Siddarth samantha bangalore days movie

Samantha love break up, Siddarth break up, Siddarth Samantha break up, Samantha Siddarth love, Siddarth Samantha love break up, Samantha on Siddarth, Bangalore Days movie, Bangalore Days telugu remake, Bangalore Days cast and crew, Kollywood updates, tollywood latest

Siddarth Samantha Bangalore Days movie : we all know samantha and Siddarth broke up their relationship, but heroine refused to comment on this matter. Samantha says media has to maintain distance from personal issues of anyone and siddarth is a great guy. broke up pair is acting in Bangalore Days movie.

ప్రేమ పెటాకులైనా.., ప్రేమికులేనట

Posted: 01/08/2015 11:52 AM IST
Siddarth samantha bangalore days movie

తెలుగు, తమిళ ఇండస్ర్టీలు అంతా హాట్ హాట్ గా చర్చించుకుంటున్న విషయం ఏమిటబ్బా అంటే సిద్ధార్ధ్- సమంత బ్రేకప్. రెండ్రోజులుగా ఉదయం వేకప్ నుంచి సాయంత్రం ప్యాకప్ వరకు వీరి బ్రేకప్ గురించే రెండు ఇండస్ర్టీల్లో మాట్లాడుకుంటున్నారు. ఎలా బ్రేకప్ అయింది, ఇప్పుడు ఎవరు ఏం చేయబోతున్నారు అని తెగ గుసగుసలాడుకుంటున్నారు. ప్రేమ పెటాకులు కావటంతో ఇక వీరిద్దరూ మళ్లీ కలిసే అవకాశం లేదనీ.. కలిసి సినిమాలు తీసే అవకాశం కూడా లేదని అనుకుంటున్నారు. కాని ఇది నిజం కాదు అని కొందరు చెప్తున్నారు. సమంత లాంటి ప్రాక్టికల్ మనిషి సినిమాను, ప్రేమను ఈజీగా వేరు చేస్తుందని చెప్తున్నారు. కాబట్టి ప్రేమికులుగా విడిపోయినా.., నటులుగా కలిసే ఉంటారన్నమాట.

‘బెంగళూర్ డేస్’ అనే సినిమా తెలుగు, తమిళంలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో సమంత, సిద్దార్ధ్, ఆర్య ప్రధాన క్యారెక్టర్లు చేస్తున్నట్లు ఎప్పుడో ఫిక్స్ చేసి డేట్లు బుక్ చేసుకున్నారు. లేటెస్ట్ బ్రేకప్ తో సినిమా గందరగోళంలో పడింది అనుకున్న సమయంలో, అదేమి లేదే అని మూవీ యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. మార్చి 1 నుంచి ప్రారంభం అయ్యే షూటింగ్ లో వీరిద్దరూ కలిసి నటిస్తారని చెప్తున్నారు. తమ్ముడు తమ్మడే.., పేకాట పేకాటే అన్నట్లుగా ఎక్కడి లెక్కలు అక్కడే చేసేలా మైండ్ సెట్ చేసుకుంటున్నారు.

లవ్ బ్రేకప్ పై మీడియా అతిగా ప్రవర్తిస్తోందని సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది. బంధం తెగిపోయి బాధితురాలిగా బాధపడుతోందని ఈ పత్రిక కథనం ప్రచురించటంపై చెన్నై భామ సీరియస్ అయింది. ‘నేను బాధితురాలిని కాదు, సిద్ధార్థ్ కూడా గొప్ప వ్యక్తి’, ‘అయినా ఇలాంటి విషయాలకు మీడియా అతిగా ప్రాధాన్యం ఇచ్చి, ప్రచారం చేయకూడదు. ఇలాంటి కామెంట్స్ మరోసారి రాయకండి’ అని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. గతంలో కూడా మీడియాపై సమంత రుసరుసలాడిన విషయం తెలిసిందే. ఏదయితేనేం రెండున్నరేళ్ళ ప్రేమ నుంచి బయట పడ్డ వీరిద్దరూ.., నెలన్నర తర్వాత కలవనున్నారు. విడిపోయిన ప్రేమ జంట, వెండి తెరపై ఎంతమేర ప్రేమ ఒలకబోస్తుందో చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Siddarth  Bangalore Days  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more