కోట్ల మంది అభిమానులకు దైవంగా మారిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు.. తల్లి అంటే అమితమైన ఇష్టం. ఆ తల్లి కోసం సచిన్ చివరి కోరిక బీసీసీఐ ముందు ఉంచటం జరిగింది. నా ఆటను నా తల్లి ప్రత్యక్షంగా చూడాలి.. కనుక ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్ ని నిర్వహించాలి అని సచిన్ బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. సచిన్ టెండూల్కర్ సొంత మైదానంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లకు వీడ్కోలు పలకనున్నాడు. తన చివరిదైన 200వ టెస్టును ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఆడనున్నాడు.
రాజీవ్ శుక్లా ఆధ్వర్యంలో భేటీ అయిన బీసీసీఐ కమిటి నవంబరులో వెస్టిండీస్ తో జరిగే రెండు టెస్టుల వేదిక వివరాలను ఈరోజు వెల్లడించింది. దీంతో బీసీసీఐ సచిన్ కోరిక పై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ లో జరిగే 199వ టెస్టును కలకత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో, 200వ టెస్టు ను ముంబై లోని వాంఖెడే మైదానంలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో మాస్టర్ బ్లాస్టర్ తన ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందోనన్న విషయంలో ఊహాగానాలకు తెరదించినట్లయింది. సచిన్ సొంత గడ్డ పైనే ఆఖరి టెస్ట్ జరుగుతుందని బీసీసీఐ ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 30 | ... Read more
Dec 25 | ... Read more
Oct 16 | సీమాంద్రలో ఉద్యమం వెనకు ఉన్న వ్యక్తి సీఎం కిరణ్ కుమార్ రెడ్డే అని , తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు గొంతుచించుకొని అరిచారు. ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పర్చురి అశోక్ బాబుకు... Read more
Oct 16 | సీమాంద్ర ప్రజలు సమైక్యాంద్ర కోసం సాగించిన ఉద్యమం దెబ్బకు కాంగ్రెస్ హైకమాండ్ .. ఆంటోని కమిటి వేసిన విషయం తెలిసిందే. సీమాంద్ర నాయకులు ఆంటోనీ కమిటీ ముందు తమ గోడు వెల్లబోసుకోవచ్చనని కాంగ్రెస్ హైకమాండ్... Read more