Teluguwishesh బ్రదర్ ఆఫ్ బొమ్మాళి బ్రదర్ ఆఫ్ బొమ్మాళి allari naresh brother of bommali movie review : allari naresh brother of bommali movie released by november 7th. karthika plays role of sister to allari naresh in brother of bommali movie monal gajjar is heroine of the movie, allari naresh had high expectations on this movie Product #: 57755 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    బ్రదర్ ఆఫ్ బొమ్మాళి

  • బ్యానర్  :

    శ్రీ సినిమా

  • దర్శకుడు  :

    చిన్ని కృష్ణ

  • నిర్మాత  :

    అమ్మిరాజు కనుమిల్లి

  • సంగీతం  :

    శేఖర్ చంద్ర

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    ఎం.ఆర్. ఫలనికుమార్

  • ఎడిటర్  :

    గౌతంరాజు

  • నటినటులు  :

    అల్లరి నరేష్(హీరో), మోనాల్ గజ్జర్ (హీరోయిన్), కార్తిక, అలీ, వెన్నెల కిశోర్, రవిబాబు, జయప్రకాష్ తదితరులు

Brother Of Bommali Movie Review

విడుదల తేది :

2014-11-07

Cinema Story

రామకృష్ణ ( అల్లరి నరేష్), లక్ష్మి(కార్తిక) ఇద్దరూ కవలలు. రామకృష్ణ కాస్త అమాయకుడు, సర్ధుకుపోయే స్వభావం ఉన్నవ్యక్తి కాగా.., లక్ష్మి మాత్రం మహా మొండిఘటం. ఎదురు మాట్లాడితే గొడవ పెట్టుకోవటం, ఫైట్లు చేయటం అలవాటు. లక్ష్మి ఫైట్ చేస్తే.., ప్రత్యర్ధుల నుంచి రాముకు బెదిరింపులు వచ్చేవి. ఇలా నిత్యం గొడవలు, హెచ్చరికలతో కాలం గడుస్తుండగా.., ఓ సారి అనుకోని సంఘటనలో శృతి(మోనాల్ గజ్జర్)ను చూసిన రామకృష్ణ ప్రేమలో పడతాడు. అటు లక్ష్మి సాయంతో శృతి కూడా రామకృష్ణను ప్రేమిస్తుంది. ఆ తర్వాత వీరిద్దరూ ఎలా పెళ్లి చేసుకుంటారు.., కార్తికకు పెళ్ళి అవుతుందా, కాదా అనేవి థియేటర్ కు వెళ్ళి చూడండి.

cinima-reviews
బ్రదర్ ఆఫ్ బొమ్మాళి

అల్లరి నరేష్, కార్తిక కాంబినేషన్ లో వచ్చిన తొలి మూవీ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’. కొన్నాళ్ళుగా ఫ్లాపులు ఎదుర్కుంటున్న నరేష్, సినిమాలు ఛాన్సులు తక్కువగా ఉన్న కార్తిక ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. తమను తాము నిరూపించుకునేందుకు అన్నాచెల్లెలుగా సినిమాలో నటించారు. కార్తిక, నరేష్ కలిసి నటించటంతో పాటు, సినిమాలో చాలా యాక్షన్ సీన్లు చేయటంతో ఎలా ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. చిన్నికృష్ణ డైరెక్షన్ లో అమ్మిరాజు నిర్మించిన ఈ సినిమా నవంబర్ 7న విడుదల అయింది. ఈ మూవీ రివ్యూను మీకోసం అందిస్తున్నాం.

ప్లస్ పాయింట్స్ :

కొద్దికాలంగా పూర్తి కామెడి సినిమాలు లేక ఇబ్బందిపడుతున్న తెలుగు ప్రేక్షకులకు ఇదో కానుక అని చెప్పవచ్చు. ఇందులో మాగ్జిమమ్ కామెడి ఉంది. ఇక హీరో అల్లరి నరేష్ తనలోని కమెడియన్ ను మరోసారి బయటకు తీశారు. అటు కార్తిక తనలోని కొత్త కోణంను ప్రేక్షకులకు పరిచయం చేసింది. కార్తిక-నరేష్ కాంబినేషన్ సీన్లు థియేటర్ లో నవ్వులు పూయించటంతో పాటు సెంటిమెంట్ కూడా పండించాయి. ఫస్ట్ ఆఫ్ అంతా ఫుల్ కామెడి ఉంది. ఇక యాక్షన్ సీన్లు కార్తికకు సెట్ అయ్యాయి.

మైనస్ పాయింట్లు :

కామెడి సీన్లు అన్నిచోట్లా నవ్వు తెప్పించటంలో ఫెయిల్ అయ్యాయి. అందులోనూ ఫస్ట్ ఆఫ్ చాలావరకు కామెడి ఉండగా.., సెకండ్ పార్ట్ లో ఇది తగ్గింది. ఇక సన్నివేశాలు కూడా చాలావరకు పాత సినిమాల్లో వచ్చినవిగా ఉన్నాయి. సీన్లు వస్తున్నపుడు ఆ సినిమాలో ఇలా ఉంది. అప్పట్లో కూడా అచ్చం ఇలానే చేసారు అని ప్రేక్షకులు తాము చూసిన పాత సినిమాలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. క్లైమాక్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రారంభంలో వీర లెవల్లో ఫైట్ చేసిన కార్తిక చివరకు వచ్చే సరికి సెంటిమెంట్ ఎక్కువ అవుతుండటంతో యాక్షన్ సీన్లు కొనసాగించేందుకు వీలు పడలేదు. చిన్న కథను సాగతీసి సినిమా తీసినట్లుంది. సినిమాటోగ్రఫీ కూడా బాలేదు.

Cinema Review

కళాకారుల పనితీరు :

పైన చెప్పుకున్నట్లుగానే హీరో అల్లరి నరేష్ తానేంటో నిరూపించుకున్నాడు. ఇక కార్తిక తనలోని కొత్త కోణంను చూపించింది. ఈ సినిమాతో నాయర్ కు కొత్త ఆఫర్లు రావచ్చు. ఇక హీరోయిన్ మొనాల్ గజ్జర్ కూడా తన పాత్రకు న్యాయం చేసేలా నటించింది. మిగతా కామెడి ఆర్టిస్టులు కూడా పాత్రలకు న్యాయం చేశారు. ఇక డైరెక్టర్ చిన్ని కృష్ణకు మంచి మార్కులు వేయవచ్చు. అయితే తన పని సమర్ధంగా చేయటంలో కొన్నిచోట్ల విఫలం అయ్యాడు. రొటీన్లు సీన్లు చూపించేందుకే చిన్ని పరిమితం అయ్యాడు. దీంతో కొత్తదనం కొరవడింది. అటు సంగీతం పరంగా కూడా ప్రేక్షకులు నిరాశచెందారు. శేఖర్ చంద్ర ట్యూన్లు అభిమానులను ఆకట్టుకోలేదు. అయితే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. ఇక సినిమాటోగ్రాఫర్ విజయ్ కూడా కెమెరా పనితనం చూపించలేకపోయాడు. అందమైన సన్నివేశాలు, లొకేషన్లను కూడా సరిగా కవర్ చేయలేదు. కధను సాగతీయటంతో ఎడిటర్ గౌతంరాజుకు కత్తిరించటంలో ఇబ్బంది ఎదురయినట్లు కన్పిస్తోంది. రామ్ లక్ష్మణ్ ఫైట్ సీన్లు కధకు తగ్గట్టుగా ఉన్నాయి. అటు శ్రీ సినిమా వారి నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. చివరగా ఈ మూవీకి డైలాగులు బాగా సెట్ అయ్యాయి. కొత్త రైటర్లు నరేష్ నమ్మకాన్ని నిలబెట్టారు.

చివరగా : రొటీన్ అయినా.., సరదాగా చూసేందుకు సజెస్టెడ్.

కార్తిక్

Movie TRAILERS

బ్రదర్ ఆఫ్ బొమ్మాళి

play