Nithin A Aa Movie Review

Teluguwishesh అఆ అఆ Get The Complete Details of A Aa Movie Review. Starring Nithin and Samantha in the lead roles. Directed by Trivikram Srinivas. Music composed by Mickey J Meyer. Produced by S. Radhakrishna on Haarika & Hassine Creations banner. For More Details Visit Teluguwishesh.com Product #: 75109 3.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    అఆ

  • బ్యానర్  :

    హారికా అండ్ హాసిని క్రియేషన్స్

  • దర్శకుడు  :

    త్రివిక్రమ్ శ్రీనివాస్

  • నిర్మాత  :

    రాధాకృష్ణ

  • సంగీతం  :

    మిక్కీ.జే.మేయర్

  • సినిమా రేటింగ్  :

    3.253.253.25  3.25

  • ఛాయాగ్రహణం  :

    నటరాజన్ సుబ్రమణ్యం

  • ఎడిటర్  :

    కోటగిరి వెంకటేశ్వర రావు

  • నటినటులు  :

    నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్, పోసాని, రావు రమేష్ తదితరులు

A Aa Movie Review

విడుదల తేది :

2016-06-02

Cinema Story

‘అఆ’ సినిమా సమంత చెప్పే ‘ఇద్దరు గురించి కథ చెప్పాలేంటే మూడు భాగాలుగా చెప్పచ్చు …ఒక బిగినింగ్, ఒక ట్విస్ట్, ఎండింగ్’ అనే డైలాగ్ తో ప్రారంభమవుతుంది. ఓ కోటిశ్వరుడి కూతురు అనసూయ రామలింగం(సమంత). ఓసారి అనుకోకుండా ట్రైన్ లో నందు (నితిన్) ను కలుస్తుంది. అలా పరిచయం అయిన వీరిద్దరూ ఒకరినొకరు తమ జీవితాల్లోని సంఘటనల గురించి మాట్లాడుకుంటూనే ప్రేమలో పడిపోతారు. అయితే అనుకోకుండా నితిన్ కుటుంబం అనుపమతో నితిన్ పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. అనసూయ, నందులు ఒకరిపై ఒకరు తమ ప్రేమను తెలియజేస్తారా లేదా? అనుపమతో పెళ్లికి నందు ఒప్పుకుంటాడా లేదా? చివరకు ఏం జరిగింది అనే వెండితెర మీద చూడాల్సిందే!

cinima-reviews
అఆ

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా నటించిన తాజా చిత్రం ‘అఆ’. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ.జే.మేయర్ సంగీతం అందించారు. మలయాళ యువ నటి అనుపమ పరమేశ్వరన్ మరియు తమిళ నటి అనన్య కీలక పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లు, మేకింగ్ వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని, క్లీన్ U సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. బ్యూటీఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాను నేడు(జూన్ 2) ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసారు. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:
‘అఆ’ సినిమాకు చాలా ప్లస్ పాయింట్స్ వున్నాయి. కానీ నటీనటుల విషయానికొస్తే నితిన్, సమంత, అనుపమలు ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు నితిన్ చేసిన సినిమాలన్నింటికంటే ఇందులో చాలా ఢిఫరెంట్ గా, కొత్తగా కనిపించాడు. కేవలం లుక్స్ పరంగానే కాకుండా నటనలో కూడా చాలా మెరుగయ్యాడు. సెటిల్డ్ గా తన పాత్రకు వంద శాతం న్యాయం చేసాడు. ఈ సినిమాలో నితిన్ తన నటనకు మంచి మార్కులు కొట్టేసాడని చెప్పుకొవచ్చు. ఇక అనసూయ రామలింగం పాత్రలో సమంత బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో సమంత క్యారెక్టర్ చాలా కొత్తగా వుంది. ఈ సినిమాతో నటిగా సమంతకు మరోస్థాయి పెరిగిందని చెప్పుకోవచ్చు. తన క్యూట్ స్మైల్, హవాభావాలతో అలరించింది. నితిన్-సమంతల మధ్య వచ్చే సీన్లు బాగా ఆకట్టుకున్నాయి. ఇక తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగెట్టిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. పల్లెటూరి అమ్మాయిగా, విభిన్నమైన భాషతో అదరగొట్టేసింది. అంతేకాకుండా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పి దుమ్మురేపింది. నితిన్-అనుపమల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి.

ఇందులో మలయాళ హీరోయిన్ అనన్య తన పాత్రలో జీవించేసింది. చాలా సింపుల్, పల్లెటూరి అమ్మాయిగా చాలా చక్కగా నటించింది. ఇక నదియ, ఈశ్వరి రావు, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, పోసాని తదితరులు వారి వారి పాత్రలలో బాగా చేసారు.

ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా సరదా సరదాగా కొనసాగుతుంది. లవ్, ఎంటర్ టైన్మెంట్ తో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ నుంచే అసలు కథ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ లో కాస్త ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువే. మొత్తానికి ‘అఆ’ సినిమాను కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్:
ఈ సినిమాకు పెద్దగా మైనస్ పాయింట్స్ అంటూ ఏమి లేవు కానీ... ఫస్ట్ హాఫ్ లో వున్నంత ఎంటర్ టైన్మెంట్ సెకండ్ హాఫ్ లో లేదనిపిస్తుంది. పైగా సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్లు కాస్త ఎక్కువయ్యాయి. అలాగే రన్ టైం కూడా ఎక్కువయ్యింది. దాదాపు 10నిమిషాలు ఎడిటింగ్ చేసిన సినిమా వేగం మరింతగా పెరిగేది.

సాంకేతికవర్గం పనితీరు:
‘అఆ’ సినిమా టెక్నికల్ టీం విషయానికొస్తే ముందుగా దర్శకుడు త్రివిక్రమ్ గురించి చెప్పుకోవాల్సిందే. ఈ సినిమాతో మరో హిట్టును త్రివిక్రమ్ తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్ కథను తీసుకొని, ప్రేక్షకులను ఆద్యంతం అలరించే విధంగా చాలా చక్కగా స్ర్కీన్ ప్లే ఆకట్టుకున్నాడు. తనదైన స్టైల్ మార్క్ వుంటూనే కొత్తగా, అందంగా చూపించాడు. దర్శకుడిగా తనని తాను మరో మెట్టుకు పెంచేసుకున్నాడు. ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రహ్మణ్యం. నటరాజన్ అందించిన సినిమాటోగ్రఫి అద్భుతం. పల్లెటూరి అందాలు, ప్రకృతిని చాలా చక్కగా చూపించాడు. విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా వుంటూనే... సినిమాకు తగ్గట్లుగానే ప్రతి మూడ్ ను ఫర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసారు. మిక్కీ.జే.మేయర్ సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. విజువల్స్ పరంగా మరింత బాగున్నాయి. రీరికార్డింగ్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఎడిటింగ్ బాగుంది. ఆర్ట్ వర్క్ సింప్లీ సూపర్బ్. నిర్మాత రాధాకృష్ణ అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను చాలా గ్రాండ్ గా నిర్మించారు.

చివరగా:
‘అఆ’: కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం.

- Sandy