• masa
  • masa
Vrushaba Raasi

ఆదాయం : 8 ; రాజపూజ్యం : 7 ; వ్యయం : 11 ; అవమానం : 5

సంతాన భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు, పథకాలను ఏర్పాటు చేసుకుంటారు. స్త్రీలు బంధువుల నుంచి కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. చాలాకాలం తరువాత ఆత్మీయులు రావడంతో గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. శుక్ర, శనివారాల్లో స్త్రీలకు ఆరోగ్యానికి సంబంధించిన నడుము, కడుపునొప్పి, కీళ్లనొప్పులు, నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి.

వ్యాపారాలు నిర్వహించేవారికి పరిస్థితులు మిశ్రమంగా వుంటాయి. చేతివృత్తులు, వ్యవసాయరంగంలో వున్నవారు అధికంగా శ్రమిస్తేగానీ మంచి ఫలితాలను పొందలేరు. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఉద్యోగులకు కొన్ని మార్పులు అకూలిస్తాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసేవారికి తమతమ పనులలో ఏకాగ్రత, సమర్థత చాలా ముఖ్యం.

valuprma