Actor Aadi Latest Flick Chuttalabbai Movie Shooting Will Starts Soon | Director Veerabhadram

Actor aadi chuttalabbai movie shooting starts soon

actor aadi, telugu actor aadi, aadi movies, aadi chuttalabbai movie, aadi movie updates, sai kumar aadi, director veerabhadram, actress pranitha, pranitha reddy

Actor Aadi Chuttalabbai Movie Shooting Starts Soon : Producer Venkat Says That Actor Aadi Latest Flick Chuttalabbai Movie Shooting Will Starts Soon Which Is To Be Directed By Veerabhadram.

‘చుట్టాలబ్బాయి’కి టైమ్ దగ్గరపడింది...

Posted: 08/04/2015 03:31 PM IST
Actor aadi chuttalabbai movie shooting starts soon

‘ప్రేమకావాలి’తో డెబ్యూ విజయాన్ని అందుకున్న సాయికుమార్ తనయుడు ఆది.. ఆ తర్వాత ‘లవ్ లీ’ అనే మరో ప్రేమకథాచిత్రంతో విజయం సాధించాడు. దీంతో లవర్ బాయ్ పేరొందిన ఈ హీరోకి ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో మళ్లీ ‘గాలిపటం’లాంటి లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చి మళ్లీ జయకేతనాన్ని ఎగురవేశాడు. ఆ చిత్రం హిట్ అవ్వడంతో ఈ యంగ్ హీరోకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ‘గరం’ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా వున్న ఈ హీరో తదుపరి చిత్రం కూడా షూటింగ్ కు సిద్ధం అవుతోందని సమాచారం.

‘అహ నా పెళ్ళంట’, ‘పూల రంగడు’ సినిమాలతో కామెడీ సినిమా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వీరభద్రం.. మూడో సినిమా ‘భాయ్’తో పరాజయం ఎదుర్కొన్నాడు. దీంతో కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి గ్యాప్ తీసుకున్న ఈయన.. తాజాగా ఆయన లవర్ బాయ్ ఆదితో కలిశాడు. వీరిద్దరి కాంబోలో ‘చుట్టాలబ్బాయ్’ పేరుతో ఓ సినిమా రాబోతోంది. గత నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా యూనిట్ మరిన్ని విషయాలను తెలియజేసింది. కామెడీ కమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ఈ నెలాఖర్లోనే సెట్స్‌పైకి తీసుకెళ్ళనున్నట్లు నిర్మాత వెంకట్ తెలిపారు. మేజర్ షూటింగ్ వచ్చే నెలలో జరగనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో ఆది సరసన ప్రణీత హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇదిలావుండగా.. గతకొన్నాళ్ల నుంచి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది.. ప్రస్తుతం నటిస్తున్న ‘గరమ్’ సినిమాతోపాటు ‘చుట్టలబ్బాయ్’ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఒకటి యాక్షన్, మరొకటి ఫ్యామిలీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలు కాబట్టి.. ఈ రెండు అతని కెరీర్ కి చాలా హెల్ప్ అవుతాయని భావిస్తున్నాడు. అటు.. కేవలం సెకండ్ హీరోయిన్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్న ప్రణీత కూడా.. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. హీరోయిన్ గా మరిన్ని అవకాశాలొస్తాయని ఆమె ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telugu actor aadi  chuttalabbai movie  pranitha  veerabhadram  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more