పెద్దహీరోలతో సినిమాలు చేసి టాలీవుడ్ లో తమ గ్లామర్ తో ఒక ఊపు ఊపిన హీరోయిన్స్ అందరూ ఇప్పుడు ఆంటీలుగా మారిపోయారు. ప్రస్తుతం పిల్లలు పుట్టి పెద్దవాళ్లు అయ్యాక మళ్లీ తమ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా స్టార్ట్ చెయ్యాలా అని చూస్తున్నారు.
ఇందులో ముఖ్యంగా హీరోయిన్ మీనా ఒకప్పుడు స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. ఇటీవల వెంకటేష్ సినిమా దృశ్యంలో సైతం వెంకటేష్ కి పెయిర్ గానే నటించి మెప్పించింది. అయితే ఇలాంటి అవకాశాలు కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే వస్తాయని గ్రహించిన మీనా ఇప్పుడు ఎలాంటి పాత్రలు వేయడానికైనా సై అంటోందట. అందుకోసం తన దర్శక నిర్మాతలను అడుగుతోందట. ప్రస్తుతం కుర్రహీరోల హవా నడుస్తున్న నేపథ్యంలో హీరో మదర్ క్యారెక్టర్ అయినా సై అంటోందట
బెంగాలీ భామగా ఎంటరై తనదైన స్టైల్లో నటించి తన గ్లామర్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కించిన నగ్మా కూడ మీనా బాటలోనే నడుస్తోంది. ప్రస్తుతం హిందీలో సైడ్ రోల్స్ కైనా సై అంటూ బాలీవుడ్ లో అడుగులు వేస్తోందట ఈ సుందరి. రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉంటూనే అవకాశాలు వస్తే మాత్రం వదులుకోను అని చెప్పోందట. అలాగే టాలీవుడ్ లో తన పాత డైరెక్టర్స్ తో ప్రొడ్యూసర్స్ తో మంతనాలు జరుపుతోందట. ఎలాంటి పాత్రకైనా నేను రెడీ అంటూ సిగ్నల్స్ ఇస్తోందట. మరి నగ్మాని తెలుగులో ఈసారి ఏ క్యారెక్టర్ లో చూడబోతున్నామో అని అనుకుంటున్నారు అందరూ.
ఎప్పటినుంచో టాలీవుడ్ నే నమ్ముకుని ఇటీవల టీవీ షోలో కూడ తళుక్కుమన్న రాశీ కూడ మంచిపాత్రలు వస్తే చేయడానికి సిద్ధం అంటోంది. తను ఒకప్పుడు జోడీ కట్టిన హీరోలను సైతం ఆఫర్లు కోసం అడుగుతోందట. చిన్న సినిమాల్లో కుర్రహీరోలకు మదర్ క్యారెక్టర్స్ కి సైతం సిద్ధంగా ఉన్నానని చెప్తోంది.
కెమెరా ముందుకు వచ్చి చాలా రోజులైన రంభ గతంలో కుర్రహీరోలతో స్టెప్పులేసి ఆడింది. అయితే ఇప్పుడు తన వయసు కనపడకుండా ఉండేలా తమిళంలో హీరోకి సిస్టర్, సైడ్ క్యారెక్టర్స్ కోసం ప్రయత్నాలు చేస్తోందట. మొన్నీమద్య ఒక తమిళ కుర్రహీరోకి మదర్ గా నటించమంటే నో చెప్పిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం అలాంటి పాత్రలకైనా నేను రెడీ అంటోంది. ఇక రంభ లాగే తాను కూడ సై అంటున్న మరో హాట్ హీరోయిన్ సంఘవి ప్రస్తుతం తమిళంలో టీవీ సీరియల్స్ లో నటిస్తోంది. ఇలా పాతతరం హీరోయిన్స్ అందరూ ఆంటీలుగా, అమ్మలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తమ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. వీళ్లలో కెరియర్ ని మళ్లీ వెండితెరపై నిలబెట్టుకునేవాళ్లు ఎంతమందో తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more