• masa
  • masa
Meena Raasi

ఆదాయం : 2, వ్యయం : 8, రాజపూజ్యం : 1, అవమానం : 7

ఈ రాశివారి అదృష్టసంఖ్య ‘3’. 1, 2, 5, 9 సంఖ్యలతో కూడిన తేదీలు ఆది, సోమ, గురువారాలతో కలిసి వస్తే యోగప్రదం. సంపూర్ణ నవగ్రహ జపములు చేయించి, దాన, హోమ, అన్నశాంతులు గావిస్తే శుభం కలుగుతుంది. శనైశ్చరునికి ప్రతి శనివారం తైలాభిషేకం జరిపిస్తే అనుకూల ఫలితాలు పొందగలరు.

సంవత్సర ప్రథమంలో కొంతమేర ఫలితాలు వుండగా.. తర్వాత శత్రువృద్ధి, గృహంలో కలహాలు, గొప్పవారితో విభేదాలు, మాటపట్టింపులు, అనాచార ప్రవర్తన, ధర్మకార్యాల్లో విముఖత, పుత్రులతో కలహాలు, నిందా వాక్యాలు అనవసర రుణాలు చేయడం లాంటివి ఎదురవుతాయి. అయితే.. గురుని నైసర్గిత శుభత్వం వల్ల పై దోషాలు తొలిగి శాంతి కలుగును. ప్రతి అంశంలో ఎంతో శ్రమించాల్సి వస్తుంది. కొన్ని విషయాల్లో ఎంత లౌక్యం ప్రదర్శించినా.. ఫలితం శూన్యం.

వ్యాపారుల వృత్తి వ్యాపారంలో ఖేదం. కుటుంబంలో అనారోగ్యాలు. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అసంకల్పిత సంఘటనలు, మొహమాటంతో ఇబ్బందులు కలుగుతాయి. విద్యావైజ్ఞానిక రంగంవారికి సదావకాశాలు లభిస్తాయి. వైద్యులు, ఇంజనీర్లు, ఇతర స్వయంవృత్తులవారికి అనూహ్య స్పందనలు. కుటుంబ అసౌఖ్యం, మంచికి పోయినా చెడు ఎదుర అవడం లాంటివి జరుగుతాయి.

వ్యాపారవేత్తలకు తమ వ్యాపార వ్యవహారాలలో కొద్దిగా మార్పులు సంభవిస్తాయి. కొత్తగా భూసేకరణ, యాంత్రిక నిర్మాణ యోగాలు కలుగుతాయి. కార్మికులకు, వ్యవసాయదారులకు శ్రమకు తగ్గ ఫలితాలను పొందుతారు. రాజకీయ నాయకులు కూడా తమ పదవిని శ్రమించి కాపాడుకుంటారు. ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు ఫలితం దక్కక.. కేవలం శ్రమ మాత్రమే మిగులుతుంది. 

మీనారాశివారికి ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా లేదు. ఆర్థికపరంగా వీరికి ఎటువంటి లాభాలు చేకూరవు. వ్యాపార వ్యవహారాలలో, ఉద్యోగాలలో మార్పులు సంభవించి.. ఫలితంగా నష్టాలు సంభవిస్తాయి. 

మీనారాశివారు తమ కుటుంబసభ్యులతో నిత్యం గొడవలకు దిగుతారు. ధనవ్యయం ఎక్కువ అవ్వడం వల్ల మానసిక ఒత్తిళ్లకు గురయి.. బంధుమిత్రులతో, కుటుంబసభ్యులతో వైరాలు పెంచుకుంటారు. 

మీనారాశివారికి కాలం కలిసిరాకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువవుతాయి. నిత్యం ఏదో ఒక వ్యాధితో బాధపడుతూనే వుంటారు. మానసిక ఒత్తిడికి గురికావడం వల్ల గుండెపోటు, రక్తపోటు సంభవించే అవకాశాలు వుంటాయి. 

valuprma