Health problems spoils romance life | Health benefits

Health problems which spoils romance life

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules

health-problems-which-spoils-romance-life : The Experts saying that there will some health problems which spoils the romance life of couple

సెక్స్ జీవితాన్ని నాశనం చేసే ఆరోగ్య సమస్యలు!

Posted: 10/09/2014 06:31 PM IST
Health problems which spoils romance life

పెళ్లైన జంటలు ప్రతిరోజూ సెక్సులో పాల్గొంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఇదివరకే నిపుణులు కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడించారు. ముఖ్యంగా మెదడు చాలా చురుకుగా పనిచేస్తుందని.. అలాగే రోజంతా మానవులు చాలా ఉత్సాహంగా అన్ని కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. అయితే మానవులకు సంభవించే కొన్ని ఆరోగ్య సమస్యలు వారి సెక్స్ లైఫ్ ని చాలావరకు నాశనం చేస్తాయని.. తద్వారా భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు చాలా వున్నయని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ ఆరోగ్య సమస్యల వల్ల ఇటు శారీరకంగానూ, మానసికంగానూ చాలా దెబ్బ తింటారని హెచ్చిరికలు జారీ చేస్తున్నారు. మరి సెక్స్ జీవితాన్ని నాశనం చేసే ఆ ఆరోగ్య సమస్యలు ఏవో తెలుసుకుందామా....

1. డయాబెటిస్ (మధుమేహం) : నిపుణుల గణాంకాల ప్రకారం.. ఈ వ్యాధి కలిగిన పురుషుల్లో 60-70 శాతం మంది అంగస్తంభన సమస్యలను కలిగివున్నారని తెలిసింది. ఈ వ్యాధి పురుషాంగ రక్తప్రవాహం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అలాగే నరాల సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది. దీంతో అంగస్తంభనను నియంత్రించడంలో తగిన సంకేతాలను అందుకోవు.

2. డిప్రెషన్ : జీవితంలో వున్న కొన్ని సమస్యలతో మానసిక ఒత్తిళ్లకు గురికావడం సహజం. ఇది స్థాయికి మించి ఎక్కువగా పెరిగితే మాత్రం మానవుడు భావోద్వేగాలను చేయలేడు. అదే సమయంలో మెదడు సిగ్నలింగ్ విధానంలో కొన్ని తప్పులు చోటుచేసుకుంటే.. లైంగిక అసమర్థతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ఈ డిప్రెషన్ దీర్ఘకాలికంగా పెరిగితే.. లైంగికంగా సుఖం పొందే ఆలోచనలు పూర్తిగా కనుమరుగైపోతాయి. అలాగే డిప్రెషన్ ని సూచించే కొన్ని యాంటిడిప్రెసెంట్స్ కూడా లైంగిక కోరికల్ని, ఉద్రేకాన్ని తగ్గిస్తాయి.

3. వెన్నునొప్పి : ఇది నేరుగా లైంగికచర్యపై ప్రభావితం చూపించదు కానీ.. పరోక్షంగా మాత్రం సెక్స్ ను తగ్గించే ఫ్రీక్వెన్సీకి తోడ్పడే ప్రధానకారణమని చెప్పవచ్చు. హీర్నితేడ్ డిస్క్, స్పైనల్ స్టెనోసిస్ వంటి వెన్నుముక సమస్యలు చాలా బాధాకరంగా వుంటాయి. తాజా సర్వేలప్రకారం.. వెన్నునొప్పితో బాధపడుతున్నవారిలో 61 శాతంమందికి లైంగికవాంఛ తగ్గిందని వెల్లడించారు. కాబట్టి వెన్నుముక సమస్య ఇంకా ప్రారంభంలో వుండగానే తగిన చికిత్సలు చేయించుకుంటే మంచిది.

4. రక్తహీనత : లైంగిక భావాలను పూర్తిగా తగ్గించడంలో ఈ సమస్య ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది నరాలను పూర్తిగా బలహీనం చేయడంతో పురుషుల్లో లైంగిక కోరికలు తగ్గిపోతాయి. అలాగే అంగస్తంభన సమస్యలకు దారితీస్తుంది. అయితే జీవనశైలిలో చిన్నమార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

5. మెనోపాజ్ : మెనోపాజ్ సమయంలో మహిళల్లో హార్మోన్ల స్థాయిలలో మార్పులు చోటుచేసుకోవడం వల్ల వారిలో లైంగిక కోరికలు పూర్తిగా తగ్గిపోతాయి. లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే చురుకుదనం వారిలో తగ్గిపోతుంది. ఒకవేళ వాళ్లు అటువంటి సమయాల్లో కూడా తమ భాగస్వామితో సెక్స్ లో పాల్గొంటే తీవ్ర నొప్పి వారిని బాధిస్తుంది. దీంతో వారు సెక్స్ లో పాల్గొనేందుకు ఆసక్తి కనబర్చరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more