స్టైలిష్ స్టార్ గా పేరుగాంచిన అల్లు అర్జున్ సినిమాల్లో యాక్షన్ ఎపిపోడ్ ఎంత భారీ స్థాయిలో వుంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ యాక్షన్ సీన్లలో బన్నీకి కోపమొస్తే చాలు.. పరుగెత్తించి మరీ వారిని కొడతాడు. బన్నీ కొట్టే ప్రతి పంచ్ లోనూ అతని స్టైల్ మార్క్ కనిపిస్తుంది. అందుకే.. ఇతర హీరోలతో పోల్చితే బన్నీ యాక్షన్ సీన్లు ఎంతో ఆసక్తికరంగా, చూడముచ్చటగా వుంటాయి. మాస్ ఆడియెన్స్ తోపాటు ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా బన్నీ యాక్షన్ సీన్లను చూసేందుకు ఎంతో ఇష్టపడతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే.. బన్నీతో దర్శకుడు బోయపాటి శ్రీను అద్భుతమైన యాక్షన్ ఎపిపోడ్స్ ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే! ఈ మూవీకి టైటిల్ గా ‘సరైనోడు’ను పరిశీలిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ వరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి కాగా.. రెండో షెడ్యూల్ హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ కోసం పాతబస్తీలో రద్దీగా వుండే ఓ గల్లీ సెట్ ను ఫిల్మ్ సిటీలో వేశారు. కొంతమంది రౌడీలతో బన్నీ, శ్రీకాంత్ తలపడే సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఈ ఫైట్స్ ను ఈ నెల 10వ తేదీ వరకూ చిత్రీకరిస్తారు. బన్నీ స్టైలిష్ లో- బోయపాటి మార్కుతో ఆడియన్స్ ని ఆశ్చర్యచకితులను చేసే విధంగా ఈ ఫైట్స్ ఉంటాయని అంటున్నారు. హాలీవుడ్ తరహాలో వీటిని చిత్రీకరిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకు ఈ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందని అనుకుంటున్నారు.
ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరిద్దరితో కలిసి బన్నీ చేసే సందడి అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు. అలాగే.. కామెడీ కూడా బాగానే పండుతుందని యూనిట్ బృందం చెబుతోంది. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more