• masa
  • masa
Vrushaba Raasi

ఆదాయం : 8, వ్యయం : 8, రాజపూజ్యం : 6, అవమానం : 6

ఈరాశివారి అదృష్టసంఖ్య ‘6’. 3, 4, 5, 8 సంఖ్యలతో కూడిన తేదీలు.. బుధ, శుక్ర, శనివారాలతో కలిసి వస్తే యోగం కలుగుతుంది. సంవత్సరం మొత్తంలో ప్రతిరోజూ శివాలయ సందర్శన, శనిస్తోత్ర పఠనం, శని, గురు, రాహు, కేతు మంత్ర జపములు చేస్తే అన్ని కార్యాలు సాఫీగా సాగుతాయి. దుర్గాష్టోత్తర పారాయణ, మాసశివరాత్రి రోజు ఈశ్వరాభిషేకం చేయిస్తే వృద్ధి కలుగుతుంది. స్త్రీలకు త్రిశతి పారాయణ ఎంతో మేలు.

ఈ రాశివారికి సంవత్సరం మొత్తం గురు, శనిగ్రహాల బలం అంతగా లేదు. అన్ని వ్యవహారాల్లోనూ ఆచితూచి వ్యవహరించాల్సి వుంటుంది. ఆరోగ్యబాధలు, ఇంటాబయటా అనేక సమస్యలు చుట్టుముడుతాయి. విదేశీప్రయాణం అనుకూలంగా వుండదు. విద్యార్థులు ఎంతో కష్టపడితేగానీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేరు. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వుంటుంది. గృహవాతావరణం అంతగా అనుకూలంగా వుండదు. నూతన వ్యాపారవ్యవహారాలు ప్రారంభించినవారికి కొన్ని సమయాల్లో మాత్రమే ఫలితం వుంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు.

సొంత నిర్ణయాలు తీసుకోవడం కంటే ఇతర సలహాలు తీసుకోవడమే శ్రేయస్కరం. మనోనిబ్బరం, నిలకడలేమితో పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త దంపతులు పరస్పర అవగాహనతో నడుచుకుంటే మంచిది. కార్మికులకు యాజమాన్యంతో ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వుంటుంది. కోర్టు వ్యవహారాలు అతికష్టంగా సాగుతాయి. ఆరోగ్య పరిస్థితి స్థిరంగా వుంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు వున్నప్పటికీ.. సమయానుకూలంగా డబ్బు సర్దుబాటు అవుతుంది. విద్యావైజ్ఞానిక రంగంవారికి అసంతృప్తి వున్నప్పటికీ మిశ్రమకాలం. చిరువ్యాపారస్తులకు ఇబ్బందులు తప్పవు. బడావ్యాపారస్తులకు ప్రభుత్వంతో నొప్పి, కొత్త నియమనిబంధనలు ప్రతికూలంగా మారుతాయి.

గృహనిర్మాణాలకు సంబంధించిన శుభకార్యాలు, ఇళ్లలో నిర్వహించుకునే వేడుకల ప్రయత్నాలు విజయం సాధిస్తాయి. పరిశ్రమలను నిర్వహించుకుంటున్న పారిశ్రామికవేత్తలకు, వ్యాపారులకు, కళాకారులకు ఆశించిన ఫలితాలు లభ్యమవుతాయి. వైద్యులు, శాస్త్రజ్ఙులు, భాషాపండితులు, రాజకీయనాయకులు తమతమ కార్యకలాపాలలో ముందడుగు వేస్తారు.

పెద్దల ఆస్తులు సంక్రమించటం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలువదు. వృత్తిపరంగా జీవనం కొనసాగించేవారికి ఈ సంవత్సరం మంచి అభివృద్ధి, ప్రోత్సాహం, గౌరవమర్యాదలు లభిస్తాయి.

వృషభ రాశికి చెందినవారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. సంతానంలేనివారు దైవ ఆశీస్సులతో సంతానప్రాప్తి పొందుతారు. కుటుంబసభ్యులతో గొడవలు అయినప్పటికీ.. బంధుమిత్రులతో కలిసి వాటిని పరిష్కరించుకుంటారు. 

ఆరోగ్యరీత్యా వృషభరాశివారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది నిత్యం కంటి, కంఠం, ఉదరం, పాదం వంటి ఆరోగ్య సమస్యలకు గురవుతారు. సంతానం వున్నవారికి వారి ఆరోగ్యం, విద్య విభాగాలకు సంబంధించిన అధిక ధనవ్యయం అవుతుంది.

valuprma