అవకాశం పేరిట తనను వాడేసుకున్నాడంటూ ఓ టాప్ నటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తానని ఓ బాలీవుడ్ హీరో తనను మోసం చేశాడంటోంది సౌత్ అగ్రహీరోయిన్ కాజల్ . ప్రస్తుతం అరడజను చిత్రాలతో బిజీగానే ఉన్న చందమామ తనకు జరిగిన అవమానం గురించి పలువురి వద్ద ప్రస్తావించిందట. తన లగ్జరీ కారును విపరీతంగా వాడేసుకున్న ఆ హీరో గారు చివరకు హ్యాండ్ ఇచ్చాడని ఆమె చెబుతోంది.
విషయం ఏంటంటే... ఆ మధ్య ఓ బాలీవుడ్ సినిమాలో సదరు హీరోగారి పక్కన అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ సినిమా కథా చర్చల సమయంలో ఆ స్టార్ తో కాజల్ కి విపరీతమైన చనువు ఏర్పడిందంట. అంతే ఆ హీరోగారు కాజల్ లగ్జరీ కారును విపరీతంగా వాడేసుకున్నాడంట. అయితే సినిమా చర్చల సమయంలోనే ఆగిపోగా, మళ్లీ ఇంకో సినిమా చేద్దామని చెప్పిన ఆ హీరో, అప్పటి నుంచి కనీసం ఫోన్ చేయటం కూడా మానేశాడంట.
ఈ విషయం కాస్తా బయటపడడంతో టాలీవుడ్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ అయింది. అన్నట్లు బాలీవుడ్లో అవకాశాల కోసం ప్రయత్నం చేసిన సమయంలో షాహిద్ కపూర్ సరసన ఓ సినిమా అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. దీంతో ఆ హీరో షాహిదేనని పలువురు ఫిక్స్ అయిపోయారు. ఆ విషయం పక్కనబెడితే ప్రస్తుతం తెలుగులో ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో చాన్స్ కొట్టేయడంతోపాటు, అజిత్, విజయ్, సుదీప్ లాంటి స్టార్ల సినిమాలోనూ నటిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more