తెలుగులో మొన్నటి వరకు వరుసగా స్టార్ హీరోలతో జతకట్టిన ప్రియమణికి ప్రస్తుతం తెలుగులో అవకాశాలే రావడంలేదు. హీరోలకు పోటీగా డాన్సులు చేసే ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోవడంతో ఇక కన్నడ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ పలు టీవి షోలలో న్యాయనిర్ణేతగా పాల్గొంటూ, అప్పుడప్పుడు వచ్చే సినిమా ఆఫర్లను ఒప్పుకుంటుంది.
అయితే సినిమాలకు బాగా దూరమైన ఈ అమ్మడు ప్రేమలో మునిగితేలుతోందని, సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తితో ప్రియమణి ప్రేమాయణం కొనసాగిస్తోందని గతకొద్ది కాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలపై ప్రియమణి తాజాగా స్పందించినట్లుగా తెలిసింది.
ప్రస్తుతం తాను ప్రేమలో వున్నానని, కానీ అతని పేరు, వివరాలు ఇప్పుడే చెప్పలేనని, సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెబుతానని ఓ ఇంటర్వ్యూలో చెప్పిందట ప్రియమణి. అంతే కాకుండా ఆ వ్యక్తి సినీ ఇండస్ట్రీకి సంబంధించినవాడు మాత్రం కాదని ప్రియమణి తేల్చి చెప్పేసిందట.
ప్రియమణి ఇలా చెప్పడంతో... ఎవరో ఓ బిజినెస్ మాన్ తో ప్రియమణి ప్రేమాయణం కొనసాగిస్తోందని, ఇంతకీ ఆ వ్యక్తి ఎవరూ అని సినీ మీడియా ఆరా తీసే పనిలో పడ్డారట. మరి ప్రియమణి తన ప్రేమ, పెళ్లి వివరాలను ఎప్పుడు తెలియజేస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more