Saranath temple special story about budha

saranath temple special story about budha, saranath temple, budha temple, saranath latest news, budha dharmam, saranath temple in uttar pradesh, saranath temple news

saranath temple special story about budha, saranath temple, budha temple, saranath latest news, budha dharmam, saranath temple in uttar pradesh, saranath temple news

బౌద్ధభక్తులు సందర్శించాల్సిన క్షేత్రం

Posted: 02/18/2014 05:12 PM IST
Saranath temple special story about budha

గౌతమ బుద్ధికి నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలలో ‘‘సారనాథ్’’ ఒకటి. ఈ క్షేత్రం ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి ఈశాన్యదిశలో 13 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ పుణ్యక్షేత్రంలోనే గౌతమ బుద్ధుడు తన మొదటి ‘‘ధర్మ’’ ఉపదేశాన్ని ఇచ్చాడు. ఇది ఒక జింకల వనం. ‘‘ఇస్సితాన’’ గౌతమ బుద్ధిడి చేత వర్ణించబడింది.  బౌద్ధ మత భక్తులు సందర్శించి తీరవలసిన క్షేత్రాలు నాలుగు క్షేత్రాలలో సారనాధ్ ఒకటి. కుశీనగర, బోధిగయ, లుంబివి మొదలగు మిగిలిన బౌద్ధ పుణ్యక్షేత్రాలు.

బుద్ధిని జీవితంలో సారనాథ్ : 

గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం తరువాత షుమారు 5 వారాలకు బోధిగయ నుండి సారనాధ్‌కు వెళ్ళాడు. అంతకు ముందు (జ్ఞానోదయం ముందు) బుద్ధుడు తన తీవ్ర తపోదీక్షను విరమించినపుడు, అతని సహచరులైన ఐదుగురు "పంచవాగ్గీయ సాధువులు" బుద్ధుని వదలి ఉసీపట్నం వెళ్ళారు. తన జ్ఞానోదయం తరువాత ఆ ఐదుగురికి ధర్మోపదేశం చేయడానికి బుద్ధుడు కూడా అక్కడికి వెళ్ళాడు. దారిలో గంగానదిని దాటడానికి పడవ ప్రయాణానికి తనవద్ద లేణందున బుద్ధుడు గాలిలోనడచుకొంటూ దాటాడట. ఇది విన్న మౌర్యరాజు బింబిసారుడు సన్యాసులకు శుల్కాన్ని రద్దు చేశాడట. ఉసీనగరంలో ఐదుగురు సాధువులకు బుద్ధుడు ధర్మోపదేశం చేసినపుడు సంఘం ఆవిర్భవించింది. ఆ సమావేశంలో చేసిన బోధను దమ్మచక్క పరివత్తన సుత్తము (ధర్మచక్ర పరివర్తన సూత్రం) అంటారు. అది అషాఢ పూర్ణిమనాడు జరిగింది. తరువాత ఐదు వర్ష ఋతువుల కాలం బుద్ధుడు సారనాధ్‌లో "మూలగంధ కుటీరం"లో గడిపాడు. ఈ కాలంలో సంఘం 60 మందికి పెరిగింది. వారిని బుద్ధుడు నలుదెసలకూ పంపాడు. వారందరూ అర్హతులే.

ఉసీపట్నం (సారనాధ్‌)లో మొదటి ధర్మబోధ మాత్రమే కాకుండా బుద్ధుని జీవితంలో అనేక ఘటనలు జరిగాయి. యాసుడు అతని శిష్యుడయ్యాడు. రాజగిరి నుండి సారనాద్‌కు తిరిగి వచ్చిన తరువాత బుద్ధుడు కొన్ని మాంసాలను నిషేధించాడు. మనుష్య మాంసంకూడా అలా నిషేధించచబడింది (ఒకవిధమైన రోగ నివారణకు ఒక సాధువు స్వయంగా తన మాసంతో పులుసు కాసి ఇచ్చాడట. కనుక మనిషి మాంసం నిషేధం కూడా అవుసరమైంది.) ఇక్కడ బుద్దుడు ఉన్న కాలంలో రెండుసార్లు మారుడు బుద్ధుని వశపరచుకోవాలని ప్రయత్నించి విఫలుడయ్యాడట.

సారనాధ్‌లో ఉన్న సమయంలో ధమ్మచక్క పరివత్తన సుత్తం మాత్రమే కాకుండా మరొకొన్ని సుత్తములు (సూత్రాలు) బోధించాడు.

అనత్త లఖన సుత్తము

సచ్చవిభంగ సుత్తము

పంచ సుత్తము 

రధకార (పచేతన) సుత్తము 

రెండు పాశ సుత్తములు 

సమయ సుత్తము 

కటువీయ సుత్తము 

మెత్తేయపంథ పరాయణ బోధ 

ధమ్మదిన్న సుత్తము (సామాన్యులకు ఆచరణీయమైన ధర్మము)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Tirumalagiri venkateswara temple history

    తిరుమలగిరిలోని వెంకటేశ్వరుని ఆలయ విశేషాలు

    May 09 | స్థలపురాణం : పూర్వం త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేయాలని నిర్ణయించుకుని.. దక్షిణ హిందూ దేశానికి వెళతాడు. ఆ సందర్భంలో కృష్ణానదికి దగ్గరలో వున్న ఒక కొండ ప్రాంతానికి... Read more

  • Chejerla kapostheswara temple history

    చేజెర్లలోని కపోతేశ్వర ఆలయ విశేషాలు

    Apr 18 | మహాభారతంలోని కథ : మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు అనే ఇద్దరు తమ్ముళ్లు వుండేవారు. వారిద్దరిలో మేఘదాంబరుడు.. తన అన్న అనుమతితో 1500 మందిని వెంటబెట్టుకుని కాష్మీరదేశం విడిచి తీర్థయాత్రలకు... Read more

  • Chaya someswara temple story

    ఛాయ సోమేశ్వరాలయం విశిష్టత

    Apr 08 | ఆలయ విశేషాలు :  ఛాయ సోమేశ్వర ఆలయం నల్లగొండ పట్టణానికి నాలుగు కీలోమీటర్ల దూరంలో వున్న పానగల్లు అనే గ్రామంలో వుంది. క్రీ.శ. 12వ శతాబ్దంలో కుందూరు చోళులు దీనిని నిర్మించినట్టు ప్రస్తుతమున్న మ్యూజియం... Read more

  • Gudimallem shiva temple

    గుడిమల్లం శివాలయం

    Apr 03 | స్థలపురాణం :  పూర్వం పరశురాముడు తన తండ్రి ఆజ్ఞమేరకు తల్లినే సంహరిస్తాడు. అయితే తీవ్ర బాధతో కుంగిపోతున్న పరశురాముడు.. తిరిగి తన తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బ్రతికించుకుంటాడు. కానీ.. తల్లిని చంపినందుకు తీవ్ర... Read more

  • Brahma and gayatri pushkar

    బ్రహ్ముని ఆలయం

    Mar 28 | స్థలపురాణం :  పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు నిత్యం ప్రజలను హింసిస్తూ.. వారికి అనేక కష్టాలను పెట్టేవాడు. ఇది చూసి తట్టుకోలేక బ్రహ్మ.. తన చేతిలో వున్న తామరపువ్వును ఆయుధంగా మార్చి ఆ రాక్షసుడని... Read more