సరీసౄపాలలో నాగులపామును హిందువులు ఎంతో ఆరాధ్యంగా, దైవంగా పూజించుకుంటారు. కార్తీక శుద్ధ చతుర్థిని నాగులచవితి అంటారు. ఇది దీపావళి అమావాస్య తరువాత వస్తుంది. నాగులచవితిని కొందరు శ్రావణశుద్ధచతుర్థినాడు కూడా జరుపుకుంటారు. ఈ పండుగరోజు నాగేంద్రుడిని అర్చిస్తే..శరీరంలో వున్న సర్వరోగాలు పోయి, సౌభాగ్యవంతులు అవుతారని భారతీయులు ప్రగాఢంగా నమ్ముతారు.
యోగాశాస్త్రం ప్రకారం.. మన శరీరంలో వున్న వెన్నెముక - కుండలినీశక్తి మూలాధారచక్రంలో ‘‘పాము’’ ఆకారంలో వుంటుందని తెలుపుతున్నారు. ఇది మానవునిలో సత్వగుణ సంపత్తిని తొలగిస్తూ వుంటుందంటారు. అప్పుడు నాగులచవితిరోజున విషసర్ప పుట్టలను ఆరాధించి, అందులో పాలుపోస్తే మానవునిలో వున్న విషసర్పం కూడా నశిస్తుందని నమ్ముతారు.
ఇలా ప్రతినాగులచవితినాడు స్త్రీలు ఆరాధిస్తే.. వారికి శుభప్రదమైన సంతానం కలుగుతుందని, ఆ పిల్లలు కూడా ఆచరిస్తే వారికి మంచి భర్తలు లభిస్తారని పలువురు విశ్వసిస్తారు.
ఈ నాగులపంచమి ఈనాటినుంచి చేస్తున్న సంస్కృతికాదు.. పురాతనకాలాల నుంచి ఈ సంప్రదాయం నడుస్తూ వస్తోంది. దీంతో సుఖసంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని, సంతానప్రాప్తి కలుగుతుందని పురాణాలలో కూడా ఎన్ని కథలున్నాయి.
నాగులపంచమి నాడు ‘‘కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ | ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్ ||’’ అనే శ్లోకాన్ని పఠిస్తే.. కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలలో పేర్కొనబడింది.
వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు. ఎందుకంటే.. సూర్యుడు ఈ నక్షత్రంలో సరిగ్గా కార్తీక శుద్ధ చవితినాడు ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు.
ప్రస్తుతమున్న శాస్త్రీయపద్ధతి ద్వారా చెప్పాలంటే.. సర్పాలు మనకు పరోక్షంగా సహాయపడుతున్నాయి. ఎందుకంటే భూమి అంతర్భాగంలో వున్న క్రిముల్ని, పురుగుల్ని ఇవి తినేసి భూసారాన్ని కాపాడుతున్నాయి.
పూజావిధానం :
నాగులచవితి రోజు ఉదయాన్నే లేచి రోజువారి కార్యక్రమాలు ముగించుకుని, తలంటు స్నానం చేసుకోవాలి. ఎరుపురంగు దుస్తులను ధరించుకుని ఇంటిని, పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. భ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి.
పూజామందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి. పూజకు సంబంధించిన వస్తువులను కేటాయించుకుని ఉదయం 9 లోపు పూజను ముగించుకోవాలి. ‘‘ఓం నాగేంద్రస్వామినే నమ:’’ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించుకోవడం ముఖ్యం.
దీపారాధనకు నువ్వులనూనెను వాడాలి. 7 దూదివత్తులు, ఆవునేతితో సిద్ధం చేసుకున్న దీపముతో హారతినిచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి. పూజ ముగిశాక నాగేంద్ర స్వామి నిత్యపూజ అనే పుస్తకమును తాంబూలముతో చేర్చి ముత్తైదువులకు అందజేయాలి. తరువాత దగ్గరలో ఉన్న పుట్టవద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో పాలుపోసి పూజ చేయాలి. పూజ అయిన తరువాత నెవైద్యం పెట్టి ఆరోజు పగలంతా ఉపవాసం వుండి, రాత్రికి భోజనం చేసుకోవాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించి, నాగదేవతకు పంచామృతంతో అభిషేకం చేయిస్తే.. సర్వం సిద్ధిస్తుందని నమ్ముతారు.
బ్రహ్మ పురాణంలో సంతానం కథ :
చంద్రవంశానికి రాజయిన శూర్యసేనుడు, అతని భార్య సంతానం కలగడం కోసం చాలారోజులు తపస్సు చేశారు. అయితే వారికి ఒక సర్పం (మగ) జన్మించింది. అయినా వీరు ఆ సర్పాన్ని ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. కొన్నిరోజుల తరువాత ఆ సర్పం మనుషుల్లా మాట్లాడటం మొదలుపెట్టింది. దానిని చూసి రాజు, రాజుభార్య ఒక్కసారి ఖంగుతిన్నారు.
ఆ పాము తనకు ఉపనయనం చేయించమని కోరింది. ఆ రాజు అలాగే చేశాడు. కొన్నాళ్ల తరువాత ఆ సర్పం తనకు పెళ్లి చేయించమని కోరింది. దాంతో ఆ రాజు ఒక రాకుమార్తెతో పెళ్లిచేసి తిరిగి రప్పించుకున్నారు.
అత్తింటికి వచ్చిన ఆ కోడలు తన భర్త పాము అని తెలుసుకుంటుంది. అయినా ఆమె ఏమాత్రం భయపడకుండా అతనితోనే కలిసిమెలిసి వుంటుంది. ఒకరోజు పాము ‘‘నన్ను చూసి నువ్వు ఎందుకు భయపడటం లేదు’’ అని అడుగుతుంది. అప్పుడు ఆమె ‘‘భర్త ఎటువంటివాడైనా స్త్రీకి దైవంతో సమానం. దైవాన్ని చూసి ఎవరైనా భయపడతారా’’ అని సమాధానం ఇస్తుంది.
ఇది విన్న ఆ పాము ‘‘శివుని శాపం వల్ల నేను ఇలా పాములా అయ్యాను’’ అని చెబుతుంది. అప్పుడు వాళ్లిద్దరూ కలిసి చవితి వ్రతాన్ని ఆచరించి, గౌతమినదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాపం నుండి విమోచనం పొందుతాడు.
(And get your daily news straight to your inbox)
Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more
Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more
Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more
Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more
Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more