Chiranjeevi shocks to tollywood directors by taking latest decision that he is plans to direct his own 150 film

chiranjeevi, chiranjeevi latest news, chiranjeevi 150 movie news, chiranjeevi 150 movie actresses, director vv vinayak, director boyapati srinu, telugu directors, tollywood directors, hero ram charan tej, tollywood actresses, telugu news, telugu movie news websites

chiranjeevi shocks to tollywood directors by taking latest decision that he is plans to direct his own 150 film

దర్శకులకు దిమ్మతిరిగే షాకిచ్చిన చిరంజీవి!

Posted: 10/25/2014 01:24 PM IST
Chiranjeevi shocks to tollywood directors by taking latest decision that he is plans to direct his own 150 film

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి టాలీవుడ్ లో రోజుకొక వార్తలు షికార్లు చేస్తూనే వున్నాయి కానీ.. ఇంతవరకు ఆ మూవీకి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటనలు వెలువడి కాలేదు. అప్పట్లో ఎవరైనా సరైన స్ర్కిప్ట్ తో ముందుకు వస్తే వారికి నగదు బహుమతిని ఇస్తామంటూ ప్రకటన ఇచ్చేసినట్లు వార్తలు వచ్చాయి. అలాగే వివి వినాయక్, బోయపాటి శ్రీనుల్లో ఎవరో ఒకరు చిరు సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని ప్రచారాలు కూడా కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది చిరుకు తమ కథలు వినిపించినా.. అవి నచ్చకపోవడంతో డిసప్పాయింట్ అయ్యారని తెలిసింది. దాంతో ఆయన తన బర్త్ డే నాడు 150 సినిమా గురించి అధికారికంగా వెల్లడించాల్సిన ప్రకటనను వాయిదా వేసుకున్నారు. అయితే ఆయన స్లిమ్ గా కనిపించేందుకు నేపాల్ కు వెళ్లారనే టాక్ కూడా వినిపించింది. ఇలా ఒక్కొక్కటిగా రూమర్లు వస్తున్నాయే తప్ప.. ఆ సినిమా గురించి చిరుగానీ, ఆయన కుటుంబసభ్యులుగానీ ఇంతవరకు ఏమీ స్పందించలేదు. చిరు కూడా ఇంతవరకు ఏమీ స్పందించకపోవడంతో ఫ్యాన్స్ కూడా బాగానే ఫీల్ అవుతున్నారని సమాచారం!

ఇదిలావుండగా.. తాజాగా చిరంజీవి ఒక అరుదైన నిర్ణయాన్ని తీసుకుని టాలీవుడ్ లో వుండే దర్శకులకు దిమ్మతిరిగే షాకిచ్చారనే మరో ప్రచారం వెలుగులోకి వచ్చింది. తన 150వ సినిమాకు స్వయంగా దర్శకత్వం వహించాలనే ఆలోచనలో చిరు వున్నాయని తెలుస్తోంది. గతంలో కూడా ఆయన రామ్ చరణ్ సినిమాలైనా ‘‘నాయక్, ఎవడు, గోవిందుడు అందరివాడేలే’’ వంటి స్ర్కిప్టుల్లో మార్పులు చేయడం వల్లే సక్సెస్ సాధించాయని.. ఆ సినిమాల విజయం వెనుక చిరంజీవి హస్తముందనే వార్తలు కూడా బాగానే చక్కర్లు కొట్టాయి. ఈ నమ్మకంతోనే ఆయన తన 150వ చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. చిత్రపరిశ్రమలో చాలాకాలం వరకు యాక్టర్ గా కొనసాగిన చిరు.. తన సినిమాకు తానే దర్శకత్వంలో వహించడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి వుంది. ఒకవేళ ఇదే నిజమైతే.. చిరు చాలా జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది.. లేదా ఇతర దర్శకుల సహాయాన్ని తీసుకోవాల్సి వుంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  tollywood directors  vv vinayak  boyapati srinu  ram charan tej  telugu news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more