సినిమా హీరోయిన్లు తమకు అవకాశాలు ఉన్నప్పుడు అందలం ఎక్కుతారు. సినిమా హిట్ అయితే చాలు తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తారు. తన హవానడిచినన్ని రోజులు ఎవర్ని లెక్కచేయరు. అగ్ర హీరోల ప్రక్కన నటించమంటే.. అతనికి ఏజ్ బార్, యంగ్ హీరోలు అయితేనే ఒకే అంటారు. బి గ్రేడ్ హీరోల ప్రక్కన నటించమంటే వారితోనా ? అని ఒకింత ఆశ్చర్యాన్ని వెల్లబుచ్చుతారు. కానీ అవకాశాలు తగ్గుముఖం పట్టి, కెరియర్ గాడి తప్పుతుందనే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం కాళ్ళ బేరానికి వస్తారు. ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటి పరిస్థితే చవిచూస్తుంది చామింగ్ గర్ల్ ఛార్మి. ఒకప్పుడు బొద్దుగా ఉన్న తన ముద్దు ముద్దు చేష్టలతో, అందాలతో అవకాశాలు సంపాదించుకున్న ఛార్మీకి ఈ మధ్య కాలంలో అవకాశాలు రావడం లేదు. దీంతో బొద్దుగా ఉన్న ఆ భామ కాస్త నాజూగ్గా తయారయింది. కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు.
దీంతో ఆ భామ ఆఫర్ల కోసం సకల మ్యాజిక్కులు, జిమ్మిక్కులు ప్రదర్శిస్తోందట. గతంలో నాగార్జున సినిమాలో నటించిన ఛార్మీ అతన్ని కాకా పట్టి "ఢమరుకం"లో ఓ పాత్ర పోషించింది. ఈ సినిమాతోనైనా తన పూర్వ వైభవాన్ని చేజిక్కించుకోవాలని తపనపడుతుండట. తాజాగా బాలయ్య నటించిన 'శ్రీమన్నారాయణ' ట్రిపిల్ ప్లాటినం డిస్క్ ఆడియో ఫంక్షన్‌తో ఏసంబంధం లేకున్నా ఈ భామ హఠాత్తుగా ప్రత్యక్షం కాగా ఛార్మీ రాకతో బాలయ్య అవాక్ అయ్యాడట. గతంలో బాలయ్య, ఛార్మీల కాంబినేషన్లో అల్లరిపిడుగు చిత్రం రాగా బాలయ్యతో మరో మారు ఆఫర్ కోసం ఛార్మి అర్రులు చాస్తోందట. సీనియర్ హీరోలను చూస్తే ఆమడ దూరంగా ఉండే హీరోయిన్లు టాలీవుడ్‌లో ప్రస్తుతం బాగా సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నారట. శ్రీమన్నారాయణ చిత్రంలోని హాట్ భామలు ఇషా చావ్లా, పార్వతి మెల్టన్‌లు బాలయ్యతో బాగా దగ్గరగా మూవ్ కావడాన్ని చూసిన ఛార్మీ.. దాన్ని జీర్ణించుకోలేక ఈ తరహా పాట్లు పడుతున్నట్టు వినికిడి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more