Allu Arjun Sarrainodu Telugu Movie Review Rating

Teluguwishesh సరైనోడు సరైనోడు Get The Complete Details of Sarrainodu Telugu Movie Review. Starring Allu Arjun, Rakul Preet Singh, Catherine Tresa. directed by Boypathi Sreenu, Music by SS Thaman from the house of Geethaarts. For More Details Visit Teluguwishesh.com Product #: 74043 3.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    సరైనోడు

  • బ్యానర్  :

    గీతా ఆర్ట్స్

  • దర్శకుడు  :

    బోయపాటి శ్రీను

  • నిర్మాత  :

    అల్లు అరవింద్

  • సంగీతం  :

    థమన్

  • సినిమా రేటింగ్  :

    3.253.253.25  3.25

  • ఛాయాగ్రహణం  :

    రిషి పంజాబి

  • ఎడిటర్  :

    కోటగిరి వెంకటేశ్వర రావ్

  • నటినటులు  :

    అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ థెస్రా, శ్రీకాంత్, ఆది పినిశెట్టి, అంజలి తదితరులు.

Sarrainodu Movie Review

విడుదల తేది :

2016-04-22

Cinema Story

ఆర్మీ నుంచి సోసైటీకి సర్వీస్ చేయాలని తిరిగొచ్చేసిన వ్యక్తి గణ(బన్నీ). అన్యాయం కనిపించినా, వినిపించినా తిరగబడే క్యారెక్టర్. అనుకోకుండా ఎమ్మెల్యే హన్సితా రెడ్డి(కెథరిన్ థ్రెసా)తో ప్రేమలో పడతాడు. ఇదిలా జరుగుతుండగా.. ఓ అమ్మాయిని ఓ బడా బిజినెస్ మెన్ కొడుకు రేప్ చేసి, చంపేస్తాడు. ఈ కేసులో ఆ అమ్మాయి తరపున హన్సితారెడ్డి పోరాడుతూ వుంటుంది. కానీ నిందితులకు సపోర్ట్ గా సీఎం కొడుకు ధనుష్(ఆది పినిశెట్టి) నిలబడి.. వారికి అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తాడు. సీన్ కట్ చేస్తే... ఓ విషయంలో ధనుష్ మనుషులను చితక్కొట్టి హన్సితకు మరింత దగ్గరవుతాడు. చివరకు గణ ప్రేమను హన్సితా ఒప్పుకొని, గొడవలకు దూరంగా వుండాలని షరతు పెడుతోంది. అందుకోసం ఓ అమ్మవారి గుడి దగ్గర ప్రమాణం చేయిస్తున్న సమయంలో అక్కడికి జాను(రకుల్ ప్రీత్ సింగ్) వస్తుంది. జానును విలన్లు తరుముతూ అక్కడికి వస్తారు. దీంతో జానును చంపుతున్న క్షణంలో.. గణ ఆమెను కాపాడటం కోసం జానూ తనదేనని చెప్పి అందరికి షాక్ ఇస్తాడు. అసలు జాను ఎవరు? జానుకి గణకు ఎంటి సంబంధం? గణకు ధనుష్ కు మధ్య వున్న వైరం ఏంటి? చివరకు ఏం జరిగింది అనే అంశాలను వెండితెర మీద చూస్తేనే బాగుంటుంది.

cinima-reviews
సరైనోడు

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోగా అందమైన భామలు రకూల్ ప్రీత్ సింగ్, కెథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘సరైనోడు’. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’ను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు.

థమన్ సంగీతం అందించిన పాటలు, వీడియోలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులోని బ్లాక్ బస్టర్ సాంగ్ చాట్ బస్టర్స్ లో టాప్ 10 స్థానంలో నిలిచింది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని, సెన్సార్ బోర్డ్ నుంచి U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. కమర్షియల్ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని నేడు(ఏప్రిల్ 22) ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసారు. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:
‘సరైనోడు’గా అల్లు అర్జున్ పాత్ర చాలా బాగుంది. తన యాక్టింగ్, డైలాగ్ డెలవరీ, లవ్, ఎమోషన్ సీన్లలో ఆకట్టుకున్నాడు. ఇక డాన్సులు, ఫైట్స్ చింపేసాడు. లుక్స్ పరంగా బన్నీ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది. ఒకరకంగా చెప్పుకోవాలంటే ‘సరైనోడు’గా బన్నీ దుమ్మురేపాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో భీభత్సమైన యాక్షన్ తో అదిరిపోయింది. ఇక కెథరిన్ అందమైన ఎమ్మెల్యేగా ఆకట్టుకుంది. రకూల్ ప్రీత్ సింగ్ చాలా చక్కగా నటించింది. బన్నీతో వీరి కెమిస్ట్రీ బాగుంది. ఇక నెగెటివ్ పాత్రలో నటించిన ఆది పినిశెట్టి అద్భుతంగా నటించాడు. స్టైలిష్ విలన్ గా తన నటనతో ఆకట్టుకున్నాడు. బన్నీకి ఆది గట్టిపోటీనే ఇచ్చాడు. ఇక శ్రీకాంత్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు.

ఇక సుమన్, సాయికుమార్ తదితరులు వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేసారు. స్పెషల్ సాంగ్ లో నటించిన అంజలి తన అందచందాలు, డాన్సులతో అదరగొట్టేసింది. బ్రహ్మానందం కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. వున్నంత సేపు కడుపుబ్బా నవ్వించేసాడు. ఇక సినిమాలో ఫైట్స్, యాక్షన్ సీన్లు చాలా బాగున్నాయి. సినిమాను విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా తీర్చిదిద్దారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కమర్షియల్ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా సాగుతుంది.

మైనస్ పాయింట్స్:
ఇలాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినట్లుగా అనిపిస్తోంది. కథలో ఎలాంటి కొత్తదనం లేకపోగా కథనం కూడా ఆకట్టుకోలేదు. సినిమాలో పెద్దగా ట్విస్టులేమి లేకపోవడం, కథనం స్లోగా సాగడం బిగ్గెస్ట్ మైనస్. ఫస్ట్ హాఫ్ తో పోలీస్తే సెకండ్ హాఫ్ చాలా స్లోగా సాగుతున్నట్లుగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్లు బాగా ఎక్కువయ్యాయి. ఎంటర్ టైన్మెంట్ తక్కువ కావడంతో ప్రేక్షకులకు మరీ బోర్ ఫీలవుతారు. ఇక రకుల్ క్యారెక్టర్ కూడా చిన్నదే కావడంతో అభిమానులు కాస్త నిరాశ చెందుతారు.

సాంకేతికవర్గం పనితీరు:
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ రిషి పంజాబి సినిమాటోగ్రఫి. ‘సరైనోడు’ సినిమాను అద్భుతంగా చిత్రీకరించాడు. విజువల్స్ పరంగా గ్రాండ్ గా, కలర్ఫుల్ గా రూపొందించారు. యాక్షన్ సీన్లలో సినిమాటోగ్రఫి సూపర్బ్. థమన్ సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. ‘బ్లాక్ బస్టర్...’ పాట థియేటర్లలో దుమ్మురేపుతోంది. రిషి పంజాబి విజువల్స్ కు థమన్ రీరికార్డింగ్ బాగుంది. ఆర్ట్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ పరంగా సెకండ్ హాఫ్ లో మరింత జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. డైలాగ్స్ పర్వాలేదు.

ఇక ఈ సినిమాకు కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం భాధ్యతలను వహించిన బోయపాటి శ్రీను మరోసారి తన పంథాలోనే సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. కేవలం యాక్షన్, మాస్ సినిమాల దర్శకుడిగా బోయపాటి టాప్ 1 స్థానంలో నిలుస్తాడని సినీవర్గాల్లో ఓ టాక్. ఆ టాక్ నిజమని బోయపాటి మరోసారి నిరూపించుకున్నాడు. కథ, స్ర్కీన్ ప్లే విషయంలో ఎలాంటి కొత్తదనం లేదు. కనీసం కథనంలోనైనా మరింత జాగ్రత్తగా డిజైన్ చేసుకొని వుంటే బాగుండేది. దర్శకుడిగా మాత్రం సక్సెస్ అయ్యాడు. గీతా ఆర్ట్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా అంతా కూడా చాలా గ్రాండ్ గా వుంది.

చివరగా:
‘సరైనోడు’: భారీ మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్.