Garam | Aadi | Garam Review | Adah Sharma

Teluguwishesh గరం గరం Get The Complete Details of Garam Telugu Movie Review. The Latest Telugu Movie Garam featuring Aadi, Adah Sharma, Brahmanandam and Shakalaka Shankar. Directed by Madan. Music directed by Agasthya. Produced by Surekha P. For More Details Visit Teluguwishesh.com Product #: 72346 2 stars, based on 1 reviews
  • చిత్రం  :

    గరం

  • బ్యానర్  :

    శ్రీనివాసాయి స్ర్కీన్స్

  • దర్శకుడు  :

    మ‌ద‌న్

  • నిర్మాత  :

    పి.సురేఖ

  • సంగీతం  :

    అగ‌స్త్య

  • సినిమా రేటింగ్  :

    22  2

  • ఛాయాగ్రహణం  :

    టి.సురేంద్ర‌రెడ్డి

  • ఎడిటర్  :

    కార్తీక శ్రీనివాస్

  • నటినటులు  :

    ఆది, ఆదాశర్మ, న‌రేష్ , త‌నికెళ్ళ భ‌ర‌ణి, పోసాని, చైత‌న్య కృష్ణ‌, క‌బీర్ సింగ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, తాగుబోతు ర‌మేష్‌ తదితరులు

Garam Movie Review

విడుదల తేది :

2016-02-12

Cinema Story

ఆవారాగా తిరిగే వరాలబాబు(ఆది). తన కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకొని గొప్పవాడు కావాలని కోరుకునే తండ్రి బలరాం(తనికెళ్ల భరణి). కానీ వరాలబాబు తండ్రి మాట లెక్కచేయకుండా ఆవారాగా తయారవుతాడు. పక్కింట్లో వుండే మూర్తి(నరేష్) కొడుకు రవి(చైతన్య కృష్ణ) బాగా చదువుకునే వ్యక్తిని చూపించి, వరాలబాబుకు రోజు చివాట్లు. ఒకరోజు వరాలబాబుకి కోపం వచ్చి అందరూ నాలా అవ్వాలనే స్టేజ్ వస్తానని చెప్పి సిటీకి వస్తాడు. సిటీలో దిగగానే సమీర(ఆదాశర్మ)ని చూసి ప్రేమలో పడతాడు. ఇక సమీరను ప్రేమలో పడేయాలని ట్రై చేస్తుంటాడు. సమీర కూడా తన ఇష్టాన్ని చెప్పలేని పరిస్థితుల్లో వుంటుంది. ఓరోజు బిజ్జు(కబీర్ దుహన్ సింగ్) అనే వాడి వలన సమీర ఆపదలో వున్నారని తెలుసుకుంటాడు వరాలబాబు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సమీర తన ప్రేమను చెప్పలేని పరిస్థితులు ఏంటి? బిజ్జు ఎవరు? బిజ్జు వల్ల సమీర ఎందుకు ప్రమాదంలో వుంది? సమీర కోసం వరాలబాబు ఏం చేసాడు? అనే విషయాలను వెండితెర మీద చూడాల్సిందే.

cinima-reviews
గరం

ఆది, ఆదాశర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘గరం’. ప్రముఖ దర్శకుడు మదన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్ర్కీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో పి.సురేఖ నిర్మించారు. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి అగస్త్య సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాతో డైలాగ్ కింగ్ సాయికుమార్ నిర్మాణరంగంలోకి అడుగెట్టారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని నేడు(ఫిబ్రవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:
ఆది తన పాత్రలో చాలా చక్కగా నటించాడు. మాస్ పాత్రలో కనిపిస్తూనే, పంచ్ డైలాగ్స్ బాగా పేల్చాడు. అలాగే కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక డాన్సులు, ఫైటింగ్స్ బాగా చేసాడు. ఆదాశర్మ పాటల్లో అందాల అరబోత బాగానే చేసింది. చాలా చక్కగా నటించింది. సీనియర్ నటులు నరేష్, తనికెళ్ల భరణి, కబీర్ దుహన్ సింగ్ లు వారి వారి పాత్రల మేరకు బాగా నటించారు. ఆది ఫ్రెండ్ పాత్రలో షకలక శంకర్ బాగా నవ్వించాడు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు. ఇక సినిమా ఎంటర్ టైనింగ్ గా స్టార్ అవ్వడం ప్లస్ పాయింట్. లవ్, కామెడీ అంశాలతో ఫస్ట్ హాఫ్ సరద సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ కాస్త యాక్షన్ తో సాగిపోతుంది. మొత్తానికి పర్వాలేదు.

మైనస్ పాయింట్స్:
సినిమా ప్రారంభమైన 30 నిమిషాల తర్వాత బాగా రొటీన్ గా అనిపిస్తుంది. అలాగే బోర్ గా అనిపిస్తుంది. కామెడీ సీన్లను చాలా చోట్ల ఇరికించి పెట్టినట్లుగా అనిపిస్తుంది. కథలో కొత్తదనం ఏమి లేదు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా.. సెకండ్ హాఫ్ మరీ బోర్ గా అనిపిస్తుంది. ఎంటర్ టైన్మెంట్ కరువు. సాగదీసే సీన్లు ఎక్కువయ్యాయి. ఓవరాల్ గా చాలా బోర్ గా అనిపిస్తుంది.

సాంకేతికవర్గం పనితీరు:
సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ పరంగా ప్రతి ఫ్రేమ్ ని బాగా చూపించాడు. అగస్త్య నేపధ్య సంగీతం బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ బాగోలేదు. సెకండాఫ్ అయితే మరీ సాగదీసినట్టు ఉంటుంది. ఆర్ట్ వర్క్ బాగుంది. ఈ సినిమాకి కథ, మాటలు శ్రీనివాస్ గవిరెడ్డి అందించాడు. కథ చాలా పాతదే, ఆ కథలో చేసిన మార్పులు కూడా కొత్తగా ఏం లేవు. డైలాగ్స్ మాత్రం బాగున్నాయి. కొన్ని పంచ్ డైలాగ్స్ బాగున్నాయి. ఇక స్క్రీన్ ప్లే – దర్శకత్వ విభాగాలను డీల్ చేసింది మదన్. స్క్రీన్ ప్లే లో దాచిపెట్టిన ఒక ట్విస్ట్ బాగుంది. కానీ అది చివరి దాకా దాయడం వలన మిగతా అంతా బోర్ కొడుతుంది. సురేఖ.పి నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
గరం: సినిమాలో అంత గరం లేదు.