సాధారణంగా శాండల్ వుడ్ (కన్నడ చిత్రపరిశ్రమ) కన్ను ఎప్పుడూ తెలుగు సినిమాలపైనే ఉంటుంది. ఇక్కడ హిట్ అయిన ఏ చిత్రాన్ని కూడా వదలకుండా మక్కీకి మక్కి రీమేక్ చేసి బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నారు అక్కడి హీరోలు. సుదీప్, ఉపేంద్ర, దర్శన్ ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే అందులో 95 శాతం మన రీమేక్ లే ఉంటాయి. అలాంటిది సీన్ రివర్స్ అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్ కన్ను రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఓ కన్నడ చిత్రంపై ఉంది. అది గనుక బ్లాక్ బస్టర్ అయితే మాత్రం తెలుగులో క్రేజీ కాంబినేషన్ లో, అది కూడా మెగా కాంపౌండ్ నుంచి తెరకెక్కడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది.
విషయం ఏంటంటే... కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, రెబల్ స్టార్ అంబరీష్ కాంబినేషన్ లో ‘దొడ్డ మానె హడ్డ’ అనే ఓ సినిమా రాబోతుంది. ఇందులో వీరిద్దరు తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారు. అంబరీష్ భార్య సుమలత, స్వర్గీయ నటుడు విష్ణువర్థన్ భారతి కీలకపాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 30న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. పవర్ ఫుల్ కథతో తెరకెక్కించినట్లు చెప్పుకుంటున్న ఈ సినిమా కన్నడలో రికార్డులు క్రియేట్ చేయటం ఖాయమని ఇప్పటికే శాండల్ వుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఒకవేళ సినిమా బ్లాక్ బస్టర్ అయితే మాత్రం మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ లతో తెరకెక్కించేందుకు రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే ఇద్దరు అగ్ర నిర్మాతలు అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. సినిమా టాక్ తర్వాతే దర్శకుడు మిగతా విభాగాలను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more