Producer Dilraju Registered 2 Movie Titles Recently | Pawan Kalyan Movies | Mahesh Babu Updates | Raviteja Bengal Tiger

Producer dilraju registered 2 movie titles pawan kalyan mahesh babu raviteja

dilraju news, dilraju updates, producer dilraju latest news, janaganamana telugu movie, yevado okadu telugu movie, pawan kalyan updates, junior ntr updates, mahesh babu movies, raviteja movies, junior ntr controversies

Producer Dilraju Registered 2 Movie Titles Pawan Kalyan Mahesh Babu Raviteja : Producer Dilraju Registered 2 Movie Titles As Janaganamana And Yevado Okadu. He Plans To Make Movies With Pawan Kalyan, Mahesh Babu, Raviteja And NTR.

చేతిలో రెండుండగానే.. బరిలోకి మరో రెండు!

Posted: 09/09/2015 01:26 PM IST
Producer dilraju registered 2 movie titles pawan kalyan mahesh babu raviteja

తెలుగు ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన ‘దిల్’రాజు.. అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుత ప్రముఖ నిర్మాతల్లో ఒకటిగా నిలిచిపోయాడు. ఆమధ్య ఈయన నిర్మాణంలో తెరకెక్కిన ‘దిల్’ చిత్రం విజయం సాధించడంతో ఈయనకు ‘దిల్ రాజు’ అని ముద్రపడింది. అప్పటినుంచి ఈయన నిర్మించిన సినిమాలన్నీ సక్సెస్ అవడంతో అగ్రనిర్మాతల జాబితాలోకి చేరిపోయాడు. ఈమధ్య ఈయన కాస్త సైలైంట్ గానే కనిపించాడు కానీ.. లోలోపలే పెద్ద ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దిల్ రాజు నిర్మించిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘కృష్ణాష్టమి’ చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే యాక్షన్, ఫ్యామిలీ ఆడియెన్స్ ని కట్టిపడేసే సెంటిమెంట్, యూత్ ని ఆకట్టుకునే లవ్.. తదితర అన్ని ఎలిమెంట్లతో కూడిన స్టోరీలతో ఆ సినిమాలు తెరకెక్కాయి. ఖర్చులకు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా మంచి బడ్జెట్ తో ఆ సినిమాలను నిర్మించిన దిల్ రాజు.. అవి ఖచ్చితంగా భారీ విజయాల్ని సాధిస్తాయని పూర్తి నమ్మకంతో వున్నాడు. ఆ నమ్మకంతోనే ఆయన అప్పుడే మరో రెండు టైటిల్స్ ని కూడా రిజిష్టర్ చేసినట్లు సమాచారం. రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా వుండగానే అప్పుడు దిల్ రాజు మరో రెండు టైటిల్స్ రిజిష్టర్ చేయడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

గతకొన్నాళ్ల నుంచి చిన్న సినిమాలే నిర్మిస్తున్న దిల్ రాజు.. ఈసారి అందుకు భిన్నంగా ఓ ప్లాన్ వేసుకున్నాడు. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలతో వరుసగా సినిమాలను నిర్మించాలని రాజు సన్నాహాలు చేస్తున్నాడు. పైగా.. ఆయా కథానాయకులకు సంబంధించిన కథలను కూడా సిద్ధం చేయిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘జనగణమన’, ‘ఎవడో ఒకడు’ అనే టైటిల్స్ ని రిజిష్టర్ చేయించాడు. ఈ టైటిల్స్ ఆ నలుగురు హీరోలలో ఇద్దరికి సంబంధించినవేనని టాక్ వినిపిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Producer Dilraju Movies  Pawan Kalyan Updates  Mahesh Babu Controversies  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more