Thamanna not acting in bellamkonda srinivas second movie

thamanna in bellamkonda srinivas movie, thamanna item songs, thamanna next movie, thamanna upcoming movies, telugu upcoming movies, tollywood latest updates, bellamkonda srinivas thamanna movie, bellamkonda suresh movies, boyapati srinu telugu movies

thamanna not acting in bellamkonda srinivas second movie : telugu popular heroine thamanna not acting in bellamkonda srinivas second movie with her busy schedule, delay in shooting because of suresh financial problems and also made other reasons to come out from this project

తప్పుకుందా...? తప్పించుకుందా..?

Posted: 10/16/2014 09:54 AM IST
Thamanna not acting in bellamkonda srinivas second movie

ఇంటిపేరు సిల్కు అంటూ ‘అల్లుడు శీను’ సినిమాలో చిందులేసిన తమన్నా.., శ్రీను రెండవ సినిమాలో నటించటం లేదన్న విషయం తెలిసిందే. బెల్లంకొండ ఫ్యామిలి ప్రాజెక్టును వద్దు అనుకోవటానికి మిల్కిబ్యూటీ చెప్పిన కారణం.. కాల్షీట్లు ఖాళీగా లేవు, డేట్లు కుదరటం లేదు అని. ఎందుకంటే ప్రస్తుతం ‘బాహుబలి’లో బిజీగా ఉన్న ఈ భామ త్వరలోనే మరో తమిళ సినిమాలో నటించనుంది. దీంతో పాటుగా నిర్మాత సురేష్ కు ఉన్న ఆర్దిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం అవుతున్నందు వల్ల తనకు డేట్లు అడ్జస్ట్ చేయటం ఇబ్బంది అవుతుందని సినిమా నుంచి బయటకు వచ్చేసిందట. ఇది శ్రీను సన్నిహితులు చెప్తున్న మాటలు.. అయితే ఫిలింనగర్ లో మరోవిధమైన గుసగుసలు విన్పిస్తున్నాయి.

అదేమంటే ‘అల్లుడు శీను’ సినిమాలో తమన్నా ‘నా ఇంటి పేరు సిల్కు.., ఒంటిరంగు మిల్కు’ అనే ఐటం సాంగ్ లో కన్పించింది. డాన్స్  కు తగ్గట్టుగానే మిల్కీకి బాగానే ముట్టజెప్పిందని టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయింది. తొలి సినిమానే ఫ్లాప్ కావటంతో.., రెండవ ప్రాజెక్టుపై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారని ముద్దుగుమ్మ సన్నిహితులు సందేహం వ్యక్తం చేశారట. బాగానే డబ్బులు వస్తుండొచ్చు కాని ఫెయిల్ అయితే మాత్రం ఫ్యూచర్ కు దెబ్బ పడుతుందని సలహా ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఎందుకు రిస్క్ చేయటం అనుకుని ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేసిందని గుసగుసలు విన్పిస్తున్నాయి.

అటు బెల్లకొండ ఆర్ధిక ఇబ్బందులు కూడా మరోకారణమట. అంటే పైనాన్షియల్ క్రైసిస్ వల్ల షూటింగ్ ఆలస్యం అయింది. కొద్దిరోజులకు ప్రారంభం అయినా.., మళ్ళీ ఏ ఇబ్బంది రాదు అని గ్యారెంటి ఇవ్వలేము. ఇంకో విషయం ఏమిటంటే ‘రభస’ సినిమా మాదిరిగా ఫైనాన్ష్ ప్రాబ్లం వల్ల సినిమా విడుదల ఆలస్యం అయితే అని డౌట్ వచ్చిందట. మరోవైపు ఇంత కష్టపడి డేట్లు సర్దుకుని షూటింగులకు వస్తే.., రావాల్సిన రెమ్యునరేషన్ టైంకు రాకపోతే అనే అనుమానాలు కూడా బలాన్నిచ్చాయి. అందువల్ల ఎందుకీ గొడవంతా అనుకుని సింపుల్ డేట్లు కుదరటం లేదు అని సారి చెప్పేసి తెలివిగా తప్పించుకుంది అని కొందరు అంటున్నారు. మరి దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందో తమన్నాకే తెలియాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : thamanna  bellamkonda srinivas  suresh  boyapati srinu  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more