nitin to do guest role in naga chaitanyas majnu movie which is the remake of malayalam premam | tollywood remake movies list

Nitin to do guest role in naga chaitanyas majnu movie

hero nitin news, nitin controversy, nitin updates, nitin production house, nitin guest role in majnu, majnu movie updates, naga chaitanya majnu movie, anupama parameshwaran

nitin to do guest role in naga chaitanyas majnu movie : nitin to do guest role in naga chaitanyas majnu movie which is the remake of malayalam premam.

‘మజ్ను’ కోసం అతిథిగా మారనున్న యంగ్ హీరో

Posted: 11/03/2015 06:21 PM IST
Nitin to do guest role in naga chaitanyas majnu movie

‘జయం’ సినిమాతో హీరోగా తెలుగుతెరకు పరిచయమైన నితిన్.. ఆ తర్వాత వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకెళ్లాడు. కానీ.. ఆ తర్వాత ఈ హీరోకి పరాజయాలే మిగిలాయి. అయినప్పటికీ ఓటమిని ఒఫ్పుకోని ఈ కుర్ర హీరో విజయం కోసం చాలాకాలంపాటు వేచి చూశాడు. ఈ నేపథ్యంలోనే ఇతనికి ‘ఇష్క్’ రూపంలో భారీ విజయం లభించింది. ఆ సినిమాతో కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ హిట్ కావడంతో ఈ హీరో ప్రస్తుత హిట్ లిస్టులోకి చేరిపోవడమే కాదు.. ప్రొడ్యూసర్ గా మారాడు. ఇప్పుడు ‘మజ్ను’ కోసం అతిథిగా మారనున్నాడని సమాచారం. ఇంతకీ ఆ మజ్ను ఎవరు? అనేగా సందేహం!

మలయాళంలో రూపొందిన ‘ప్రేమమ్’ చిత్రం అనూహ్యమైన విజయాన్ని సాధించింది. దీంతో ఈ సినిమాను తెలుగులో తెరకెక్కించాలని భావించిన చందూ మొండేటి.. ఇప్పటికే హక్కుల్ని కైవసం చేసుకున్నాడు. ఈ సినిమాకోసం కొంతమంది హీరోలను సంప్రదించగా.. చివరికి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక ‘ప్రేమమ్’ నటించిన అనుపమా పరమేశ్వరన్ తెలుగులోనూ కథానాయికగా తీసుకున్నారు. దీంతో.. ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసిన చిత్రబృందం.. అందులో వున్న రెండు ముఖ్యపాత్రల్లో అవసరమైన నటుల కోసం పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక పాత్రలో నాగార్జునగానీ, వెంకటేష్ గానీ నటించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక రెండో పాత్ర కోసం నితిన్ ని అడుగుతున్నారని సమాచారం.

అక్కినేని ఫ్యామిలీతో వున్న సాన్నిహిత్యం వున్న కారణంగా నితిన్ ఆ రెండో అతిథి పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని అంటున్నారు. పైగా.. ఈ పాత్రలో నటించడం వల్ల నితిన్ కు కూడా బాగానే కలిసొస్తుందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. అన్ని అనుకున్నట్లు సవ్యంగానే జరిగితే.. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని భావిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hero nitin updates  naga chaitanya majnu movie  anupama parameshwaran  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more