the healthy food items which helps to get slim body | healthy foods to reduce body weight | weight lose food items

Healthy foods to get slim body within few days

healthy foods, slim body foods, healthy foods for slim body, weight lose foods, healthy foods to lose weight, weight lose remedies, healthy remedies to get slim body

healthy foods to get slim body within few days : the experts suggest to take some healthy food items which helps to get slim body by reducing weight.

స్లిమ్ గా తయారవ్వాలంటే.. ఈ ఫుడ్స్ తినండి!

Posted: 10/31/2015 01:41 PM IST
Healthy foods to get slim body within few days

నేటి ఆధునిక యుగంలో నాజూకు నడుము ట్రెండ్ బాగానే నడుస్తోంది. అందుకే.. బరువుగా వున్నవాళ్లందరూ స్లిమ్ గా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఉదయాన్నే లేచి వాకింగ్ కి వెళ్లడం, గంటల తరబడి వ్యాయామం చేయడం, ఇంకా ఎన్నో పద్ధతుల్ని అనుసరిస్తుంటారు. అయితే.. ఈ ఫాస్ట్ జనరేషన్ లో ఆ పనులన్నీ చేసేంత సమయం కొందరికి వుండదు. ఇంట్లో, ఆఫీసు పనులు నిర్వర్తించుకోవడంలోనే వారికి రోజంతా గడిచిపోతుంది. ఇటువంటివారు మరింత బరువు పెరుగుతారే తప్ప.. స్లిమ్ గా అయ్యే అవకాశాలు చాలా తక్కువ. మరి.. నాజుగ్గా తయారవ్వాలంటే ఎలా? అనే విషయంపై నిపుణులు పరిశోదనలు చేసి, కొన్ని ఆహారాలు తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.

బరువు నియంత్రించి.. నాజూగ్గా వుండాలంటే.. కూరగాయలను, ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు. కూరగాయల్లో ఉండే పోషకాలు శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయని న్యూట్రీషన్లు అంటున్నారు. కొవ్వు, కేలరీలు తక్కువగా ఉండి ఖనిజాలు, విటమిన్లు, పీచు పదార్థాలు అత్యధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. పచ్చిబఠాణి, బీట్‌రూట్, బంగాళాదుంపలు తరచుగా ఆరగిస్తుండాలి. డెయిరీ ఉత్పత్తులతో పాటు మాంసంకృతులను ఎక్కువగా తీసుకోవాలి. పూర్తి స్థాయిలో ఉండే పాలు, పెరుగు, పనీర్ కాకుండా స్కిమ్డ్ పాలు, పాల పదార్థాలు తీసుకోవాలి. ఈ పాలతో తయారయ్యే క్రీమ్, ఛీజ్, పనీర్, పెరుగు, మిల్క్, ఐస్‌క్రీమ్స్‌ను ఎక్కువగా తినాలి. అలాగే... పండ్లలో యాపిల్స్, యాప్రికోట్స్, ఉసిరి, ద్రాక్ష, జామ, నిమ్మ, లిచి, అరెంజ్, స్ట్రాబెర్రీలతో పాటు.. పప్పు దినుసులైన బీన్స్, శనగలు, రాజ్‌మా మంటి వస్తువులు, కరిగి పోయే పదార్థాలు తీసుకోవాలని డైటీషియన్స్ సలహా ఇస్తున్నారు.

పైన తెలుపబడిన పదార్థాలను సమయానికి అనుకూలంగా రెగ్యులర్ గా తీసుకుంటే.. బరువును నియంత్రించుకుని స్లిమ్ గా తయారవ్వచ్చు. ఒక్కసారి పాటించడం మొదలుపెడితే.. కొన్నాళ్లవరకు అలాగే కంటిన్యూ చేయాలని. లేకపోతే ఎలాంటి ఫలితం వుండదు. బయట తిండిపదార్థాలను ఏమాత్రం తీసుకోకూడదు. అలాగే.. మోతాదుకు మించి ఎక్కువ తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : healthy foods  slim body tips  weight lose remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more