Courier Boy Kalyan Movie Review | Nithin Courier Boy Kalyan Review | Courier Boy Kalyan Movie Review And Rating

Teluguwishesh కొరియర్ బాయ్ కళ్యాణ్ కొరియర్ బాయ్ కళ్యాణ్ Get information about Courier Boy Kalyan Telugu Movie Review, Courier Boy Kalyan Movie Review, Nithin Courier Boy Kalyan Movie Review, Courier Boy Kalyan Movie Review And Rating, Courier Boy Kalyan Telugu Movie Talk, Courier Boy Kalyan Telugu Movie Trailer, Nithin Courier Boy Kalyan Review, Courier Boy Kalyan Telugu Movie Gallery and more only on TeluguWishesh.com Product #: 68259 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    కొరియర్ బాయ్ కళ్యాణ్

  • బ్యానర్  :

    గురు ఫిలింస్, మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్

  • దర్శకుడు  :

    ప్రేమ్ సాయి

  • నిర్మాత  :

    గురు ఫిలింస్

  • సంగీతం  :

    కార్తీక్, అనూప్ రూబెన్స్

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    సత్య పొన్‌మార్

  • ఎడిటర్  :

    ప్రవీణ్‌పూడి

  • నటినటులు  :

    నితిన్, యామీ గౌతమ్ త‌దిత‌రులు

Courier Boy Kalyan Movie Review

విడుదల తేది :

2015-09-17

Cinema Story

బిఏ ఫెయిల్ అయ్యి, ఏ ఉద్యోగం దొరకక సాదాసీదాగా జీవితాన్ని గడిపే ఓ కుర్రాడు కళ్యాణ్ (నితిన్). ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అనుకోకుండా కావ్య(యామీ గౌతమ్)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆ తర్వాత కావ్య కోసం ఓ కొరియర్ కంపెనీలో కొరియర్ బాయ్ గా చేరుతాడు. ఆ తర్వాత రోజు వీరిద్దరూ కలుసుకోవడం, ఇద్దరూ ప్రేమలో పడిపోవడం జరుగుతుంది. ఇదిలా వుండగా... విదేశాల్లో ఓ పెద్ద డాక్టర్ అయినటువంటి అశుతోష్ రానా తన స్వలాభాల కోసం పరిశోధన చేస్తాడు. ఆ పరిశోధనలో భాగంగా ఇండియాలోని కొన్ని హాస్పిటల్లో తన సీక్రెట్ ప్లాన్ ను అమలుచేస్తుంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఓ హాస్పిటల్ వార్డెన్ బాయ్.. హైద్రాబాద్ లో వుండే సామాజిక కార్యకర్త అయినటువంటి సత్యమూర్తి(నాజర్)కు విషయమంతా తెలిసి విధంగా ఒక కొరియర్ చేస్తాడు. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అసలు ఆ కొరియర్ చేరిందా లేదా? ఆ సీక్రెట్ ప్లాన్ ఏంటి? ఆ కొరియర్ వల్ల కళ్యాణ్ వచ్చిన కష్టాలెంటి? చివరకు ఏం జరిగింది? అనే ఆసక్తికర అంశాలను వెండితెర మీద చూస్తేనే బాగుంటుంది.

cinima-reviews
కొరియర్ బాయ్ కళ్యాణ్

‘చిన్నదాన నీకోసం’ తర్వాత నితిన్ హీరోగా నటించిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సమర్పణలో గురు ఫిలింస్ పతాకంపై మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్రేమ్ సాయి దర్శకత్వం వహించారు.

యామీ గౌతమ్ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై వున్న అంచనాలు భారీగా పెంచేస్తుంది. ఓ సాధారణమైన మనిషి.. అసాధారణమైన మనిషిగా మారడానికి ఒక్క సంఘటన చాలు! అనే కాన్సెప్టుతో రూపొందుతోంది.

ఈ చిత్రానికి కార్తీక్, అనూప్ రూబెన్స్ సంయుక్తంగా సంగీతం అందించారు. సందీప్ చౌతా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. రొమాంటిక్ లవ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్య పొన్‌మార్, ఎడిటర్: ప్రవీణ్‌పూడి, సంగీతం: కార్తీక్, అనూప్ రూబెన్స్, నేపథ్య సంగీతం: సందీప్ చౌతా, ఆర్ట్: రాజీవన్, మాటల సహకారం: కోన వెంకట్, హర్షవర్ధన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రేమ్‌సాయి.

ప్లస్ పాయింట్స్:

నితిన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు నితిన్ చేసిన సినిమాలన్నింటికన్నా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ చిత్రంలో కాస్త కొత్తగా ట్రై చేసాడని చెప్పుకోవచ్చు. యాక్షన్ ఎపిసోడ్స్ లలో ఇరగదీసాడు. ఇక యామీ గౌతమి గ్లామర్ పరంగా ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. తన పాత్ర మేరకు పర్వాలేదనిపించింది. ఇక నాజర్, అశుతోష్ రానాలు వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేసారు. మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు.

ఇక ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కథ. ఓ కొరియర్ బాయ్ జీవితంలో అనుకోకుండా వచ్చే కొన్ని పరిస్థితులను ఆధారంగా ఓ కథను అల్లడం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా సరదసరదాగా వున్నప్పటికీ, ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగుంది. ఇక సెకండ్ హాఫ్ లో అసలు స్టోరీ మొదలవుతుంది. ఆ తర్వాత ఒక సస్పెన్స్ ను చివర వరకు కంటిన్యూ చేసే ప్రయత్నం చేసారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ కథనం. డిఫరెంట్ కాన్సెప్టుతో కలిగిన కథను సింగిల్ పాయింట్ తో లాగేసినట్లుగా అనిపిస్తుంది. సినిమాను మరింత పర్ఫెక్ట్ తీసుంటే చాలా బాగుండేది. పైగా ఇందులో ఎలాంటి ఆసక్తికరమైన అంశాలు లేకపోవడం కాస్త బోర్ గా ఫీలవ్వాల్సి వస్తుంది. పాటలు పర్వాలేదనిపించినా... కానీ సంధర్బరహితంగా రావడంతో సినిమా ఫ్లో దెబ్బతీసాయి. స్టోరీ నెరేషన్ లో మరింత క్లారిటీ ఇచ్చి వుంటే బాగుండేది. అనవసరమైన పాటలు కట్ చేసి, స్ర్కీన్ ప్లే పరంగా మరింత జాగ్రత్తలు తీసుకొని ప్రజెంట్ చేసి వుంటే ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ అదిరిపోయేది. కానీ చివరకు ఓ నార్మల్ సినిమాగా తయారయ్యింది.

సాంకేతికవర్గం పనితీరు:

కథ విషయంలో దర్శకుడు ప్రేమ్ సాయి మంచి మార్కులే కొట్టేసాడు. కానీ స్ర్కీన్ ప్లే విషయంలో దెబ్బతిన్నాడు. ఇక కార్తీక్, అనూప్ రూబెన్స్ ల పాటలు బాగున్నాయి. సందీప్ చౌతా అందించిన రీరికార్డింగ్ అద్భుతంగా వుంది. సినిమాటోగ్రాఫర్ అందించిన విజువల్స్ సూపర్బ్. కొన్ని కొన్ని సన్నివేశాలు, పాటలలో విజువల్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
కొరియర్ బాయ్ కళ్యాణ్: డిఫరెంట్ కథతో వచ్చిన రొటిన్ సినిమా