సినీ ఇండస్ట్రీ అన్న తర్వాత హీరోయిన్లకు తప్పనిసరిగా ఎక్స్ పోజింగ్ చేయాల్సి వుంటుంది. మంచి నటనను కనబరుస్తూనే అందాలు ఆరబోస్తే వారికి మరిన్ని ఆపర్లు వరిస్తాయి. అలాకాకుండా ఎక్స్ పోజింగ్ చేయనంటే మాత్రం.. సినిమాలను చేతులారా మిస్ చేసుకోవాల్సి వస్తుంది. పైగా.. కాలక్రమంలో వారి ఇమేజ్ ఇండస్ట్రీలో తగ్గుతూ వస్తుంది. మరోవైపు కొత్తగా వస్తున్న హీరోయిన్లు విచ్చలవిడిగా ఎక్స్ పోజింగ్ చేస్తూనే లిప్ లాక్, హాట్ సన్నివేశాల్లో నటించడంతో వారికి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. ఇలా వీరి నుంచి పోటీ వచ్చిన నేపథ్యంలో సీనియర్ తారలు సైతం అందాల ఆరబోసేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఏదిఏమైనా తాను మాత్రం సినిమాల్లో ఎక్స్ పోజింగ్ చేయనంటోంది తెలుగమ్మాయి శ్రీదివ్య!
‘బస్టాప్’ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన తెలుగమ్మాయి శ్రీదివ్య.. తమిళంలో బిజీగా తారగా మారిపోయింది. అక్కడ ఈమెకి అందివచ్చిన అవకాశాలు ఏమాత్రం వదులుకోకుండా అంగీకరిస్తూ.. వరుస విజయాలను అందుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు అక్కడ ఫుల్ బిజీ హీరోయిన్ గా మారింది. ఈమె క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందంటే.. పెద్ద హీరోల సినిమాల నుంచి కూడా ఈమెకు అవకాశాలు వస్తున్నాయట! ఈ క్రమంలోనే ఈమెకు ఓ భారీ ఆఫర్ వరించింది. అయితే.. అందులో మోడరస్ డ్రెస్సుల్లో అందాలు ఒలకబోయాలని ఆ మూవీ దర్శకనిర్మాతలు డిమాండ్ చేయగా.. అందుకు తాను ఒప్పుకోనని చెప్పి ఆ మూవీ ఆఫర్ ని వదిలేసుకుంది.
ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. ‘ఇటీవలే ఓ పెద్ద హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ ఆఫర్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే.. వారు బాగా ఎక్స్ పోజింగ్ చేయాలని డిమాండ్ చేశారు. దాంతో నేను ఆ ఆఫర్ ని వదిలేసుకున్నాను. నాకు మోడరన్ డ్రెస్సులు వేసుకోవడం ఇష్టమే కానీ.. ఎక్స్ పోజ్ చేసే దుస్తులు మాత్రం వేయలేను’ అని చెబుతోంది. మరి.. ఎక్స్ పోజ్ చేయనంటూ ఇలా మొండికేసి కూర్చుంటున్న ఈ అమ్మడికి రానున్న రోజుల్లో ఆఫర్లు వస్తాయా..? లేదా..? అన్నది వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more