‘జోష్’ వంటి ఎనర్జిటిక్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్యకి ఆ సినిమా కాస్త నిరాశే మిగిల్చింది. దాంతో మాస్ తరహా నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రానికి పూర్తి భిన్నంగా ‘ఏమాయ చేశావే’ లాంటి ప్రేమకథాచిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో లవర్ బాయ్ గా పేరుగడించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘100% లవ్’ చిత్రం లవ్ స్టోరీయే కావడంతో ‘లవర్ బాయ్’ ఇమేజ్ ఇతనికి ఫిక్స్ అయిపోయింది. కానీ.. ఆ మూవీ తర్వాత మళ్లీ ‘ధడ’, ‘బెజవాడ’, ‘ఆటోనగర్ సూర్య’ మాస్ చిత్రాలతో ముందుకురాగా.. అవి కూడా నిరాశపరిచాయి. కానీ.. లవ్ ఎలిమెంట్ తో కూడిన ‘ఒక లైలా కోసం’ మాత్రం సక్సెస్ అయింది. దీంతో ప్రేమకథా నేపథ్య చిత్రాలే తనకు సూటవుతాయని ఈ హీరో భావించినట్లున్నాడు.. అందుకే మరో లవ్ స్టోరీ చిత్రంతో ముందుకు రానున్నాడని సమాచారం.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ప్రేమమ్’ అనే సినిమా రీమేక్ పై చైతూ దృష్టి సారించాడని తెలుస్తోంది. ఈ సినిమా చూసిన చైతూ.. ఆ మూవీ కథపై మనసు పారేసుకున్నాడట. ఈ సినిమాను తెలుగులో తాను చేస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. పైగా.. ఇంతవరకు ఇతను నటించిన సినిమాల్లో ప్రేమ చిత్రాలే ఇతనికి మంచి విజయాలు సాధించిపెట్టాయి కాబట్టి.. ఈ రీమేక్ చిత్రం కూడా హిట్ ని అందిస్తుందనే నమ్మకంతో దానిని తెలుగులో రీమేక్ చేసే పనిలో పడ్డాడు. నిజానికి గతంలో ఈ సినిమా రీమేక్ రైట్స్ ని స్రవంతి రవికిషోర్ తీసుకున్నాడని, హీరోగా రామ్ చేయనున్నాడని ఆమధ్య వార్తలొచ్చాయి. కానీ.. తనకు ఆ సినిమా గురించే తెలియదని రామ్ క్లారిటీ ఇవ్వడంతో ఆ పుకార్లకు చెక్ పడింది. ఈ నేపథ్యంలోనే ‘ప్రేమమ్’ సినిమా రీమేక్ రైట్స్ విషయాన్ని త్వరగా చూడవలసిందిగా చైతే ఓ నిర్మాతకి చెప్పినట్లు ఫిలింనగర్ లో చర్చలు కొనసాగుతున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more