Karma sidhantham about human life

karma sidhantham, karma sidhantham latest news, karma sidhantham about human life, gyanpeeth, chilakaluripeta, karma sidhantham in telugu

karma sidhantham, karma sidhantham latest news, karma sidhantham about human life, gyanpeeth, chilakaluripeta, karma sidhantham in telugu

మానవ జన్మ దుర్లభమైనది, మహోన్నతమైనది.

Posted: 02/17/2014 06:31 PM IST
Karma sidhantham about human life

వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక జ్ఞానపీఠం, చిలకలూరి పేట

అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది. అసలు జన్మలు 3 రకాలు. అవి దేవజన్మ, మానవజన్మ, జంతుజన్మ. అవి ఎలా వస్తాయి..? వాటి ప్రత్యేకత ఏమిటి..? ఈ విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం... 

మానవుడు తన మొత్తం జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను కూడా అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు. అనేక జన్మలలో అతడు చేసిన కర్మఫలాలు ఆ జీవుడితోపాటు ప్రయాణిస్తూనేవుంటాయి. అందులో అన్నీ పుణ్యకర్మఫలాలు మాత్రమే లెక్కలోకి వచ్చినప్పుడు... అప్పుడు ఆ జీవుడు దేవ లోకాలలో జన్మిస్తాడు. అక్కడ ఆ కర్మపలాల కారణంగా అనేక భోగాలను కూడా అనుభవిస్తాడు. అది భోగ భూమి కనుక అక్కడ అతనికి ఏ కర్మలూ చేసే అధికారం లేదు. అందువల్ల పరమాత్మను అందుకోవడానికి తగిన కర్మలను ఆచరించే అవకాశం అక్కడ లేదు. తన కర్మ ఫలాలను అనుసరించి, బోగాలను అనుభవించి, ఆ కర్మఫలాలు క్షయం కాగానే ‘‘క్షీణే పుణ్యే మర్త్వలోకం విశంతి’’ అన్నట్లు ఈ మర్త్వలోకాన్ని అంటే మానవలోకానికి చేరుకోవలసిందే. మరల మానవ జన్మనో లేక జంతు జన్మనో ఎత్తవలసిందే. ఆ దేవ జన్మలో కేవలం మనోబుద్ధులుంటాయే తప్ప.. కర్మజేయుటకు సాధనమైన శరీరం వుండదు. కావున.. భగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు ‘‘దేవజన్మ’’. 

ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే లెక్కలోకి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా జన్మిస్తాడు. అటువంటి జన్మలలో ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు, దు:ఖాలు అనుభిస్తాడు... హింసించబడతాడు. జంతు జన్మలో అతను కర్మలు చేస్తున్నట్లు కనిపించినా... అవి బుద్ధిపరంగా గానీ, స్వయంగా నిర్ణయాలు చేసేవికావు. తను జీవిస్తున్న ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి. ఎందుకంటే.. ఈ జన్మలో శరీరం, మనస్సు రెండూ వుంటాయి కానీ బుద్ధి మాత్రం వుండదు. అందువల్ల ఈ జన్మలో కేవలం కర్మఫలాలను అనుభవించడమే తప్ప... పరమాత్మునిని అందుకోవడానికి తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. కనుక భగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు. 

ఇక పుణ్యపాపకర్మల ఫలాలు మిశ్రమంగా లెక్కలోకి వచ్చినప్పుడు ఆ జీవి మానవ జన్మనెత్తడం జరుగుతుంది. ఈ జన్మలలో అతడు పుణ్య కర్మఫలాల కారణంగా.. సుఖాలు, భోగాలు, ఆనందాన్ని అనుభవిస్తాడు. అలాగే పాపకర్మ ఫలాల కారణంగా దు:ఖాలు, బాధలు, అవమానాలు కూడా అనుభవిస్తాడు. అయితే ఈ జన్మలో కేవలం కర్మఫలాలలను అనుభవించడమే గాక.. కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవజన్మలోనే వుంటుంది. ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధి అనే 3 సాధనాలు వున్న జన్మ ఇది. కనుక పరమాత్మను అందుకోవడానికి తగిన కర్మలు చేసే అధికారంతోపాటు జ్ఞానాన్ని పొందే అవకాశం కూడా వున్న ఈ మానవజన్మన ఎంతో ఉత్తమమైనదిగాను, దుర్లభమైనదిగాను అన్నారు. మొత్తం 84 లక్షల జీవరాసులలో పుట్టిగిట్టిన తర్వాత లభించే ఈ అపురూపమైన ఈ మానవజన్మను ‘‘జంతూనాం నర జన్మ దుర్లభం’’ అని ఆచార్య శంకరులు ‘‘వివేకా చూడామణి’’ గ్రంథంలో తెలియజేయడం జరిగింది. ఇటువంటి ఉత్తమమైన మానవజన్మను పొందిన ప్రతిఒక్కరూ దీనిని సార్థకం చేసుకోవాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Satya sai baba pravachanam

    పరమాత్మను గ్రహించాలంటే సాధ్యమా..?

    Apr 03 | మానవుడు ప్రకృతిలో వున్న అందాలను, మాయకు లోబడి, ఇంద్రియాలకు లోనయి అనేకరకాల ప్రవృత్తుల (లక్షణాలు)తో ప్రవర్తిస్తుంటాడు. కొందరు ఒక్కొక్క రకమైన లక్షణాలను కలిగివుంటే.. మరికొందరిలో అన్ని లక్షణాలు ఇమిడి వుంటాయి. అవి తామసిక, రాజసిక,... Read more

  • Bhagwan baba about trust and love

    ప్రచారం కాదు... ఆచారం ప్రధానం!

    Mar 20 | సాధారణంగా సామాన్య మతాచారులు, గురువులు దగ్గరకు శిష్యులు వెళ్లి, లైనుల్లో నిల్చుని.. వారి ఆశీర్వచనాలు, ప్రసాదాలు తీసుకుంటుంటారు. కానీ... భగవాన్ బాబా స్వామి అయితే తాము స్వయంగా భక్తుల దగ్గరకు వెళ్లి వారికి స్వాంతనను... Read more

  • Ramana saranagathi

    రమణా శరణాగతి

    Feb 18 | ‘‘శరణు’’ అంటే రక్షణ కోసం వేడుకోవడం. ఆ రక్షణ ఇచ్చేవాడు దేవుడు. సాధారణంగా మానవులు తనకు ఆపదలు వచ్చినప్పుడు వాటిని తట్టుకోలేక తన ఇష్టమైన దేవాన్ని రక్షణ కోసం వేడుకుంటారు. అలాగే మరికొందరు తమ... Read more

  • Sachchidanandam pravachanalu

    సత్యానికి సోపానాలు

    Feb 14 | నాది, నేను అన్న భావనలు, కోరికలే దు:ఖ హేతువులు. భూమి మీద జన్మించే ప్రతి మానవుడూ తన కోసం ధనాన్నో, వస్తువులనో సంపాదించుకోవడానికి పడరాని పాట్లు పడుతుంటారు. కోరికలను జయిస్తే పరమాత్మకు దగ్గరవుతాము. బౌద్ధ... Read more

  • Sri satya sai baba pravachanam

    ‘‘శ్రీ సత్యసాయి’’ ప్రేమామయుడు

    Feb 14 | ప్రేమే నేను - నేనే ప్రేమ  ‘‘ప్రేమ నా స్వరూపము.. నా స్వభావము.. ప్రేమే నేను. నేనే ప్రేమ’’.. అంటారు భగవాన్ సాయి. ‘‘నా జీవితమే నా సందేహం. ప్రేమే నా సందేశం’’ అంటుంటారు.... Read more