Sankranti festival special

sankranti festival special, Makar Sankranti, Hindu festival, Bhogi, makara sankranti, haridssulu

sankranti festival special, Makar Sankranti, Hindu festival, Bhogi, makara sankranti, haridssulu

భోగభాగ్యాల భోగి... సంబరాల సంక్రాంతి

Posted: 01/11/2014 10:41 AM IST
Sankranti festival special

సంక్రాంతి అనగానే ముందుగా  గుర్తుకొచ్చేది  పాడి పంటలు..... పచ్చని పల్లె వాతావరణం. ఆరుగాలం రైతు చమటోడ్చి పండించిన  ఫలసాయం చేతి కొచ్చే సమయమిది..  ఈ సందర్ఛాన్ని పురస్కరించుకొని  వేడుకగా చేసుకునే పండుగే  సంక్రాంతి.

సూర్యుడు  మకర రాశిలో ప్రవేశిస్తున్నందున  దీనిని మకర సంక్రాంతి అని కూడా అంటారు..  ముఖ్యంగా  హిందువులు  వేడుకగా చేసుకునే ఈ పండుగ ను భారతదేశంతో పాటు నేపాల్ లోనూ చేసుకుంటారు. జనవరి 13 నుండి 15 వరకూ నిర్వహించే  ఈ వేడుకలో  పిల్లలు  పెద్దలు సామూహికంగా  పాల్గొంటారు. 

చరిత్ర

మకర సంక్రాంతి పండుగ చరిత్రలోకి వెళితే ముందుగా  హిందువులు  సూర్యుడిని  ఆది దైవంగా భావిస్తారు.  సకల చరాచర జగత్తుకు  ఆధారమైన సూర్యుడిని  కీర్తిస్తూ   సూర్యనారాయణ  వేదపారాయణ అంటూ పూజలు చేస్తారు. దేశంలోని  వివిధ ప్రాంతాల ఆచార సాంప్రదాయాలను  అనుసరించి  ఉత్సవాలను చేసుకుంటారు.. ఈ పండుగను  తమిళులు  పొంగల్  పేరుతో నిర్వహించుకుంటారు.

 పంజాబ్ లో దీనిని లోహ్రీగా, అస్సాంలో మాఘ్ బిహుగా, కాశ్మీర్ లో శిషుర్ సంక్రాంతిగా చేసుకోవడం విశేషం. సంక్రాంతి కి ముందు రోజు భోగి పండుగను చేసుకుంటారు. ఆ రోజు  చలిపులిని తరిమికొడుతూ  ప్రజలు ఉదయాన్నే చలి మంటలు వేసుకుని  పిల్లా పెద్దలు అక్కడకు చేరుకుని  చలి కాగుతారు. తమలోని  పాత ఆలోచనలు ఆ అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని  అగ్ని దేవుని వేడుకునేందుకు  గుర్తుగా  తమ ఇంటిలోని పాత చెత్తా చెదారాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేస్తారు.  

రెండవ రోజైన సంక్రాంతి నాడు పలు పిండు వంటలు చేసి సూర్యదేవునికి  ప్రసాదంగా సమర్పిస్తారు.. పిల్లలు మహిళలు  ఇంటి ముందు  పోటీలు పడుతూ మరీ ముగ్గులు వేస్తారు. వాటిపై పూలతో అలంకరణలు  చేసి, పేడతో చేసిన గొబ్బెమ్మలను  ఉంచి పాటలు పాడుతూ వాటి చుట్టూ తిరుగుతారు.. మూడవ రోజైన కనుమ రోజున పలు పిండివంటు చేసుకుని  బంధువులతో పాటు విందు వినోదాల్లో పాల్గొంటారు..

ముఖ్యంగా  ఈ పండుగ దినాల్లో పల్లెల్లో కోళ్ల పందాలు  విశేషంగా నిర్వహిస్తుంటారు. .  ఆనందాలకు  ఉత్సాహానికి  ప్రతీకగా చేసుకునే  ఈ పండుగ ఈ ఆధునిక  కాలంలోనూ గ్రామాల్లో  ఎంతో వేడుకగా చేయడం , దీనికి పట్టణాలకు  వలస పోయిన వారు తిరిగి తమ గ్రామాలకు చేరుకుని  వేడుకల్లో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా  తెలుగు విశేష్ అందరికీ  సంక్రాంతి శుభాకాంక్షలు  తెలియజేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vilambi nama samvasthara ugadi special story

    ఉగాది పండగ విశిష్టత.. కథలు తెలుసా.?

    Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more

  • Kanuma festival special

    కనుమ పండుగ విశిష్టత

    Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more

  • Bhogi festival special

    భోగభాగ్యాల భోగి పండుగ

    Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more

  • Bathukamma the floral festival of telangana

    తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ

    Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more

  • Dasara navarathri special article

    దసరా శరన్నవరాత్రులు

    Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more