Sher Movie Review | Kalyan Ram Sher Review | Sher Movie Review And Rating

Teluguwishesh షేర్ షేర్ Get information about Sher Movie Review, Sher Movie Telugu Review, Kalyan Ram Sher Movie Review, Sher Movie Review And Rating, Sher Movie Talk, Sher Movie Trailer, Kalyan Ram Sher Review, Sher Movie Gallery and more only on TeluguWishesh.com Product #: 69649 1.75 stars, based on 1 reviews
 • చిత్రం  :

  షేర్

 • బ్యానర్  :

  విజయలక్ష్మీ పిక్చర్స్

 • దర్శకుడు  :

  మల్లికార్జున్

 • నిర్మాత  :

  కొమర వెంకటేష్

 • సంగీతం  :

  ఎస్.ఎస్.థమన్

 • సినిమా రేటింగ్  :

  1.75  1.75

 • ఛాయాగ్రహణం  :

  సర్వేష్ మురారి

 • ఎడిటర్  :

  కోటగిరి వెంకటేశ్వరరావు

 • నటినటులు  :

  నందమూరి కళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్, బ్రహ్మానందం, రావు రమేష్, ఆలీ

Sher Movie Review

విడుదల తేది :

2015-10-30

Cinema Story

బీటేక్ పూర్తి చేసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ జాలీగా తిరిగే కుర్రాడు గౌతమ్(కళ్యాణ్ రామ్). తన తండ్రి (రావు రమేష్)కు నిర్మాణ రంగంలో సాయం చేస్తుంటాడు. గౌతమ్ తమ్ముడికి చెస్ అంటే చాలా ఇష్టం. అతనికి ట్రెయినింగ్ ఇచ్చి కోల్ కతాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు తల్లి (రోహిణి)తో పంపుతాడు. ఇంతలో తన ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయిని పప్పు(విక్రమ్ జిత్) పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి ఆ అమ్మాయిని తీసుకొస్తాడు. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మరొకరితో పెళ్లి చేయాలని అనుకున్న గౌతమ్ తో ఓ సవాల్ విసురుతాడు పప్పు. గౌతమ్ జీవితంలోకి ఏ అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని తనదాన్నిగా చేసుకుంటానని సవాల్ విసురుతాడు.

 

సీన్ కట్ చేస్తే తొలిచూపులోనే గౌతమ్ ను చూసి ప్రేమలో పడుతుంది నందిని(సోనల్ చౌహన్). నందిని తండ్రి (సాయాజీ షిండే) పోలీస్ ఆఫీసర్. దాదా(ముఖేష్ రుషి)తో పప్పుకు వున్న సంబంధాలు తెలిసి డిజీపి పోస్ట్ ఎరగా పెట్టి తన కూతురు నందినిని పప్పుకు ఇవ్వడానికి సిద్ధమవుతాడు. కానీ అదే పోస్ట్ ను ఆఫర్ చేసి గౌతమ్ కూడా రంగంలోకి దిగుతాడు. ఇక అసలు కథ అక్కడినుంచి స్టార్ అవుతుంది. అసలు పప్పుతో గౌతమ్ గొడవ పడటానికి గల కారణాలేంటి? కేవలం నందిని కోసమే పప్పుతో గొడవలు పడ్డాడా? అసలు విషయం ఏంటి అనే అంశాలు థియేటర్లోనే చూడాలి.

cinima-reviews
షేర్

‘పటాస్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘షేర్’. సాయి నిహారిక, శరత్ చంద్ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ పై మల్లికార్జున్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కొమర వెంకటేష్ నిర్మించారు.

భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. కళ్యాణ్ రామ్ సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 30వ తేదిన గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్’ సినిమా భారీ విజయం సాధించడంతో... ‘పటాస్’ తర్వాత వచ్చే ఈ ‘షేర్’ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకుంటే.. కళ్యాణ్ రామ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాలలో అదరగొట్టేసాడు. కొన్ని కొన్ని సీన్లలో కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి. ఇక సోనల్ చౌహన్ తన అందచందాలతో ఆకట్టుకుంది. పిచ్చెక్కించే విధంగా భారీగా అందాలు ఆరబోసేసింది. ముఖ్యంగా బీచ్ సాంగ్ లో గ్లామర్ డోస్ మరింతగా పెంచేసింది. ఇక రావు రమేష్, రోహిణి, పృద్వీలు వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేసారు. మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు.

మైనస్ పాయింట్స్:

కళ్యాణ్ రామ్ యాక్టింగ్, సోనల్ చౌహన్ అందాలు, డైమండ్ రత్నం బాబు రాసిన డైలాగ్స్ తప్ప సినిమాలో అంతా కూడా మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవాలి. ఇలాంటి సినిమా కథలు ఇప్పటికే చాలా వచ్చాయి. కథ పాతదే అయినా స్ర్కీన్ ప్లే విషయంలోనైనా కేర్ తీసుకొని పకడ్బందీగా తీసి వుంటే బాగుండేది. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు బాగా బోర్ ఫీలవుతారు.

సాంకేతికవర్గ పనితీరు:

దర్శకుడిగా మల్లికార్జున్ మరోసారి ఫెయిల్ అయ్యారు. కథ, కథనం సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. డైలాగ్స్ బాగున్నాయి. థమన్ సంగీతం అస్సలు బాగోలేదు. ఎడిటింగ్ అస్సలు బాగోలేదు. సినిమాటోగ్రఫి పర్వాలేదు. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.

చివరగా:

షేర్: ఇది చాలా బోర్