Teluguwishesh కొత్త జంట కొత్త జంట Get latest updates on Kotha Janta Telugu Movie Review, Rating, Kotha Janta Review, Kotha Janta Movie Review, Telugu Kotha Janta Review, Directed by Maruthi Starring Allu Sirish and Regina Cassandra, Kotha Janta Movie Stills, Trailers, Songs and more. Product #: 52297 2.75/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    కొత్త జంట

  • బ్యానర్  :

    గీతా ఆర్ట్స్

  • దర్శకుడు  :

    మారుతి

  • నిర్మాత  :

    బన్నీ వాసు

  • సంగీతం  :

    జెబి

  • సినిమా రేటింగ్  :

    2.75/52.75/5  2.75/5

  • ఛాయాగ్రహణం  :

    రిచర్డ్ ప్రసాద్

  • ఎడిటర్  :

    అశోక్ కురుబ

  • నటినటులు  :

    అల్లు శిరీష్, రెజీనా

Kotha Janta Movie Review

విడుదల తేది :

మే 1 2014

Cinema Story

శిరీష్ (అల్లు శిరీష్ ) చిన్నప్పటి నుండి పక్కా స్వార్థంతో పెరుగుతాడు. పెద్దయ్యాక కూడా ప్రతి దానిని స్వార్థానికే వాడుకుంటాడు. తాను పని చేస్తున్న టీవీ ఛానల్లో సువర్ణ (రెజీనా) కూడా పనిచేస్తుంది. ఈమె కూడా స్వార్దపరురాలే. కానీ శిరీష్ అంత మాత్రం కాదు. సువర్ణ శీరీష్ తో ప్రేమలో పడిన తరువాత ప్రేమ కోసం స్వార్థాన్ని పక్కన పెట్టినా, శిరీస్ మాత్రం ఆ ప్రేమను స్వార్థానికే వాడుకోవాలని చూస్తాడు. శిరీషే తనకు అన్నీ అనుకొన్న త‌రుణంలో త‌న స్వార్థం కోస‌మే త‌న‌ని ప్రేమిస్తున్నాడ‌న్న విష‌యం సువ‌ర్ణకు తెలుస్తుంది. దాంతో చీ కొట్టి వెళ్లిపోతుంది. చివరకు శిరీష్ లో మార్పు ఎలా వస్తుంది. త‌న స్వార్థం వ‌దిలి మంచి ప్రేమికుడిలా మారి సువర్ణ ప్రేమను గెలుస్తాడా లేదా అన్నదే ఈ చిత్ర కథ

cinima-reviews
కొత్త జంట

అల్లు వారి కుటుంబం నుండి వారి అండదండలు చూసుకొని తాను కూడా హీరో అయిపోదామని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీశ్ కి తాను నటించిన మొదటి సినిమాతో దక్కాల్సిన ‘గౌరవం ’ దక్కలేక పోవడంతో, తన అద్రుష్టాన్ని పరీక్షించుకోవడానికి హిట్ బూతు చిత్రాల దర్శకుడు మారుతితో ‘కొత్త జంట ’ అనే సినిమాలో నటించాడు. ఇక మారుతి తన పై పడిన బూతు ముద్రను తొలగించుకోవాలని క్లీన్ గా తీసే ప్రయత్నం చేశాడు. అల్లు శిరీష్ కి కావాల్సిన విజయాన్ని మారుతి ఈ సినిమా ద్వారా ఇచ్చాడో లేదో సినిమా రివ్వూ ద్వారా చూద్దాం.

Cinema Review

అల్లు శిరీష్ తన మొదటి సినిమా ‘గౌరవం ’ లో ప్రేక్షకుల నుండి విమర్శలు అందున్నాడు. కానీ ఆ చిత్రంతో పోలిస్తే మెరుగైన నటన కనబర్చాడు. కానీ డైలాగు డెలివరీలో, ఎక్సప్రెషన్స్ లో చాలా మెరుగవ్వాలి. కొన్ని సీన్స్‌ లాంగ్‌ షాట్స్‌లో కానిచ్చేయడం లేదా వెనుక బ్రైట్‌ లైటింగ్‌తో కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. డాన్సులు, ఫైట్స్ బిగదీసుకొని చేశాడు. ఇక ఇందులో హీరోయిన్ గా నటించిన రెజీనా తన మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. ఇందులో కూడా ఆమె నటనతో పాటు, ఆమెను కూడా చాలా క్యూట్ గా చూపించాడు. అందం, అభినయం కలగలిసిన రెజీనాకి నటిగా తన టాలెంట్‌ చూపించే స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌ దక్కింది. ప్తగిరి కమెడియన్‌గా ప్రతి సినిమాలో ఆకట్టుకుంటున్నాడు. పోసాని కూడా న‌వ్వులు పంచాడు. మిగతా వారు తమ పరిదిలో నటించే ప్రయత్నం చేశారు.

సాంకేతిక విభాగం

జెబి అందించిన పాటలు వినపొంపుగా, ఎబ్బెట్టు లేకుండా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా ఫర్వాలేదు. ముఖ్యంగా ‘‘ప్రేమ రాక్షసి ’’ అనే పాట నేపధ్య సంగీతంగా వస్తుంటుంది. సాహిత్య విలువలు కూడా బాగాన్నాయి. సినిమాటో గ్రఫి కూడా నీట్ గా ఉంది. ఎడిటింగ్ తో పాటు మిగతా విభాగాలు కూడా మారుతి సినిమా స్టాండర్ట్స్ కి తగ్గట్లు ఉన్నాయి. ఈ సినిమాలో మారుతి తన కామెడీ మార్క్ ని చూపించాడు. మొత్తంగా చెప్పాలంటే టెక్నికల్ గా ఈ సినిమా గీతా ఆర్ట్స్ క్వాలిటీకి తగ్గట్లు ఉంది. రియాలిటీ షో నేప‌థ్యం మాత్రం పాత‌ది. సుడిగాడులో ఇలాంటి స్నూఫ్ వ‌చ్చేసింది కూడా. సెకండాఫ్‌ని మ‌రింత ట్రిమ్ చేసుంటే బాగుండేది.