Actor venu election support on tdp leader nama nageswara rao

actor venu, mahesh babu, balakrishna, tdp , 2014 election, election camp, nama nageswara rao, Telugu Desam Party, Nara Chandrababu Naidu.

actor venu election support on tdp leader nama nageswara rao

పొలిటికల్ బావల కోసం రంగంలోకి దిగిన సినీ బావమరుదులు.

Posted: 04/21/2014 06:25 PM IST
Actor venu election support on tdp leader nama nageswara rao

నేటి రాజకీయలు కుటుంబ రాజకీయాలుగా మారుతున్నాయి. గతంలో  ఎవరైన రాజకీయల్లోకి ఉంటే.. ఆయన కుటుంబం రాజకీయాలకు చాలా దూరంగా ఉండేది. కానీ నేడు జరుగుతున్న రాజకీయాలో  అలా కాదు.. రాజకీయ బరిలోకి ఒక కుటుంబం నుండి ఎవరైన నిలబడితే చాలు.. ఆయన కుటుంబం, బంధువులు, కలిసి అతని గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. 

నిన్నటి వరకు సినీ గ్లామర్ రాజకీయ పార్టీలు ఉపయోగించుకొనేవి. కానీ నేడు  రాజకీయ నేతలు ఉపయోగించుకుటున్నారు.ఇప్పటికే పవన్ కళ్యాణ్ బిజెపి తరపున ప్రచారం చేస్తున్నాడు, అలాగే మహేష్ బాబు తన బావ అయిన గల్లా జయదేవ్ కి ఓటు వేయాలని ట్విట్టర్ ద్వారా ప్రచారం చేసాడు. మరోవైపు నందమూరి బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాడు.


ఇదిలా ఆంటే తాజాగా ‘స్వయం వరం’, ‘చిరునవ్వుతో’ మొదలైన సినిమాలతో పరిచయం ఉన్న కామెడీ హీరో వేణు తొట్టెంపూడి తన బావ అయిన నామా నాగేశ్వరరావు తరపున ప్రచారం చేస్తున్నాడు. 

నామా నాగేశ్వరరావు టిడిపి పార్టీ తరపున ఖమ్మం నుండి లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వేణు ప్రజలందరికీ ‘మా బావకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండని’ ప్రచారం చేస్తున్నాడు.  ఇప్పటికే సినిమాల్లో వెనకబడిపోయిన నటుడు వేణు..  ఈ ఎన్నికల ప్రచారంలో తన బావ కోసం కష్టపడుతున్నారు. వేణు కష్టం  ఆయన బావ నామా కు ఏ మాత్రం ఉపయోగపడుతుందో చూడాలి. 

అయిన బావలో దమ్ము ఉండాలి గానీ,  సినీ బావమరుదులు ఎంతమంది ప్రచారం చేసిన ఫలితం ఏముంటుంది చెప్పండి. ఒకవేళ  ఆ బావలు గెలిస్తే..  అంత మా పుణ్యమే అని అంటారు.  ఒకవేళ ఓడిపోతే.. మాత్రం అటూ  బావకు.. ఇటూ బావమరిదికి ఇద్దరి పరువు పోతుంది.  సినీ గ్లామర్ ప్రచారం తో  పబ్లిసిటీ వస్తుంది గానీ, ఫలితం అంతగా ఉండదని అనుభవం అయిన రాజకీయ నాయకులు అంటున్నారు.  ఎన్నికల సమరంలో దిగిన నేతలో నిజాయితీ ఉంటే చాలు సినీ గ్లామర్ అవసరం లేదని ఓటర్ నాడి తెలిసిన రాజకీయ మేథావులు అంటున్నారు.  

బావలైన, బావమరుదులైన..  ప్రజలకు సేవలు  అందించే నాయకుడి కోసం ఓటర్లు ఎదురు చూస్తున్నారు. ఈ సారీ నిజాయితీగల నాయకుడికే విజయం వరిస్తుందని  కొన్ని రాజకీయ సర్వేలు చెబుతున్నాయి.  ఈ ఎన్నికల సమరంలో  బావ, బావమరుదుల ప్రచారం ఫలితం ఎలా ఉంటుందో చూద్దం....

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more