మనిషి జీవితంలో నిద్ర ఎంత అత్యంత అవసరమో.. సెక్స్ కూడా అంతే ముఖ్యమైంది. ఎవరైతే శృంగార వాంఛలను కలిగివుంటారో వారు మంచి ఆరోగ్యాన్ని కలిగి వుంటారు. యవ్వన దశతో ప్రారంభమయ్యే శృంగార వాంఛలు అతని జీవిత గమ్యాన్ని సైతం నిర్ధేశిస్తాయని చెప్పవచ్చు. ఎవరైతే ఈ వాంఛలను చంపుకోకుండా చక్కని శృంగార జీవితాన్ని అనుభవించగలుగుతారో.. అటువంటివారు మిగిలినవారికంటే ఎంతో ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించగల్గుతారు.
అయితే.. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మాత్రం మనిషి విచ్చలవిడి శృంగారాన్ని అనుభవించగలుగుతున్నాడే తప్ప.. అందులో దాగి ఉన్న గొప్పతనాన్ని ఏమాత్రం అర్థం చేసుకోలేక పోతున్నాడు. ఒకప్పుడు శృంగారం అంటే అది ఓ కళ. అందుకే ఎలాంటి శాస్త్రీయ పరిజ్ఞానం లేని రోజుల్లోనే శృంగారం గురించి కవులు బహు వివరంగా వివరించగలిగారు. కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం శృంగారం అంటే కేవలం అవసరంగా మారిపోయింది. ఏదో సృష్టిధర్మం కదా.. ఓసారి అనుభవిద్దాం.. అన్నట్లుగా సెక్సులో పాల్గొంటుంటారు.
అలాకాకుండా శృంగారాన్ని ఓ ఆరోగ్యకరమైన బంధంగా, భార్యాభర్తల మధ్య అనురాగాన్ని-ఆప్యాతను పెంచే మార్గంగా చూడగలిగితే.. అనేక రకాల లాభాలు పొందవచ్చని నిపుణలు పేర్కొంటున్నారు. దంపతులు చక్కని సెక్సు జీవితాన్ని ఆనందంగా అనుభవించగలిగితే.. వారు శారీరకంగా, మానసికంగా కలిగే ఎన్నో రుగ్మతల నుంచి దూరంగా ఉండొచ్చని వారు చెబుతున్నారు. శారీరకంగా మంచి వ్యాయామం చేసినటువంటి ఫలితాలు సమకూరుతాయి. అలాగే.. ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యల నుంచి దూరంగా వుండొచ్చు.
శృంగారంలో పాల్గొంటే శరీరంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ హార్మోన్ వల్ల గుండెకు రక్షణ చేకూరుతుంది. అలాగే శరీర ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వు వృద్ధి చెందడంలోనూ ఈ హార్మోన్ ఉపయోగపడుతుంది. అలాగే సెక్స్ సమయంలో కలిగే భావప్రాప్తి వల్ల శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ వల్ల శరీరానికి చక్కని విశ్రాంతి చేకూరుతుంది. తద్వారా మంచి నిద్ర లభిస్తుంది. అలాగే ఈ హార్మోన్ ప్రభావంతో కీళ్ళ నొప్పులు లాంటివి కూడా దూరమవుతాయి.
సెక్స్ పరంగా కలిగే తృప్తితో మనిషి రోజువారీ జీవితంలో కలిగే ఆందోళన తగ్గుతుంది. విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్న సమయంలో భాగస్వామితో సెక్స్ సుఖాన్ని అనుభవించగలిగితే.. ఆ ఒత్తిడి దూరమవుతుంది. శృంగారంలో పూర్తి సంతృప్తిని పొందిన వ్యక్తులు తమ ఆలోచనలను మంచి కార్యాలవైపు మళ్లించగలుగుతారు. అలాగే సెక్స్ వల్ల దంపతుల మధ్య ఏర్పడే అన్యోన్యత చక్కని కుటుంబ జీవితానికి పునాదిగా నిలుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more