Ap ngo leader ashok babu comments on cm kiran

AP NGO leader Ashok Babu comments on cm kiran, AP NGO leader Ashok Babu, AP NGO leader Ashok Babu on AP politics, cm kiran kumar reddy, ap bifurcation, ashok babu vs cm kiran

AP NGO leader Ashok Babu comments on cm kiran, AP NGO leader Ashok Babu on AP politics

సీఎం కిరణ్ పై మొదటిసారి కామెంట్ చేసిన: అశోక్ బాబు Featured

Posted: 10/16/2013 09:24 PM IST
Ap ngo leader ashok babu comments on cm kiran

సీమాంద్రలో ఉద్యమం వెనకు ఉన్న వ్యక్తి సీఎం కిరణ్ కుమార్ రెడ్డే అని , తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు గొంతుచించుకొని అరిచారు. ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పర్చురి అశోక్ బాబుకు అండగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని .. తెలంగాణ నేతలు గోల చేసిన విషయం తెలిసిందే. ఇలా అనేక రకాలుగా సమైక్యాంద్ర ఉద్యమం పై, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పై అనేక కామెంట్లు చేయటం జరిగింది. కానీ ఈరోజు ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పర్చురి అశోక్ బాబు మొదటి సారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై కామెంట్ చేయటం జరిగింది. రీసెంట్ గా సిఎం కిరణ్ తో విద్యుత్ కార్మికులు చర్చలు సమ్మె విరమించిన విషయం తెలిసిందే. అదే బాటలో ఆర్టీసి కార్మికులు కూడా సమ్మె విరిమించి, స్టీరింగ్ పట్టుకున్నారు. ఇక మిగిలింది ఏపీ ఎన్జీవోలు మాత్రం వీరితో.. సీఎం కిరణ్ చర్చలు జరుపుతూనే ఉన్నారు. కానీ ఫలించటం లేదు. ఇలాంటి సమయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇస్తున్న హామీలు నమ్మాలంటే అసలు ఆయనను ముఖ్యమంత్రిగా ఉంచుతారో, తొలగిస్తారో తెలియట్లేదని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు హైదరాబాద్ లో వ్యాఖ్యానించారు.

 

ప్రభుత్వంతో చర్చించిన తర్వాత సమ్మె కొనసాగించాలా.. వద్దా అనే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రితో చర్చలపై రేపు, ఎల్లుండి ఏపీఎన్జీవోలు, జేఏసీ నేతల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. పై-లీన్ తుఫాను సందర్భంగా సహాయ, పునరావాస కార్యక్రమాలకు హాజరైన ఉద్యోగులంతా మళ్లీ సమ్మెలోకి చేరారని అశోక్ బాబు తెలిపారు. ప్రజలు, విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకునే ఉపాధ్యాయులు, ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె విరమించారని ఆయన చెప్పారు. అశోక్ బాబు మొదటి సారి ముఖ్యమంత్రి కిరణ్ పై కామెంట్ చేయటంతో.. ముఖ్యమంత్రి మార్పు అనే విషయం పై అందరు ఆలోచిస్తున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చితే.. ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారు. తెలంగాణ నాయకులు వస్తారా, లేక సీమాంద్ర నాయకులు వస్తార అనే విషయం రాష్ట్రం ప్రజలు అయోమయంలో పడ్డారు. ఏమైన రాష్ట్ర విభజన పై కాంగ్రెస్ పార్టీ పెంచుతున్న దూకుడు వల్ల ..రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో చూడాలి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles