Teluguwishesh జంప్‌ జిలాని జంప్‌ జిలాని Jump Jilani Review, Jump Jilani Telugu Movie Review, Jump Jilani Movie Review and Rating, Telugu Jump Jilani Review, Jump Jilani Movie Stills, Jump Jilani Movie Trailer, Videos, Gallery, Wallpapers and more on Teluguwishesh.com Product #: 53484 2/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    జంప్‌ జిలాని

  • బ్యానర్  :

    రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, వెంకటేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌

  • దర్శకుడు  :

    ఇ. సత్తిబాబు

  • నిర్మాత  :

    అంబికా రాజా, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

  • సంగీతం  :

    విజయ్‌ ఎబెంజర్‌

  • సినిమా రేటింగ్  :

    2/52/5  2/5

  • ఛాయాగ్రహణం  :

    దాశరథి శివేంద్ర

  • ఎడిటర్  :

    గౌతంరాజు

  • నటినటులు  :

    అల్లరి నరేష్‌, ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్‌, పోసాని కృష్ణమురళి

Jump Jilani Movie Review

విడుదల తేది :

జూన్‌ 12, 2014

Cinema Story

తన పూర్వీకుల నుండి వారసత్వంగా వస్తున్న హోటల్ బిజినెస్ ని నిర్వహిస్తుంటాడు సత్తిబాబు (అల్లరి నరేష్ ). కానీ ఆ వ్యాపరం ఎంతో కష్టంగా నడుస్తుంది. ఓసారి ఫుడ్ ఇన్ స్పెక్టర్ (మాధవి ) ఇషా చావ్లా  ఆ హోటల్ కి నోటీసులు పంపుతుంది. దాంతో మరిన్ని కష్టాలు ఎదురవుతాయి. ఆమెతోనే ప్రేమలో పడిన సత్తిబాబు ఎలాగైనా ఆ హోటల్ ని పైకి తేవాలని అనుకుంటున్న సమయంలో అతని కవల సోదరుడు రాంబాబు (అల్లరి నరేష్‌) పెద్ద దొంగ.  సత్తిబాబు హోటల్‌ ఉండే సైట్‌ మీద కన్నేని కొంత మందితో కలిసి అందులో వాటా రాయించుకుంటాడు. సత్తిబాబు ప్రేమించిన మాధవికి ఫ్యాక్షనిస్ట్‌ ఉగ్రనరసింహారెడ్డితో (పోసాని) నిశ్చితార్ధం జరుగుతుంది. ఆమెను దక్కించుకోవడానికి సత్తిబాబు ఏం చేస్తాడు ? మాధవిని తనదాన్ని చేసుకొని తన హోటల్‌ని ఎలా కాపాడుకుంటాడా? లేదా అన్నది తెర పైన చూడాల్సిందే.

cinima-reviews
జంప్‌ జిలాని

టాలీవుడ్ లో చాలా మంది నిర్మాతలు మిమినం గ్యారెంటీ హీరో ఎవరంటే అల్లరి నరేష్ అని చూపించేవారు. ఆయనతో సినిమాలు తీస్తే పెట్టిన పెట్టుబడికి ఢోకా ఉండదనే ధీమాతో ఉండేవారు. కానీ గత కొంత కాలంగా అల్లరి నరేష్ చేస్తున్న సినిమాల్లో కామెడీ పస తగ్గడం, పెద్ద హీరోలు సైతం కామెడీ చేసేస్తుండటంతో నరేష్ కామెడీ అంటే బోర్ కొట్టేసింది జనాలకు . యాక్షన్ అండ్ కమర్షియల్ జోనర్ లో సినిమాలు తీస్తూ కామెడీని సైడ్ ట్రాక్ పట్టించడంతో సినిమాల సక్సెస్ రేటు తగ్గింది. ఇటీవల రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘లడ్డూ బాబు ’ ఆటం బాంబులా పేలిన తరువాత కామెడీ చిత్రాల దర్శకుడు సత్తిబాబుతో ‘జంప్ జిలానీ ’ అంటూ తమిళ సినిమా డబ్బింగ్ లో నటించాడు. తమిళంలో అంతంత మాత్రంగానే పేరు తెచ్చకున్న ఈ సినిమాను నరేష్ తన నటనతో, కామెడీతో హిట్ టాక్ తెచ్చుకునేలా నటించాడా ? లేదా ? అన్నది ఈ సినిమా రివ్యూ ద్వారా చూద్దాం.

కామెడీ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న సత్తిబాబు గతంలో ఇలాంటి సినిమాల్ని ఎన్నో చేశాడు. నరేష్ కూడా ఇలాంటి తరహా పాత్రల్ని పోషించి మెప్పించాడు. కానీ మాస్, క్లాస్ కాంబినేషన్ తో ఈవీవీ చేసిన ప్రయోగాన్ని స్పూర్తిగా తీసుకుని రూపొందించిన సత్తిబాబు, రాంబాబు పాత్రలు ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. కథ లో పస లేకపోవడం, దానికి తోడుగా కథనం కూడా పేలవంగా ఉండటంతో అంతా గందరగోళంగా మారింది. కామెడీ హీరో ద్విపాత్రాభినయం చేసినప్పుడు ఆ క్యారెక్టర్ల నడుమ కామెడీని ఆశిస్తారు. కానీ ఈ చిత్రంలో డ్యూయెల్‌ రోల్‌ శుద్ధ దండగ అనిపిస్తుంది. మొదటి అరగంటలోనే సినిమా బోర్ వచ్చేసి ఇంటర్వెల్లో గేట్ తీస్తే జంప్ అయిపోవడం బెస్ట్ అనే ఫీలింగ్ కి వస్తారు.

Cinema Review

ప్రతి సినిమాలో తమకిచ్చిన కామెడీ పాత్రల్ని బాగానే పోషించే నరేష్ ఈ సినిమాలో ద్విపాత్రాభినం చేశాడు. తనలోని నటనటనను ఈ రెండు ప్రాత్రల్లో ఏమీ ప్రదర్శించలేదనే అనిపిస్తుంది. రెండు పాత్రలు ఒకేలా చేశాడు. నటుడిగా ఇందులో వేయించుకున్న మార్కులు ఏమీ లేవు కానీ, డ్యూయల్ రోల్ చేశాడనే త్రుప్తి ఆయనకు మిగిలింది. ఇషా చావ్లా ఒకటే ఎక్స్‌ప్రెషన్‌తో చాలా సేపు చిరాకు పెడుతుంది. ఇందులో ఆమె పర్సనాలిటీ నరేష్ సరసన సూట్ అవ్వలేదు. మరో హీరోయిన్ గా నటించిన స్వాతి దీక్షిత్‌ కేవలం అందాల ప్రదర్శకే పరిమితం అయ్యింది. నటన నటనలో ఏం వైవిధ్యం కనబర్చలేదు. ఆమె బాడీ లాంగ్వేజ్ ఆమెకు సూట్ అవ్వలేదు. పోసాని మురళీ క్రిష్ణ, రావు రమేష్, వేణు మాధవ్, రఘబాబు, కోట, ఎమ్మెస్ నారాయణ పాత్రలు సినిమాకు ఉపయోగ పడేవిధంగా లేవు.

సాంకేతిక వర్గం పనితీరు:

చేసేది కామెడీ సినిమా అనే విషయం తెలిసి కూడా పాటల్ని హై రేంజ్ లో తెరకెక్కించాలని చూడటం, తమిళ దర్శకుడి సంగీతం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లేదు. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటర్‌కి పూర్తి స్వేఛ్ఛనివ్వలేదు. దీంతో రెండవ భాగం గందరగోళంగా తయారవ్వటమే కాకుండా, సినిమాలో అనవసర సీన్లు ఎక్కువయ్యాయి. సినిమా నిర్మాణ క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గలేదు. ఉన్నంతలో బాగానే తీశారు. కామెడీ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించే సత్తిబాబు తమిళ సినిమాను తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లు మలచడంలో విఫలం అయ్యాడు. ఓవరాల్‌గా మాత్రం సత్తిబాబు బాగా ఫెయిలయ్యాడు. మాటల రచయిత పంచ్‌ కంటే ప్రాసకే ప్రాధాన్యత ఇచ్చాడు.

చివరగా :

అల్లరి నరేష్ సినిమా అంటే ఎగబడే వారు.. ఈ సారి జంప్ అవ్వడం బెటర్.

more