Uttama Villain Telugu Movie Review | Kamal Hassan News

Teluguwishesh ఉత్తమ విలన్ ఉత్తమ విలన్ Get information about Uttama Villain Telugu Movie Review, Uttama Villain Movie Review, Kamal Haasan Uttama Villain Movie Review, Uttama Villain Movie Review And Rating, Uttama Villain Telugu Movie Talk, Uttama Villain Telugu Movie Trailer, Kamal Haasan Uttama Villain Review, Uttama Villain Telugu Movie Gallery and more Product #: 63582 2 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఉత్తమ విలన్

  • బ్యానర్  :

    CK ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్

  • దర్శకుడు  :

    రమేష్ అరవింద్

  • నిర్మాత  :

    సి.కళ్యాణ్

  • సంగీతం  :

    జిబ్రాన్

  • సినిమా రేటింగ్  :

    22  2

  • ఛాయాగ్రహణం  :

    శ్యామ్ దత్

  • ఎడిటర్  :

    విజయ్ శంకర్

  • నటినటులు  :

    కమల్ హాసన్, పూజా కుమార్, ఆండ్రియా, బాలచందర్, కె.విశ్వనాథ్, ఊర్వశి తదితరులు

Uttama Villain Movie Review

విడుదల తేది :

2015-05-01

Cinema Story

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఓ సూపర్ స్టార్ మనోరంజన్(కమల్ హాసన్). నటుడు మనోరంజన్ గా కె. మార్గదర్శి(కె.బాలచందర్) తీర్చిదిద్దితే... నటుడి నుంచి సూపర్ స్టార్ స్థాయికి నిర్మాత పూర్ణ చంద్రరావు(కె.విశ్వనాథ్) తీసుకొస్తారు. దీంతో మనోరంజన్ మొత్తం పూర్ణచంద్రరావు ఆధీనంలోకి వెళ్లిపోతాడు. ఇందులో భాగంగానే తాను ప్రేమించిన యామినిని కాదని, పూర్ణ చంద్రరావు కుమార్తె వరలక్ష్మీని(ఊర్వశి)ని పెళ్లి చేసుకుంటాడు.

ఆ తర్వాత కొద్దికాలానికి మనోరంజన్ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నానని తెలుసుకొని, తన గురువు కె.మార్గదర్శితో మళ్లీ ఓ సినిమా చేయాలని అనుకుంటాడు. తెయ్యమ్ కళ నేపథ్యంలో మృత్యుంజయుడిగా పేరు తెచ్చుకున్న ఉత్తముడి కథ ఆధారంగా మనోరంజన్, మార్గదర్శిల ప్రాజెక్ట్. వీరిద్దరి కథ సమాంతరంగా నడుస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు చావుకు దగ్గరవుతున్న మనోరంజన్ ఈ ఉత్తముడి పాత్రలో ఎలా నటించాడు? చివరకు ఏం జరిగింది? అనే అంశాలను తెలుసుకోవాలంటే.. ఈ సినిమాను వెండితెరపై చూడాల్సిందే!

cinima-reviews
ఉత్తమ విలన్

కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘ఉత్తమ విలన్’. పూజా కుమార్, ఆండ్రియాలు హీరోయిన్లుగా నటించారు. అలాగే అగ్రనటీనటులైన బాలచందర్, కె.విశ్వనాథ్, ఊర్వశి వంటి భారీతారాగణం ఈ సినిమాలో నటించారు. ఈ చిత్రాన్ని కమల్ తన గురువు గారైన కె.బాలచందర్ గారికి అంకితం ఇస్తున్నారు. నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేస్తున్నారు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న ఈ చిత్రాన్ని ముందుగా మే 1వ తేదిన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఫైనాన్సియల్ సమస్యల వల్ల ఈ చిత్రాన్ని మే 2వ తేదిన విడుదల చేసారు. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

Cinema Review

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కమల్ హాసన్. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ఈ సినిమాకు కథ, కథనంను కూడా కమల్ అందించారు. కమల్ మనోరంజన్, ఉత్తముడిగా ద్విపాత్రాభినయంలో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఉత్తముడి పాత్రకోసం చాలా కష్టపడ్డారు. ఈ రెండు పాత్రలకు కూడా కమల్ తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరనే విధంగా అద్భుతంగా నటించారు.

ఇక హీరోయిన్లు ఆండ్రియా, పూజా కుమార్ లు వారి వారి పాత్రల మేరకు బాగానే నటించారు. ఈ ఇద్దరు హీరోయిన్ల హాట్ హాట్ అందాల ప్రదర్శన పర్వాలేదనిపించాయి. ఇక కె.విశ్వనాథ్, బాలచందర్, ఊర్శశి వంటి అగ్ర తారలు... వారి వారి పాత్రలలో ఒదిగిపోయారు. ఈ సినిమాకు కథ, ఫస్ట్ హాఫ్ మొదట్లో, సెకండ్ హాఫ్ చివర్లలోని 30 నిమిషాలు ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాకు భారీ మైనస్ పాయింట్ కథనం. ‘ఉత్తమ విలన్’ సినిమా కథ ఎంత బాగుందో... ఈ కథను అనుకున్న విధంగా చూపించడంలో అంతే విఫలమయ్యారు. అద్భుతమైన రెండు కథలను సరిగ్గా చూపించలేకపోయారు. ఇక అక్కడక్కడ కథను డిస్టర్బ్ చేసే విధంగా కొన్ని కొన్ని విసుగుపుట్టించే సన్నీవేశాలు ఇబ్బందిగా వున్నాయి. ఇక ఎంటర్ టైన్మెంట్ బాగా లోపించింది. ఎంటర్ టైన్మెంట్, కథనం పరంగా బాగుండి వుంటే ఈ సినిమా భారీ విజయం సాధించేది.

సాంకేతికవర్గం పనితీరు:

ఈ సినిమాకు కథ, కథనంను అందించిన కమల్ హాసన్ గురించి చెప్పుకుందాం. కమల్ ఈ చిత్రానికి అద్భుతమైన కథను అందించారు. కానీ కథనం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఇక దర్శకుడిగా రమేష్ అరవింద్ మంచి మార్కులే కొట్టేసాడు. దర్శకుడిగా తన తొలి సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించి మంచి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక శ్యాందత్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. జిబ్రాన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించాయి. ఎడిటింగ్ విషయంలో ఎడిటర్ మరింత జాగ్రత్తలు వహించి వుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
ఉత్తమ విలన్: కమల్ లో గొప్ప నటుడిని ఆవిష్కరించిన మరో ‘ఉత్తమ’ చిత్రం