కొంత మంది సినిమా హీరోలకు ఎంత వయస్సు వచ్చినా వాళ్లలో కోరికలు చచ్చిపోవు. వారు జీవితంలో ఎంత పేరు, హోదా, డబ్బు సంపాదించినా అవి చాలవన్నట్లుగా డబ్బుకోసం ఆశపడి, వయస్సు మీద పడినా సినిమాలు చేస్తూ జనాలను ఒక రకంగా హింసిస్తుంటారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్న వాళ్ళలో చిరంజీవి ఒక్కడే ప్రస్తుతానికి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. మిగతా హీరోలు అయినా నాగార్జున, వెంకటేష్, బాలక్రిష్ణ లాంటి వాళ్లు ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. అయితే చిరంజీవి లాగ మరికొన్ని ఒక రౌండ్ ఫిగర్ వచ్చేవరకు సినిమాలు చేసి తరువాత రాజకీయాల్లోకి వద్దామనుకున్న బాలయ్యకు ఆ కోరిక నెరవేరేట్లు లేదు. ఇక బాలయ్య సినిమా కెరీర్ క్లోజ్ అయిపోయినట్లే అని అనుకుంటున్న సమయంలో ‘సింహా ’ లాంటి బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకొని తనలో ఏ మాత్రం చేవ తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఆ తరువాత నుండి సినిమాల మీద సినిమాలు తీస్తున్నాడు.
కానీ ఆ సినిమా తరువాత బాలయ్య ఖాతాలో ఒక్కటి అంటే ఒక్క హిట్టు లేదు. దాంతో మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి బాక్సాఫీసుకి కొన్ని రోజులు దూరంగా ఉండి 2014 ఎన్నికల లోపు తన తండ్రి స్థాపించిన పార్టీలో క్రియాశీల రాజకీయాల్లో పాలు పంచుకోవాలని అనుకున్నాడు. కానీ మొన్న వచ్చిన ‘శ్రీమన్నారాయణ ’ కూడా పేలడంతో బాలక్రిష్ణ సందేహంలో పడ్డాడు. ప్రస్తుతం బాలక్రిష్ణ చేతిలో ఓ నాలుగు సినిమాలు ఉన్నాయి. అయితే వాటిని కొంత కాలం ఆగి స్టార్ట్ చేయాలా ? లేక ఏదొ ఒక కథని తీసుకొని హిట్టుకొట్టి విరామం తీసుకోవాలా ? అనే మీమాంసలో బాలక్రిష్ణ ఉన్నాడు.
అయితే సినిమా జనాలు మాత్రం ముఖంలో ముసలి ఛాయలు స్పష్టంగా కనబడుతున్నా, వరసు ప్లాపులు వస్తున్నా సినిమాల మీద సినిమాలు తీస్తూ జనాన్ని చావదొబ్బుతున్నాడని, అయినా బాలక్రిష్ణకి సినిమాలపై కోరిక తీరలేదని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more