పవన్ డాలీ మూవీ మరింత ఆలస్యం | Dolly movie may late due to pawan's political commitments

Dolly movie may late due to pawan s political commitments

Dolly movie may late due to pawan's political, Pawan Dolly movie late, Pawan Dolly movie delay, Pawan next delay with political, Pawan Political links with movies

Dolly movie may late due to pawan's political commitments.

పవన్ మూవీ హాంఫట్ ?

Posted: 08/29/2016 05:39 PM IST
Dolly movie may late due to pawan s political commitments

అభిమానుల కోసం తొలిసారి తన రూల్స్ ని బ్రేక్ చేసి డాలీ సినిమాను త్వరగతిన సినిమాను పూర్తి చేస్తాడని ఆశించిన పవన్ అభిమానులకు నిరాశే ఎదురయ్యేలా ఉంది. పూజా కార్యక్రమాల్లో పాల్గొనటంతో మూడు నాలుగు నెలల్లో సినిమా రావటం ఖాయమని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే ఈ లోపే రాజకీయ ఎంట్రీ సినిమాకు ఆటంకిగా మారనుంది.

ఓవైపు పవన్ లేకుండానే అవసరమైన సన్నివేశాలతో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసేశాడు డాలీ.  ప్రస్తుతం పవర్ స్టార్ సెట్లో ఎప్పుడు జాయిన్ అవుతాడా అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి సభ, ఆపై కాకినాడ సభకు ముందే కమిట్ మెంట్ ఇవ్వటంతో ఇక డాలీ సినిమా ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దాని తర్వాత ఆంద్రప్రదేశ్ అంతటా సభలు ఉంటాయని జనసేన ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో కూడా పవన్ షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి.

ఇంకోవైపు వేరే సినిమాలను వదులుకుని మరీ కేవలం పవన్ కళ్యాణ్ చిత్రం కోసం శృతీహాసన్ వెయిట్ చేస్తోంది. తాజాగా తన డేట్స్ వేస్ట్ అయిపోతున్నాయని నిర్మాత శరత్ మరార్ దగ్గర ఆమె వాపోయినట్లు సమాచారం. ఇలాగే అయితే తాను సినిమా నుంచి వాకౌట్ అవుతానని తేల్చిచెప్పిందట. దీంతో నెక్ట్స్ షెడ్యూల్ లో ఆమెపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించేందుకు డాలీ ఫ్లాన్ చేస్తున్నాడు. వచ్చే నెలాఖరు కల్లా తన పొలిటికల్ కమిట్ మెంట్లను ఎలాగైనా పూర్తి చేసుకుని, పవన్ తిరిగి షూటింగ్ లో పాల్గొంటాడని శరత్ మరార్ చిత్ర యూనిట్ కి ధైర్యం చెబుతున్నాడంట. ఏదేమైనా సర్దార్ గబ్బర్ సింగ్ తరువాత పవన్  నుంచి వరుస సినిమాలు వస్తాయని ఆయన అభిమానులకు ప్రస్తుత పరిణామాలు కాస్త నిరాశనే కలిగిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Dolly Movie  delay  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more