నందిగామలోని ఓ పాత రాజమహల్ లోకి ముగ్గురు యువకులు వస్తారు. అంతే! ఎంట్రీ ఇచ్చినవారు అక్కడే చనిపోతారు. ఆ రాజమందిరం గురించిన రహస్యాన్ని చేధించాలని వచ్చే ప్రతి ఒక్కరూ చనిపోతూ ఉంటారు. అప్పటికే 34 మంది చనిపోవడంతో దాన్ని గవర్నమెంట్ సీజ్ చేస్తుంది. 6 నెలలు గడిచిన తర్వాత మా టీవీ వారు ప్రభుత్వం చేత పర్మిషన్ ని సాధించి.. ఆ రాజమహల్ లోకి వెళతారు. అందులో 7 రోజులపాటు ఉండి దెయ్యం ఉందా లేదా అని కనిపెట్టిన వాడికి 3 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తామని ఓ రియాలిటీ షోని ప్లాన్ చేస్తారు. ఈ ప్రోగ్రాం కోసం ఓ 7 మందిని సెలక్ట్ చేస్తారు.
అలా సెలక్ట్ చేసిన అశ్విన్(అశ్విన్ కుమార్), డా.నందన్(చేతన్ చీను), ధన్య బాలకృష్ణ(బాల), ఈశాన్య(బార్బీ), బుజ్జిమ(విద్యుల్లేఖ), ఎం.వై దానం అలియాస్ మైదానం(శకలక శంకర్), శివుడు(ధన రాజ్)లు కలిసి ఆ రాజ మహల్ లోకి వెళ్తారు. ఆ రాజమహల్ లో మొదటి రోజు నుంచే వీరికి వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. అలా ఒక్కొక్కరిలోనూ అక్కడ దెయ్యం ఉందనే ఫీలింగ్స్ బలపడుతున్న టైంలో అశ్విన్ ఆ విషయాన్ని చేధించబోయి ఎవ్వరికీ తెలియని ఓ కొత్త రహస్యాన్ని తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న రహస్యం ఏమిటి.? అసలా రాజమహల్ లో నిజంగానే దెయ్యం ఉందా లేదా? అనే ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే.. వెండితెరపై సినిమా చూడాల్సిందే.
‘జీనియస్’ సినిమాతో దర్శకుడిగా మారిన ఓంకార్... ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఈసారి ‘రాజు గారి గది’ సినిమాతో మనముందుకు వస్తున్నాడు. ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్, ధన్య బాలకృష్ణన్, చేతన్ చీను, ఈశాన్య, పూర్ణ ప్రధాన పాత్రలలో రూపొందిన తాజా చిత్రం ‘రాజుగారిగది’.
హర్రర్ కామెడీ క్రైం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని వారాహిచలన చిత్రం, అనిల్ సుంకర సమర్పణలో ఓఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ప్రై.లి. పతాకంపై రూపొందించారు. ఈనెల 22న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. అందరిని మెప్పించిందో లేదో చూద్దామా..
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి ప్లస్ పాయింట్ కామెడి. దర్శకుడు ఓంకార మొదటి అర్ధభాగంలో ఆడియన్స్ ని భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించాడు. సినిమా స్టార్టింగ్ నుంచి అక్కడక్కడా భయపెడుతూ.. నవ్వించుకుంటూ వచ్చిన ఓంకార్ ఇంటర్వల్ బ్లాక్ దగ్గర 20 నిమిషాలపాటు ఆడియన్స్ ని పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు. ముఖ్యంగా శివుడుగా ధన్ రాజ్, మైదానంగా శకలక శంకర్ లు భీభత్సంగా నవ్వించారు. వీటికి తోడు ఫస్ట్ హాఫ్ లో సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే సెకండాఫ్ లో దెయ్యం – శకలక శంకర్ బ్యాక్ డ్రాప్ సీన్ కూడా బాగా నవ్విస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే.. అశ్విన్ ఓంకార్ ఉన్నంతలో బాగా చేసాడు. చేతన్ చీను నెగటివ్ షేడ్స్ ని చాలా బాగా చూపించాడు. ఇక ధన్య బాలకృష్ణ తన పాత్రలో డీసెంట్ అనిపించుకుంది. ఈశాన్య జస్ట్ గ్లామర్ అట్రాక్షన్ మాత్రమే.. కామెడీ కోసం తీసుకున్న ధన రాజ్, శకలక శంకర్, విద్యుల్లేకలు తమ కామెడీ పార్ట్ ని పర్ఫెక్ట్ గా చేసి అందరినీ నవ్వించారు. అతిధి పాత్రలో పూర్ణ, పోసాని కృష్ణమురళిలు ఓకే అనిపించారు. ముఖ్య పాత్రల్లో కనిపించిన రాజీవ్ కనకాల, పవిత్రా లోకేష్ లు సినిమాకి సెంటిమెంట్ టచ్ ని కనెక్ట్ చేయడంలో తమ వంతు బాధ్యనిని పర్ఫెక్ట్ గా చేసారు. ఇక మిగతావరు తమతమ పాత్రలకు పూర్తిన్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్ సెకండాఫ్. ఫస్ట్ హాఫ్ లో క్రియేట్ చేసిన సస్పెన్స్ ని ఓంకార్ సెకండాఫ్ లో క్రియేట్ చెయ్యలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ ని దెయ్యం ఉందని భయపెడుతూ ఓ రేంజ్ కి తీసుకెళ్ళిన ఓంకార్ సెకండాఫ్ స్టార్టింగ్ లోనే దెయ్యాన్ని కామెడీగా మార్చేసి బోర్ కొట్టించడం మొదలు పెడతాడు. అది ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అవ్వదు. అలాగే టైటిల్ ‘రాజుగారి గది’ అని పెట్టిన ఓంకార్ మొదటి నుంచి ఆ గదిలో ఏదో ఉందని చూస్పి చివరి అందులో ఏం లేదని కామెడీ చెయ్యడం సినిమాకి కనెక్ట్ అయిన ఆడియన్స్ సింక్ ని మిస్ చేసేలా ఉంది.
అలాగే ఉన్న ఒకే ఒక్క ట్విస్ట్ ని ఫస్ట్ హాఫ్ లోనే ఊహించేయగలరు. సెకండాఫ్ లో కామెడీ తగ్గడంతో పాటు సస్పెన్స్ అనే యాంగిల్ పూర్తిగా మిస్ అయ్యింది. పూర్ణ ఎపిసోడ్ ని చాలా సిల్లీ చేసెయ్యడం ఆడియన్స్ కి నచ్చదు. ఓవరాల్ గా సెకండాఫ్ లో కథనం సరిగా లేదు, అలాగే సినిమాలో లాజికల్ గా చాలా మిస్టేక్స్ ఉన్నాయి.
సాంకేతిక విభాగం :
సాంకేతికపరంగా అన్ని డిపార్ట్ మెంట్స్ బాగానే హెల్ప్ అయ్యాయి. ముందుగా తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాకి మంచి సెట్ వేసిన సాహి సురేష్ కి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. ఇక ఆ సెట్లోని ప్రతి లొకేషన్ ని చాలా బాగా ఉపయోగించుకున్న సినిమాటోగ్రాఫర్ జ్ఞానం... అద్భుతమైన విజువల్స్ ని సినిమాకి అందించాడు. ఆ విజువల్స్ కి సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగా హెల్ప్ అయ్యింది. సాయి కార్తీక్ రీ రికార్డింగ్ కి రాధా కృష్ణ చేసిన ఆడియోగ్రఫీ అదిరిపోయింది. సస్పెన్స్, కామెడీ ఎలిమెంట్స్ కి తను కంపోజ్ చేసిన మ్యూజిక్ పెద్ద హెల్ప్ అయ్యింది. ఎడిటర్ నాగరాజ్ ఫస్ట్ హాఫ్ ని సూపర్బ్ గా ఎడిట్ చేసారు కానీ సెకండాఫ్ ని ఆ రేంజ్ లో చేయలేదు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ చాలా బాగున్నాయి.
ఇక సినిమాకి కీలకం అయిన కథ – స్కీన్ ప్లే – దర్శకత్వం విభాగాలను ఓంకార్ డీల్ చేసాడు. ఓంకార్ ఈ సినిమా కోసం సోషల్ మెసేజ్ తో కూడిన మెయిన్ స్టొరీ లైన్ ని ఎంచుకోవడం బాగుంది. అలాగే కథను అల్లుకున్న విధానంలో ఓ 60% సక్సెస్ అయ్యాడు, 40% ఫైలయ్యాడు. ఆ 40% ని స్క్రీన్ ప్లే లో కూడా కవర్ చేయకుండా వదిలేయడం వల్ల ఫస్ట్ హాఫ్ బాగా వచ్చినా సెకండాఫ్ మాత్రం డల్ గా తయారైంది. ఇక దర్శకుడిగా ఒక కామన్ ఆడియన్స్ కోరుకునే అంశాలను ఇవ్వడంలో ఓంకార్ సక్సెస్ అయ్యాడు. ఓయాక్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా :
రాజుగారి గది : అంతగా భయపెట్టలేదు కానీ.. పొట్టచెక్కలయ్యేలా నవ్వించింది.