస్తే నివారిణిగా పారాసెటమాల్ వేసుకోవచ్చు. పెద్దలు అయితే పారాసెటమాల్ టాబ్లెట్... పిల్లలు అయితే డ్రాప్స్ లేదా సిరప్ ను వాడుకోవచ్చు. వైద్యుల వద్దకు వెళ్లేందుకు సమయం పట్టేట్టు అయితే ఒకటి రెండు డోసేజ్ ల కింద వాడుకోవచ్చు. అసలుకే వైద్యుల వద్దకు వెళ్లకుండా దీన్ని వాడుకోవడం సురక్షితం కాదు.

గొంతులో ఏదైనా అడ్డుపడితే
గొంతులో ఏదైనా అడ్డుపడి మాట్లాడలేకుంటే, మింగలేకుంటే అటువంటి వారిని తలను ముందుకు వంచి దగ్గమని సూచించవచ్చు. ఫలితం లేకుంటే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.

పాము కాటు...
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం మన దేశంలో ఏటా 10 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. అందులో 50 వేల మంది వరకు మరణిస్తున్నారు. ముఖ్యంగా పాము కాటుకు గురవుతున్న వారిలో ఎక్కువ మంది రైతులే ఉంటున్నారు. ఆ తర్వాత నిర్మాణ రంగ పనివారు, కొండలు, అడవుల్లో ట్రెక్కింగ్, క్యాంప్ లకు వెళ్లే వారు పాము కాటుకు గురవుతున్నారు. మనదేశంలో 250 పాము రకాలుంటే అందులో 50 రకాలు విషపూరితమైనవి. ఓ ఐదు మాత్రం అత్యంత విషపూరితం. వీటిలో ఎక్కువ మంది ప్రాణాలను బలితీసుకుంటున్నవి నాలుగే. అవి నాగుపాము (కోబ్రా), కట్లపాము, రక్తపింజరి, ఇసుక పింజరి. ఏదైనా పాము లేదా జంతువు కాటు వేసినట్టయితే వెంటనే కాటు వేసిన పై భాగంలో గుడ్డతో గట్టిగా బిగించి కట్టాలి. వేడి నీరు, సోప్ తో ఆ భాగాన్ని కడిగి, యాంటీ బయోటిక్ క్రీమ్ రాయాలి.

ప్రమాదాలు జరిగిన సమయంలో టెన్షన్ ఉన్నప్పటికీ 108, అత్యవసర వైద్య సిబ్బంది కోసం ఎదురు చూడకుండా వెంటనే ఆస్పత్రికి తరలిస్తే బాధితుల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఆప్షన్ లు లేని టైంలో పైన చెప్పిన సూచనలు పాటించి పక్కనే ఉన్న ఎవరైనా సాయం తీసుకుని వ్యక్తి ప్రాణాలు కాపాడొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : First Aid  Health Tip  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more